pizza
Tejus Kancharla interview (Telugu) about Hushaaru
ఇక‌పై అన్నీ సోలో హీరోగానే! - తేజస్ కంచ‌ర్ల
You are at idlebrain.com > news today >
Follow Us

12 December
Hyderabad

బెక్కం వేణుగోపాల్ నిర్మించిన `హుషారు`లో ఓ హీరోగా న‌టించారు తేజస్ కంచ‌ర్ల‌. ఈ నెల 14న విడుద‌ల కానున్న ఆ సినిమా గురించి తేజ చెప్పిన విశేషాలు..

* హుషారుగా ఉన్న‌ట్టున్నారు?
- హుషారుక‌న్నా ఎగ్జ‌యిట్‌మెంట్‌, టెన్ష‌న్ ఎక్కువ‌గా ఉంది. రిలీజ్ త‌ర్వాత దాని రిజ‌ల్ట్ ని బ‌ట్టి ఈ హుషారు ఇలాగే ఉంటుందా? లేదా అనేది డిసైడ్ అవుతుంది. నేనైతే హుషారు గానే ఉంటుంద‌ని అనుకుంటున్నా.

* ఉల‌వచారు బిర్యానీ వ‌చ్చి చాన్నాళ్ల‌యిన‌ట్టుంది?
- ఉల‌వ‌చారు బిర్యానీ వ‌చ్చి నాలుగేళ్ల‌యింది. ఆ త‌ర్వాత నేను వేసిన రాంగ్ స్టెప్ కేటుగాడు. దాని త‌ర్వాత మామూలుగా అంత ధైర్యం చేయ‌లేక‌పోయా. చాలా స్ట్ర‌గుల్ అయి వ‌చ్చాను. ఇప్పుడు మ‌ర‌లా త‌ప్పు చేస్తే మ‌ళ్లా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి సినిమా చేయాలి.

* న‌లుగురిలో ఒక్క‌డిగా చేయ‌డం ఓకేనా?
- ఒక్క‌డైనా.. అది కూడా లీడే చేయాల‌ని అనుకున్నా. మెయిన్ లీడ్ కాబ‌ట్టి చేశా. బ్యాన‌ర్ బావుంది, మ్యూజిక్ బావుంద‌ని చేశా.

* హుషారు క‌థ ఏంటి?
- ఫ్రెండ్ షిప్ మీద ఈ మ‌ధ్య క‌థ‌లు రావ‌డం లేదు. ఈ న‌గ‌రానికి ఏమైంది అని ఒక‌టి వ‌చ్చింది. మా సినిమా ఫ్రెండ్‌షిప్ మీదే ఉంది. మాసినిమా, ఆ సినిమా ఒకేసారి మొద‌లైంది. ఫ్రెండ్‌షిప్ వేల్యూ ఏంటని తెలిపే సినిమా ఇది. క‌థ న‌చ్చింది. ఆడియో న‌చ్చింది. టెక్నీషియ‌న్లు మేడ్ మై డిసిషెన్‌. క‌థ క‌న్నా.. వాళ్లే ఇంపార్టెంట్ అనిపించింది.

* నెక్స్ట్ సినిమాలేం ఉన్నాయి?
- దీని త‌ర్వాత పెద్ద బ్యాన‌ర్‌లో ఒక‌టి ఉంది. ఇంకా క‌థ ఫైన‌ల్ కాలేదు. అయ్యాక చెబుతాం. ఆ త‌ర్వాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంది.

* మీరు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేశార‌ట క‌దా?
- అవునండీ. నీకు నాకు డాష్ డాష్ సినిమా నేను చేయాల్సింది. ఏమైందో తెలియ‌దు ఆ సినిమాలోకి ప్రిన్స్ వ‌చ్చాడు. దాంతో తేజ‌గారు న‌న్ను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా చేయ‌మ‌న్నారు. ఆ త‌ర్వాత మ‌ర‌లా క‌లిసి సినిమా చే్ద్దామ‌నుకున్నాం. అయితే ఆ సినిమా ఆడ‌క‌పోయే స‌రికి మా సినిమా తెరమీద‌కు రాలేదు.

* హుషారులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ప్ర‌తి గ్యాంగ్‌లో ఒక‌డు ముందుండి లీడ్‌చేస్తాడు. అది నా పాత్ర‌. ఈ సినిమాలో నా పేరు ఆర్య‌. చ‌దువ‌యిపోయి ఖాళీగా తిరిగే పాత్ర‌. కాస్త ఫ్ర‌స్ట్రేష‌న్ ఉన్న పాత్ర‌. నాకు న‌చ్చింది నేను చేస్తా. ఫ్రెండ్‌షిప్ నాకు చాలా ఇంపార్టెంట్‌. కాలేజీ అయ్యాక మ‌న ప‌రిస్థితి ఏంటి? అని ఆలోచించుకునే టైమ్‌లో మా ఫ్రెండ్‌కి క్యాన్సర్ వ‌స్తుంది. ఫ్యామిలీని ఎలాగూ మ‌నం ఛూజ్ చేసుకోలేం. ఫ్రెండ్స్ ని మాత్ర‌మే మ‌నం ఛూజ్ చేసుకుంటాం. ఎద‌గడానికి చాలా మందికి ఫ్యామిలీ క‌న్నా, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్‌. దాన్ని ఈ సినిమాలో చూపించాం.

* ఎవ‌రెలా చేశారు?
- న‌లుగురు హీరోలున్న‌ప్పుడు మ‌న‌కేం గుర్తింపు వ‌స్తుంద‌నే ఆలోచ‌నేం లేదు. ఎవ‌రి పాత్ర వాళ్లు బాగా చేశారు. మామూలుగా ఫ్రెండ్స్ న‌లుగురితో బ‌య‌టికి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ సినిమా. రెగ్యుల‌ర్‌గా ఎలా కొట్టించుకుంటాం, ఎలా కొడ‌తాం అనేవ‌న్నీ ఉంటాయి. కెరీర్‌కి బ్రేక్ ఇస్తుంద‌ని భావిస్తున్నా.

* ద‌ర్శ‌క‌నిర్మాత‌ల గురించి చెప్పండి?
- ఇష్ట‌ప‌డి చేశారు. త‌ప్ప‌కుండా హిట్ కావాలి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved