pizza
Venkatesh interview about Babu Bangaram
`బాబు బంగారం` సింపుల్‌ ఎంటర్‌టైనింగ్‌ఫార్మేట్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ - వెంకటేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

08 August 2016
Hyderaba
d

విక్టరీ వెంకటేష్‌, నయనతార జంటగా ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్‌.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. ఈ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్‌తో జరిగిన ఇంటర్వ్యూ....

అయ్యో అయ్యో అయ్యయ్యో ఈ డైలాగ్‌ను మళ్లీ ఈ సినిమాలో ఎందుకు ఉపయోగించారు?
- బొబ్బిలిరాజా సినిమా వచ్చి ఇరవైయేళ్లు అయినా అయ్యో అయ్యో ..డైలాగ్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. ఆ సినిమా చూడని ఇప్పటి జనరేషన్‌ కూడా ఈ సినిమాలో ఆ డైలాగ్‌కు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ సినిమా స్టార్టింగ్‌ నుండి మారుతి ఈ బొబ్బిలిరాజాకు సంబంధించి దాన్ని ఎక్కడో ఒక ప్లేస్‌లో ఉపయోగించాలనుకుంటుడేవాడు.

ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఫీలయ్యే క్యారెక్టర్‌ కాబట్టి యాక్షన్‌ సీన్‌లో సారీ సార్‌..అనే ప్లేస్‌లో ఈ డైలాగ్‌ను ఉపయోగించాం. అలాగని ఈ డైలాగ్‌ సినిమా అంతటా ఉండదు. కానీ క్యారెక్టర్‌ పరంగా చాలా బాగా కుదిరింది.

'గోపాల గోపాల' తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా గ్యాప్‌ తీసుకున్నారెందుకు?
- గ్యాప్‌ వచ్చిన మాట నిజమే కానీ పర్టికులర్‌ రీజన్‌ అంటూ ఏమీ లేదు. చాలా కథలు వింటూ వచ్చాను. ఇంతకు ముందు కూడా మారుతితో సినిమా చేయాల్సింది కానీ వీలుపడలేదు. మారుతి నా క్యారెక్టర్‌ గురించి చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. నా క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్‌ను చూస్తారు. సింపుల్‌ ఎంటర్‌టైనింగ్‌ఫార్మేట్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ప్రతి క్యారెక్టర్‌ను మనం చేయాలనుకోకూడదు. మన వయసుకు తగిన క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ పోవాలి. నేను డైరెక్ట్‌ సినిమాలనే కాకుండా రీమేక్‌ సినిమాలను కూడా చేయాలనుకంటాను. అయితే నాకు ఫ్రెష్‌ కాన్సెప్ట్‌ ఉండాలనుకుంటాను.

మారుతి సినిమా ఓ సినిమా ఆగిపోయి., మళ్లీ సినిమా చేస్తున్నారు కదా, తను చెప్పిన కథలో ఏం నచ్చింది?
- మారుతితో రాధా అనే సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాలతో ఆగిపోయింది. అయితే మారుతి నాతో చేయడానికి చాలా ఆసక్తిగా ఉండటాన్ని గమనించాను. సాధారణంగా నేను ప్రతి టెక్నిషియన్‌లో ఆ విషయాన్ని గమనిస్తాను. అందుకే మారుతితో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

నయనతారనే హీరోయిన్‌గా తీసుకోవడం వెనుక రీజన్‌ ఏంటి?
- నయనతార ప్రమోషన్‌కు రానని ముందే చెప్పేసింది. అయితే తనయితే ఈ సినిమా కథకు యాప్ట్‌ అవుతుందని తీసుకున్నాం. ఇక సీనియర్‌ హీరోలకు, హీరోయిన్‌ సమస్యలుంటాయి. దానికి తగట్టు వెతుక్కోవాలి, తప్పదు. అయితే అన్నింటి కంటే మంచి స్క్రిప్ట్‌ దొరకాలనుకుంటాను.

Venkatesh interview gallery


30యేళ్లు పూర్తి చేసుకున్న నటుడిగా ఎలా ఫీలవుతారు?
- నటుడుగా 30యేళ్లు పూర్తి చేసుకోవడం అనేది నాకు తెలిసి పెద్ద విషయం కాదు. అదొక జ్ఞాపకం అనుకుంటాను. అయితే దీనికి కారణం ప్రేక్షకులు. వారు తొలిరోజు నుండి అభిమానంతో ఈరోజు వరకు నన్ను ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. వారికి నా థాంక్స్‌. అయితే నేను సినిమాల్లోకి రావాలని రాలేదు. ప్రతి ఒక్కరూ వారిని ఒక్కడో ఒకచోట డిస్‌కవర్‌ చేసుకురటారు. అలా నేను సినిమాల్లో ఎంటర్‌కావడం అనేది యాదృచ్చికంగా జరిగింది. అలాగే నా పిల్లలను కూడా వారికి ఇష్టమైనదే చేయాలని చెప్పాను. మా అబ్బాయి అర్జున్‌ తనకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలనుకునే రకం.

బాబు బంగారం అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు?
- ఈ టైటిల్‌ను ముందు మారుతి చెప్పగానే చాలా చక్కగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. నా పాత్ర నవ్వించే పోలీస్‌. కానీ పోలీస్‌ అలా ఉంటే కష్టం కదా..దాని వల్ల తను ఎలా మారాడనేది కథ. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైనింగ్‌, పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అన్నీ ఉంటాయి.

రాజుగారి గది సీక్వెల్‌లో నటిస్తున్నారని విన్నాం?
- రాజుగారి గది సీక్వెల్‌ కాదు కానీ, అలాంటి స్టోరీ ఒకటి ప్లాన్‌ చేస్తున్నాం.

పెళ్ళిచూపులు నచ్చింది చూశారు కదా ఎలా అనిపించింది?
- ఈ మధ్య పెళ్ళిచూపులు సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. చాలా ఫ్రెష్‌గా అనిపించింది.

మీరు న‌టించిన చిత్రాల్లో ఏ సినిమాలు సీక్వెల్స్ చేస్తే బావుంటుంద‌ని అనుకుంటారు?
- అలాంటిదేం లేదు. ఆ విషయాన్ని దర్శకులనే అడగాలి. నువ్వునాకు నచ్చావ్‌ చేస్తే బావుంటుంది. అలాగే దృశ్యం కూడా చేయ్యొచ్చు.

మారుతి వర్కింగ్‌ స్టయిల్‌ ఎలా అనిపించింది?
- చాలా కూల్‌గా ఉంటాడు. ఎక్కడా కన్‌ఫ్యూజన్‌ లేకుండా క్లారిటీగాఉంటాడు. గతంలో కోడిరామకృష్ణగారు కూడా అలానే ఉండేవారు. మారుతి ఒక ఆడియెన్‌లా ఫీల్‌ అవుతాడు. ఏదీ కాంప్లికేటెడ్‌ చేసుకోడు.

తదుపరి చిత్రాలు గురించి...?
- కిషోర్‌తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్ళకు జోహార్లు అనే చిత్రంతో పాటు, బాలీవుడ్‌ మూవీ సాలాఖద్దూస్‌ రీమేక్‌లో నటిస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved