pizza
Venkatesh interview (Telugu) about Guru
`గురు` మూవీ ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ - వెంక‌టేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2017
Hyderabad

వెంక‌టేష్, రితిక సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధా కొంగ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శ‌శికాంత్ నిర్మించిన చిత్రం `గురు`. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో వెంక‌టేష్‌తో ఇంట‌ర్వ్యూ....

అదృష్ట‌వంతుడిగా ఫీల్ అవుతుంటాను...
- ఒక న‌టుడుగా నేను అదృష్ట‌వంతుడుగా ఫీల్ అవుతుంటాను. ముప్పై ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నాను. ప్రేక్ష‌కులు నా మొద‌టి సినిమా నుండి న‌న్ను ఆద‌రిస్తున్నారు. ప్ర‌తి సినిమాకు నా వంతుగా బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నించాను. ప్ర‌తిసారి ఏదైనా కొత్త‌గా చేయాల‌నుకుంటూ ఉంటాను. అలా నేను కొత్త‌గా చేసిన సినిమా `గురు`. క‌థ ప‌రంగా, క్యారెక్ట‌ర్ ప‌రంగా `గురు` చాలా కొత్త సినిమా. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ.

రెండూ క‌లిసే ఉంటాయి...
- ఒక సినిమాలో క్యారెక్ట‌ర్‌, క‌థ క‌లిసే ఉంటాయి. అది ఏ సినిమా అయినా కావ‌చ్చు. అయితే సినిమా చేసేట‌ప్పుడు ఒక సేఫ్ జోన్‌లో ఉండేలా చూసుకోవాలి. రీమేక్ సినిమా విష‌యానికి వ‌స్తే, ఒక‌రు చేసిన పాత్ర‌ను మ‌నం చేయ‌డ‌మంటే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఎమోష‌న్స్‌ను క‌రెక్ట్‌గా క్యారీ చేస్తూ చేయాలి, చేస్తేనే పాస‌వుతాం.

పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌లేదు...
- సాధార‌ణంగా గురు సినిమాలో నా లుక్ చాలా కొత్త‌గా ఉంటుంది. ఇంత‌కు ముందెన్న‌డూ చేయ‌ని పాత్ర‌. సినిమా చేయాల‌ని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు సినిమా కోసం ఐదారు నెల‌లు పాటు బాక్సింగ్ నేర్చుకున్నాను. స్కూల్లో పి.ఇ.టి టీచ‌ర్స్‌, టీం కోచెస్ ఎలా ఉంటారనే విష‌యాల‌ను గ‌మ‌నించాను. ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో కూడా ఎక్క‌డా రిపీట్ కాకుండా ఉండేలా చూసుకున్నాం.

Venkatesh interview gallery

ఎమోష‌న‌ల్ జ‌ర్నీ...
- గురు సినిమా ఒక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. సినిమా చూసిన ప్రేక్ష‌కుడు బోరున ఏడుస్తాడ‌ని చెప్ప‌ను కానీ కంట‌త‌డి పెట్టుకుంటాడ‌ని చెప్ప‌గ‌ల‌ను. ఎమోష‌న‌ల్ సీన్స్ గుండెను హ‌త్తుకునేలా ఉంటాయి.

డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర గురించి...
- డైరెక్ట‌ర్ సుధ చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌, డేడికేటివ్‌. త‌న‌కు సినిమా ప‌రంగా ఏం కావాలో తెలుసు. చాలా క్లారిటీ ఉన్న‌వ్య‌క్తిఇది ఒక కోచ్‌నో, మ‌రెవ‌రినో ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని త‌యారు చేసుకోలేదు. . త‌ను ఎంతో రీసెర్చ్ చేసి రాసుకున్న క‌థ‌. అలాగే సినిమాలో మంచి మ్యూజిక్ కుదిరింది.

మార్పు పెద్ద మిస్ట‌రీ...
- మార్పు అనేది పెద్ద మిస్ట‌రీ. అది ఎప్పుడైనా రావ‌చ్చు. ఇప్పుడు సినిమాలు చూసే ఆడియెన్స్‌లో మార్పు వ‌చ్చింది. అలాగే నీలో, నాలో మార్పు అనేది స‌హజం. మార్పును స‌మ‌య‌మే నిర్దారిస్తుంది.

డైరెక్ష‌న్ చేయ‌ను...
- టీవీ ప్రోగ్రామ్స్‌, రియాల్టీ షోస్‌ను చేయ‌ను. అలాగే డైరెక్ష‌న్ కూడ చేయ‌ను. ఇప్పుడు చేస్తున్న‌వాళ్లంద‌రూ వారి వారి కంఫ‌ర్ట్స్ చూసుకుని చేస్తున్నారు. ఇక నాకు చాలా స‌మ‌స్య‌లున్నాయి. వాటిని చూసుకోవాలి. వీటి గురించి ఆలోచించే స‌మ‌యం నాకు లేదు.

ఆడియెన్స్ క‌నెక్ట్ కావాలి...
- ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చాలానే వ‌చ్చాయి. అందులో కొన్ని స‌క్సెస్ కావ‌చ్చు. మ‌రికొన్ని స‌క్సెస్ కాలేక‌పోవ‌చ్చు. అయితే సినిమాలో ఎమోష‌న‌ల్ పాయింట్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయితేనే సినిమాలు విజ‌యం సాధిస్తాయి.

నెక్ట్స్ మూవీ..
-ప‌ర్టికుల‌ర్‌గా ఇద‌ని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఏదైనా అనుకుంటే జ‌ర‌గ‌డం లేదు. అయితే ఒక కొత్త ద‌ర్శ‌కుడితో ఓ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ చేయాల‌నుకుంటున్నాను. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే వాటి వివ‌రాలు వెల్ల‌డిస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved