pizza
Tamanna interview about Oopiri
‘ఊపిరి’లో నాగార్జునగారి యాక్టింగ్ చూసి చాలా మంది ఇన్ స్ఫైర్ అవుతారు - తమన్నా
You are at idlebrain.com > news today >
Follow Us

15 March 2016
Hyderaba
d

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాకాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బ ందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. ఈ సినిమా మార్చి 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నాతో ఇంటర్వ్యూ...

క్యారెక్టర్ గురించి....
-ఇందులో మిలయనీర్ కు పర్సనల్ అసిస్టెంట్ కీర్తి పాత్ర చేశాను. బాగా చదువుకుని, హుందాగా, బాధ్యతగల పాత్ర. అలాగే మిలియనీర్ అయిన నాగార్జునగారికి, కార్తీకి మధ్య వారధిలా వ్యవహరిస్తాను. కథ వినగానే నా పాత్ర డిఫరెంట్ అనిపించడంతో చాలా ఎగ్జయిట్ మెంట్ తో సినిమాలో పార్ట్ అయ్యాను.

స్టయిల్ గా కనపడటం కోసం....
-వంశీ పైడిపల్లిగారికి స్టయిలిష్ డైరెక్టర్ అని పేరుంది. ఈ సినిమాలోకి నేను ఎంటర్ కాగానే ముందు నాలుక్ విషయంలో దర్శకుడు వంశీ కేర్ తీసుకున్నారు. దుస్తులు, హెయిర్ స్టయిల్ ఇలా ప్రతి విషయంలో ఓ రిచ్ లుక్ లో కనపడేలా శ్రద్ధ కనపరిచారు. లుక్, క్యారెక్టర్ పరంగా టెయిట్ డ్రెసెస్ కూడా వేశాను. ఇలాంటి కేరింగ్ వల్ల సినిమాలో టోటల్ లుక్ కొత్తగా కనపడుతుంది.

డబ్బింగ్ చెప్పడానికి రీజన్....
-ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ప్రతిదీ నాకు ఓరిజినల్ ఫీల్ ఉన్నట్లు అనిపించింది. అలాంటి ఫీల్ ఉన్నప్పుడు నేనెందుకు డబ్బింగ్ చెప్పకూడదనిపించింది. అలా చేస్తే పాజిటివ్ గా ఉంటుంది కదా అనిపించింది. అందుకనే నేను డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని దర్శకుడు వంశీకి చెప్పాను. వంశీ కూడా ఐడియా బావుందని ఎంకరేజ్ చేశారు. అయితే నేను తెలుగులో మాత్రమే డబ్బింగ్ చెప్పాను. తమిళంలో డబ్బింగ్ చెప్పలేదు. భవిష్యత్ లో కూడా డబ్బింగ్ చెబుతాను.

Tamanna interview gallery

అందుకనే చూడలేదు....
-నేను ఫ్రెంచ్ ఇన్ టచ్ బుల్స్ మూవీ చూడలేదు. ఆ సినిమాతో పోల్చితే నా క్యారెక్టర్ లో చాలా మార్పులు చేర్పులు చేశారు. ఆ విషయం నాకు షూటింగ్ టైంలో జరిగే డిస్కషన్ వల్ల తెలిసింది. డైరెక్టర్ వంశీ నా పాత్ర ప్రకారం ఏదైతే చెప్పారో దాన్ని నేను ఫాలో అవుతూ వచ్చాను.

అంత సులువుకాదు...
-చెయిర్ లో కదలకుండా కూర్చొని యాక్ట్ చేయడమంటే అంత సులువుకాదు. నాగార్జునగారు కదలుతున్నారో, లేదో చూడటానికి ఇద్దరు అసిస్టెంట్స్ ను పెట్టారు. ఇలాంటి ఓ పాత్రలో నాగార్జునగారు నటించడం ఆయన గొప్పతనం. ఈ సినిమాలో ఆయన పాత్రను చూసి చాలా మంది ఇన్ స్ఫైర్ అవుతారు.

ఇంకా స్టార్ట్ కాలేదు...
-బాహుబలి 2 లో నా పార్ట్ చిన్నదిగా ఉంటుంది. అయితే నన్ను ఇంకా పిలవలేదు. నా పార్ట్ స్టార్ట్ కాగానే ఫోన్ చేస్తామని అన్నాను.

స్పెషల్ సాంగ్స్....
-పరిక్యులర్ గా స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయాలని వెయిట్ చేయడం లేదు.

బ్యాలెన్డ్ యాక్టర్....
-నేను గతంలో కార్తీతో రెండు సినిమాల్లో నటించాను. మా కాంబినేషనల్ లో ఇది మూడో సినిమా. నటుడుగా తను ఇంకా మెచ్యూర్ అయ్యాడు. సాధారణంగా కొంతమంది మెథడికల్ యాక్టింగ్, కొందరు స్పాంటేనియస్ యాక్టింగ్ చేస్తారు. అయితే కార్తీ ఈ రెండింటిని బ్యాలెన్స్ డ్ గా చేస్తాడు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
-ఊపిరి రిలీజ్ అవుతుంది. బాహుబలి 2 లో నటించాల్సి ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ధర్మదొరై సినిమాలో నటించాను. అలాగే ప్రభుదేవా, నేను, సోనూసూద్ కలిసి యాక్ట్ చేసే మూవీ హిందీ, తెలుగు, తమిళంలో తెరకెక్కించనున్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved