pizza
Varun Tej interview (Telugu) about Mister
`మిస్టర్` ఓ మెమొరబుల్ మూవీ - వరుణ్ తేజ్
You are at idlebrain.com > news today >
Follow Us

11 April 2017
Hyderabad

వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్‌ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'మిస్టర్‌'. సినిమా ఏప్రిల్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్‌తో ఇంటర్వ్యూ...

మెమొరబుల్‌ మూవీ..
- 'మిస్టర్‌' సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుండి నాకు మెమొరబుల్‌ మూవీ. ఈ సినిమా కోసం ఎక్కువ ట్రావెల్‌ చేశాం. హైదరాబాద్‌కు దూరంగా ఉండే లోకేషన్స్‌, చిక్‌మంగళూర్‌, కేరళ, స్పెయిన్‌ ఇలా అన్నీ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఇటలీలో ఒక సాంగ్‌, స్విజ్జర్లాండ్‌లో ఓ సాంగ్‌ చేశాం. అందరూ ఓ ఫ్యామిలీలా కలిసి 'మిస్టర్‌' సినిమాకు పనిచేశాం. అలా అన్నీ సినిమాలకు కుదరదు.

'మిస్టర్‌' క్యారెక్టర్‌ గురించి..
- మిస్టర్‌ అందరికీ కొద్దిగా ప్రేమను పంచుతుంటాడు. లవ్‌ ఫీలింగ్‌, వెరీ గివింగ్‌ పర్సన్‌. ప్రేమ పంచడమే కాదు, ఎవరికైనా సహాయం కావాలన్నా ముందుంటాడు. అలాంటి వాడికి సమస్యలు వస్తే, వాడి లవ్‌ను వెతుక్కొవడానికి ఏం చేశాడనేదే కథ. ఈ సినిమాలో మెయిన్‌ ట్రయాంగిల్‌ స్టోరీ అయినా నాతో పాటు హీరోయిన్స్‌ లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్‌ ఇద్దరికీ ఓ బ్యాక్‌స్టోరీ ఉంటుంది. అది కాకుండా ముగ్గురు మధ్య జరిగే కథ మెయిన్‌గా ఉంటుంది. ఇంతకు ముందు నేను చేసిన మూడు చిత్రాల్లో నా క్యారెక్టర్‌ ఇన్‌టెన్స్‌గా ఉంటే, ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ లైవ్‌లీగా ఉండాలి, సెటిల్డ్‌గా కాకుండా, మూమెంట్‌తో క్యారెక్టర్‌ ఉండేలా శ్రీనువైట్లగారు కేర్‌ తీసుకున్నారు. దానిపై ఆయన వర్క్‌ చేసి నేను ఎక్కడైనా డ్రాప్‌ అవుతున్నట్లు అనిపించినా ఆయన చెప్పేవారు. డైలాగ్‌ డెలివరీ విషయానికి వచ్చేసరికి శ్రీనుగారికి ఒక టైమింగ్‌ ఉంటుంది. ఆ డైలాగ్స్‌ చెప్పేటప్పుడు నాకు కొత్తగా అనిపించాయి.

మంచి లర్నింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌..
- శ్రీనువైట్లగారు క్యూట్‌ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీస్‌ బాగా చేస్తారని ఎప్పటి నుండో ఆయనకు మంచి పేరుంది. ఆయన బిగినింగ్‌లో 'ఆనందం', 'నీకోసం' వంటి సినిమాలను చేశారు. స్టార్‌హీరోస్‌తో సినిమాలు చేస్తున్నప్పుడు, కమర్షియల్‌గా సినిమాలు చేస్తున్నప్పుడు అవి సక్సెస్‌ కావడంతో అందరూ ఆయన్ను అలాంటి సినిమాలే అడిగారు. ప్రతి ఒక్కరి జర్నీలో సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ కామన్‌గా ఉంటాయి. రీసెంట్‌గా మంచి విజయం లేనంత మాత్రాన ఆయన చేయలేరని కాదు. అందుకే ఆయన దాన్ని కూడా ప్రూవ్‌ చేసుకోవాలని, యంగ్‌ హీరో హీరోయిన్స్‌తో ఓ మంచి ఫ్రెష్‌ లవ్‌స్టోరీ చేయాలని ఆయన అనుకున్నారు. అంత పెద్ద డైరెక్టర్‌ మూలాల్లోకి తిరిగి రావాలనుకుని 'మిస్టర్‌' సినిమా చేశారు. శ్రీనువైట్లగారి వంటి డైరెక్టర్‌ చాలా మందితో వర్క్‌ చేశారు. ఆయనకున్న ఎక్స్‌పీరియెన్స్‌ ఎక్కువ. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం అనేది నాకు మంచి లర్నింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. శ్రీనువైట్లగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ శ్రీనువైట్లగారు బాగా కష్టపడుతుండటం కళ్ళారా చూశాను. నేనెప్పుడైనా బద్ధకించినా ఆయన్ను చూస్తే ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది.

కొత్త దర్శకులతో చేస్తాను..
- ఈ సినిమా షూటింగ్‌లో నేను గాయపడ్డ సందర్భంలో, నేను కొత్త దర్శకుల కథలను కూడా విన్నాను. ప్రస్తుతం శేఖర్‌ కమ్ములగారి 'ఫిదా' తర్వాత వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాను.

నాన్నకు నాపై నమ్మకం ఉంది..
- నాన్నగారు, నేను ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుతాను. నాన్నగారికి నాపై నమ్మకం ఉంది. నా విషయంలో నాన్నగారు హ్యాపీగా ఉన్నారు. కథ ఎంపికలో నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోరు. నీ జర్నీ నువ్వే చేయాలని అంటారు.

Varun Tej interview gallery

లవ్‌ విత్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ చేయాలనుకున్నప్పుడు ..
- సాధారణంగా ప్రేమకథల్లో అబ్బాయి అమ్మాయి వెనుకనో, అమ్మాయి అబ్బాయి వెనుకనో పడతారు..ప్రేమించుకుంటారు. అలా కాకుండా హీరో హీరోయిన్‌ మాట్లాడుకోకుండా ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ నచ్చడంతో ముకుంద' సినిమా చేశాను. అందులో హీరో క్యారెక్టరైజేషన్‌ నాకు బాగా నచ్చింది. తర్వాత కంచెలో కథనం, బ్యాక్‌డ్రాప్‌ బాగా నచ్చాయి. చాలా మంది మంచి కమర్షియల్‌, మాస్‌ సినిమా చేయవచ్చు కదా అన్నారు, అదే సమయంలో లోఫర్‌ సినిమాలోని మదర్‌ సెంటిమెంట్‌ నచ్చడంతో 'లోఫర్‌' చేశాను. ఇప్పుడు 'మిస్టర్‌' విషయానికి వస్తే, నా ఏజ్‌కు తగ్గట్లు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన లవ్‌స్టోరీ చేద్దామని అనుకున్నాను. ఆ సమయంలో శ్రీనవైట్లగారు 'మిస్టర్‌' కథ చెప్పడంతో కనెక్ట్‌ అయ్యాను. ఈ సినిమాలో కేవలం ప్రేమే కాదు, మంచి ఎమోషన్స్‌ కూడా ఉండటంతో సినిమా చేయడానికి అంగీకరించాను.

'ఫిదా' గురించి...
- శేఖర్‌ కమ్ములగారి దర్శకత్వంలో 'ఫిదా' మూవీ చేస్తున్నాను. 25 రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉంది. సినిమా ఇప్పటికే 75 శాతం పూర్తయ్యింది. మంచి రిలీజ్‌ డేట్‌ అనుకుని రిలీజ్‌ చేస్తాం. క్లాసీ లవ్‌స్టోరీగా 'ఫిదా' తెరకెక్కుతోంది.

తప్పకుండా చేస్తాం..
- నేను క్రిష్‌తో రాయభారి చేయాల్సింది కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. నేను, క్రిష్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా రిలీజ్‌ తర్వాత క్రిష్‌ను అభినందించాను. తను ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు. నాకు కూడా రెండు, మూడు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. రాయభారి మంచి స్క్రిప్ట్‌ భవిష్యత్‌లో తప్పకుండా చేస్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved