pizza
Tharun Bhascker interview (Telugu) about Ee Nagaraniki Emaindi
స్టార్స్‌తోనే రిస్క్ ఉంటుంది - త‌రుణ్ భాస్క‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 June 2018
Hyderabad

విశ్వక్‌సేన్‌, సాయి సుశాంత్‌, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమటం, అనీషా అంబ్రోస్‌, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడు. డి.సురేశ్‌ బాబు నిర్మాత. ఈ సినిమా జూన్‌ 29న విడుదలవుతుంది. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌తో ఇంట‌ర్వ్యూ...

`పెళ్ళిచూపులు` రిలీజ్‌.. నేటికీ తేడా ఏంటి?
- అవార్డులు, రివార్డుల‌ను ప‌క్కన పెడితే రెండింటికీ కొద్దిగా బ్యాలెన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు బాగా కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. ఎందుకంటే బ‌డ్జెట్ కంట్రోల్ లేకుండా ఉండ‌టం అనేది ఎఫెక్ట్ ఉంటుంది. కాబ‌ట్టి ఇది బాగా వ‌చ్చింద‌నే న‌మ్మ‌కం ఉంది.

రెండేళ్లు గ్యాప్ తీసుకోవ‌డానికి రీజనేంటి?
- `పెళ్ళిచూపులు` పూర్త‌యిన త‌ర్వాత వెంట‌నే అవ‌కాశాలు వ‌చ్చేశాయి. ఆ స‌క్సెస్ అర్థం కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. వెంట‌నే అవకాశాలు వ‌చ్చాయి. ఓ స్టేజ్ వ‌చ్చింది. ఏమీ లేన‌ప్పుడు జీవితం సాఫీగా సాగిపోయింది. కాస్త ఫేమ్ వ‌చ్చేస‌రికి షాక‌య్యింది. కొంచెం బ్యాలెన్స్ రావ‌డానికి స‌మ‌యం తీసుకుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో రాస్తే వ‌ర్కువ‌ట్ కాదు క‌దా అని అనుకున్నాను. పెళ్ళిచూపులు సినిమాకు క‌థ పెద్ద ప్ల‌స్ అయ్యింది. కాబ‌ట్టి ఈ సినిమా మంచి క‌థ‌తో చేయాల‌నుకున్నాను కాబ‌ట్టి స‌మ‌యం ప‌ట్టేసింది.

మ‌ళ్ళీకొత్త‌వాళ్ల‌తోనే ఎందుకు సినిమా చేశారు?
- స‌క్సెస్ వ‌చ్చిందంటే కార‌ణం క‌థే అని నేను న‌మ్ముతాను. అప్పుడు స్టార్స్ లేదు. ఓ ర‌కంగా నాకు తెలియ‌ని ఏరియా. రిస్క్ తీసుకోకుండా సినిమా చేశాన‌ని అనుకోవ‌చ్చు. రిస్క్ స్టార్స్‌తోనే ఉంటుంది. ఎందుకంటే వారి ఇమేజ్ ప్ర‌కారం న‌డిచే స్టోరీ చేయ‌డం అనేది నాకు రాదు. అంత ఐడియా లేదు. కొత్త‌వాళ్ల‌తో నేను చేశాను కాబట్టి.. అదే ఎక్స్‌పీరియెన్స్‌తో, న‌మ్మ‌కంతో ఫ్రెష్ స్టోరీ, ఐడియాతో `ఈన‌గ‌రానికి ఏమైంది?` సినిమా చేశాను.

స్టార్ హీరోలెవ‌రూ మిమ్మ‌ల్ని సంప్ర‌దించ‌లేదా?
- అప్రోచ్ అయ్యారు. `పెళ్ళిచూపులు` స‌క్సెస్‌ను అప్రిషియేట్ కూడా చేశారు. ఎక్క‌డా నెగ‌టివ్ ఏమీ రాలేదు. నాగార్జున‌గారు, మ‌హేశ్‌గారు, బన్నిగారు ఇలా చాలా మందిని క‌లిశాను. వాళ్లంద‌రూ జెన్యూన్‌గా అప్రిషియేట్ చేయ‌డ‌మే కాకుండా.. ఏమైనా ఉన్నా వెంట‌నే కాల్ చేయ‌మ‌ని కూడా చెప్పారు. స్టార్ హీరోలు నన్ను సినిమా కోసం అప్రోచ్ అయిన‌ప్పుడు నాకు ఇంకా టైమ్ కావాలి. నాకు ఇంకా సినిమా అర్థం కావాలి. అది అర్థ‌మైన త‌ర్వాత త‌ప్ప‌కుండా సినిమాలు చేస్తాన‌ని వాళ్ల‌తో చెప్పేశాను.

ఈ టైటిల్ ఎందుకు పెట్టారు?
- సినిమాలో న‌లుగురు ఫిలిమ్ మేక‌ర్స్ ఉంటారు. ఫిలిం మేకింగ్ గురించి.. ఆల్క‌హాల్ అడిక్ష‌న్ గురించి సినిమాలో మెసేజ్ ఉంటుంది. ఫన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ. సాధార‌ణంగా ఆడిక్ష‌న్ గురించి ప్ర‌తి సినిమాలో ఈ న‌గరానికి ఏమైంది? అనే యాడ్ వ‌స్తుంటుంది. అంద‌రూ చూస్తుంటారు. కానీ చేసే ప‌నులు చేస్తుంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ ఈ ఐడియా నాకు చెప్పాడు. `నేను ఇది ఎవ‌రికీ న‌చ్చ‌దు` అని త‌న‌కు చెప్పినా కూడా.. ఐడియాను సురేశ్‌బాబుగారికి చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చింది. దాంతో స్టోరీ స్టార్ట్ చేశాను. జ‌నంలో ఓ క్యూరియాసిటీ ఉంటుందనే కార‌ణంతోనే కాకుండా మెయిన్ థీమ్ కూడా అదే కావ‌డంతో ఈ టైటిల్‌ను పెట్టాను.

interview gallery



లిక్క‌ర్ గురించి ఈ సినిమాలో చూపిస్తున్నామ‌ని చెప్పారు క‌దా? అది పాజిటివ్‌గా ఉంటుందా? నెగ‌టివ్‌గా ఉంటుందా?
- రెండు వైపులు సినిమాలో క‌న‌ప‌డుతుంది. అది మ‌నం ఎలా తీసుకుంటామనేది కూడా ముఖ్య‌మే. హ్యంగోవ‌ర్‌, దిల్‌చ‌హ‌తాహై, జింద‌గి నా మిలేగా దుబారా సినిమాల‌న్నీ బడ్డి కామెడీస్ వాటికొక స్ట్ర‌క్చ‌ర్ ఉంటుంది. తెలుగులో అలాంటి స్ట్ర‌క్చ‌ర్ కామెడీతో సినిమాలు రాలేదు. అందువ‌ల్ల అలాంటి స్ట‌యిల్లో ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను.

సురేశ్‌బాబు క‌థ విన‌గానే ఏమ‌న్నారు?
- ఆయ‌న క‌థ విని అంగీక‌రించ‌డానికి ఎక్కువ స‌మయం తీసుకుంటార‌ని నాతో చాలా మంది చెప్పారు. కానీ నేను ఈ క‌థ‌ను ఆయ‌న‌కు చెప్పగానే.. వెంట‌నే సినిమా చెసేయ్ అన్నారు. నేను షాకయ్యాను. సురేశ్‌బాబుగారు సినిమా త‌ర్వాత కూడా ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ఎవ‌రూ ఏమీ చెప్ప‌క‌పోతే కాస్త భ‌య‌మేసింది.

ఈ సినిమాలో న‌టించిన వారు స్టార్ట్ అవుతారా?
- అవుతార‌నే న‌మ్ముతున్నాను. అభిన‌వ్ గోమటం స్ట్ర‌గిలింగ్ యాక్ట‌ర్‌. థియేట‌ర్స్ చేసి అవ‌కాశాల కోసం తిరుగుతున్నారు. ఇక విసుగొచ్చి ఇక సినిమాలు మానేసి జాబ్ వెతుక్కుందాం అని అనుకుంటున్న త‌రుణంలో నేను సెల‌క్ట్ చేశాను. త‌ను బ్రిలియంట్ యాక్ట‌ర్‌. న‌లుగురు న‌టించినట్లు కాకుండా ఒదిగిపోయారు. ఎవ‌రైతే ప్రొఫైల్స్ పంపారో.. అంద‌రినీ స్క్రీన్ చేశాం. అందరినీ ఆడిష‌న్‌కి పిలిపించాం. అందులో సుశాంత్ రెడ్డి ముందుగా సెల‌క్ట్ అయ్యారు. కాస్టింగ్‌కి రెండు నెల‌లు స‌మ‌యం ప‌ట్టింది.

త‌దుప‌రి చిత్రం?
- ముందుస్టోరీ రాస్తా.. త‌ర్వాత ఎవ‌రితో చేయాల‌నే దాని గురించి ఆలోచిస్తా. కొత్త‌వాళ్ల‌తో చేయాలా? ఇంకెవ‌రితోనైనా చేయాల‌నేది ఆలోచించ‌లేదు. అయితే సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోనే సినిమా చేస్తాను. క‌థ సూట్ అయితేనే వెంక‌టేశ్‌గారినైనా, రానాగారితో అయినా చేస్తాను. వారిని అప్రోచ్ అయ్యాను.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved