pizza
Venky Atluri interview (Telugu) about Tholi Prema
మెగా అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను - వెంకీ అట్లూరి
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2018
Hyderabad

వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు. సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ......

సక్సెస్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
- చాలా హ్యాపీగా ఉన్నాను. భీమవరం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మెగా ఫ్యాన్స్‌కు ఒక ప్రామిస్‌ చేశాను. పవన్‌ కల్యాణ్‌గారి 'తొలిప్రేమ' గౌరవాన్ని కాపాడుతానని. అన్నట్లుగానే కాపాడానని అనుకుంటున్నాను. సక్సెస్‌ రావాలని ఎవరైనా కోరుకుంటారు. దేవి థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఆడియెన్స్‌ అప్రిసియేన్స్‌ మేం కోరుకున్న దాని కంటే ఎక్కువ వచ్చింది.

ఫిక్షన్‌ స్టోరీ..
- హ్యారీ మిక్స్‌ హ్యారీ బెన్‌ సినిమా చూసిన తర్వాత ఇష్టపడ్డాను. దాన్ని బట్టే మనకు తగ్గటు ్టకథను తయారు చేసుకుంటూ వచ్చాను. ఇదొక ఫిక్షన్‌ స్టోరీ. నా స్వీయానుభవం కాదు. నేను భారతి విద్యాభవన్‌లో చదువుకున్నాను. అక్కడ నా కంటే లేడి సీనియర్స్‌ను దీదీ అనే పిలిచేవాడిని. అబ్బాయిలనైతే భయ్యా! అని పిలిచేవాడిని.

రాశీ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌..
- సినిమాలో రాశీ ఖన్నాను హీరోయిన్‌గా తీసుకోవాలనేది నిర్మాతలు, వరుణ్‌తేజ్‌ ఆలోచనే. వాళ్లే రాశి అయితే బావుంటుందని అన్నారు. నేను కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నాను. లేదు.. కాస్త ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయిన హీరోయిన్‌ అయితే బావుంటుందని నిర్మాతలు అన్నారు. మనకు ఉన్న హీరోయిన్స్‌లో నా కథకు సరిపోయేవాళ్లు తక్కువగానే ఉన్నారు. ఎవరా అని ఆలోచిస్తే.. రాశి అయితే బావుంటుందనుకున్నాం. అయితే తను కమర్షియల్‌ సినిమాలు ఎక్కువగా చేసింది కదా! ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని అనుకున్నాం. లుక్‌ టెస్ట్‌ చేశాం. ఆ టెస్ట్‌లో తను 17 ఏళ్ల అమ్మాయిలా క్యూట్‌గా కనపడింది. దాంతో మేం తనైతే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యాం. తను బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది.

తమన్‌ని ఎవరైనా హర్ట్‌ చేశారేమో..

తమన్‌ లవ్‌స్టోరీస్‌ ఒకటో రెండో చేసుంటారేమో.. కానీ నేను చెప్పగానే కొత్తగా అనిపించి, ఎగ్జయిట్‌మెంట్‌తో చేద్దామని అన్నారు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కూర్చున్నప్పుడు ట్యూన్స్‌ అన్నీ దాదాపు సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే అయ్యాయి. రీరికార్డింగ్‌ వినగానే.. తను కథను ఎంత నమ్మాడు. అంతే ఎగ్జయిట్‌మెంట్‌ అయ్యాడో తెలిసింది. మరి తమన్‌ని ఎవరైనా అమ్మాయి హర్ట్‌ చేసిందో తెలియదు. తన స్వంత కథకు మ్యూజిక్‌ ఇచ్చినట్టు తమన్‌ ఫీలై చేశాడు..

అప్పుడు చేసేదేమీ ఉండదు..
- వెయిటింగ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రస్టేట్‌ అవుతారు. అయితే చేసేదేమీ ఉండదు. ఎందుకంటే.. వరుణ్‌గారికి కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. షూటింగ్‌లు ఆగిపోయాయి. లేకుంటే కాస్త ముందుగా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యేది. అయితే ఆ గ్యాప్‌లో స్టోరీని చిన్న చిన్న చేంజస్‌తో ఇంకా బెటర్‌గా చేసుకోవడానికి ప్రయత్నించాను.

టీజర్‌ చూసి..
- నేను కథ తయారు చేసుకునేటప్పటికీ వరుణ్‌తేజ్‌ ముకుంద కూడా విడుదల కాలేదు. ఓ టీజర్‌ మాత్రమే విడుదలైంది. ఆ టీజర్‌ చూసి ఇలాంటి హీరో మనకు ఉంటే ఇంకా కథను బాగా చెప్పొచ్చు అని అనుకున్నాను. అయితే మెగా ఫ్యామిలీ నుండి వస్తోన్న హీరో కదా! లవ్‌స్టోరీస్‌ చేస్తాడో లేదో అనే భయం కూడా వచ్చింది. అయితే కంచె రిలీజ్‌ అయిన తర్వాత కాస్త ధైర్యం వచ్చింది. తను డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి సిద్ధం అని తెలిసింది. లోఫర్‌ టైంలో తనను కలిసి ఈ కథ చెప్పాను.

అన్ని కుదిరాయంతే..
- కథ ముందు దిల్‌రాజుగారికి చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. అయితే ఆయన చేతిలో సినిమాలు ఎక్కువగా ఉండటం.. మరి ఎక్కువ డిలే అవుతుందనే కారణంతో ప్రసాద్‌గారి అబ్బాయి బాపినీడుని కలిసి కథ చెప్పాను. తనకు కూడా నచ్చింది. అప్పటికే వరుణ్‌కు కథ చెప్పేశాను. తనకి నచ్చేసింది. అలా అన్నీ చక్కగా కుదిరాయి.

interview gallery



ఎవరైనా ఫాలో అయ్యేవి ఇవే..
- సినిమాలో మూడు లుక్స్‌లో హీరో హీరోయిన్స్‌ కనపడాలి. ఇంటర్‌ చదివే టైం లుక్‌ కోసం ఇద్దరికీ చబ్బి లుక్‌ ఇచ్చాం. అలాగే ఇంజనీరింగ్‌ చదివే లుక్‌ కోసం ఇద్దరూ వెయిట్‌ తగ్గారు. ఇక లండన్‌లో కనపడిన లుక్‌ కోసం కాస్త గడ్డం పెంచాడు వరుణ్‌. రాశి.. కాస్త బొద్దుగా పెరిగింది. ఇలాంటి వేరియేషన్స్‌ చూపించాల్సి సమయంలో ఎవరైనా ఇలాంటివే ఫాలో అవుతారు
.

టైటిల్‌ విషయంలో ఎవరూ ఏమీ అనలేదు..
- 'తొలిప్రేమ' అనే టైటిల్‌ను పెట్టి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశాం. తర్వాత టీజర్‌ రిలీజ్‌ చేశాం. వీటిలో ప్రేక్షకులకు ఎక్కడో ప్యూరిటీ కనపడింది కాబట్టే ఈరోజు ఇంత బాగా సినిమాను వెల్‌కమ్‌ చేశారు. ఈ సినిమా టైటిల్‌ పెట్టినప్పుడు ఎవరూ ఏమీ అనలేదు. అయితే కొంత మంది మాత్రం 'పెట్టావ్‌ సరే! జాగ్రత్తగా తీయ్‌' అన్నారు.

- నాకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఉండేది కానీ.. ఎలా అనే దానిపై క్లారిటీ ఉండేది కాదు. స్నేహగీతం సినిమాలో యాక్టర్‌గా నటించాను. అదే సమయంలో ఆ సినిమా కోసం డైలాగ్స్‌ కూడా రాశాను. అలా రాయడం వల్లనేమో కానీ.. నాకు యాక్టింగ్‌పై ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. రైటర్‌గా 'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ', 'స్నేహగీతం', 'కేరింత' సినిమాలు చేశాను. 'కేరింత' సినిమా సమయంలోనే సెట్స్‌లో ఏం జరుగుతుందో గమనించేవాడిని. నాకు రైటర్‌గా లవ్‌స్టోరీ, డ్రామా, పొలిటికల్‌ నేపథ్యంలో ఉన్న కాన్సెప్ట్‌లను బాగా ఇష్టపడతాను.

అదే బెస్ట్‌ కాంప్లిమెంట్‌...
- రాఘవేంద్రరావుగారు ఫోన్‌ చేసి సినిమా చాలా బావుందని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్‌ షో మ్యాన్‌ అయినా రాఘవేంద్రరావుగారు ఫోన్‌ చేయడం హ్యాపీగా అనిపించింది. తర్వాత ఆర్‌.నారాయణమూర్తిగారు ఫోన్‌ చేసి అభినందించారు. ఇలా చాలా మంది ఫోన్‌ చేశారు. సినిమా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కె.టి.ఆర్‌గారు సినిమా చూసి ట్వీట్‌ చేశారు. అలాంటి పెద్ద పొలిటిషియన్‌ మనల్ని అభినందిస్తూ ట్వీట్‌ చేయడం గ్రేట్‌ అనిపించింది.

తదుపరి చిత్రం..
- నెక్ట్స్‌ మూవీ కూడా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారి బ్యానర్‌లోనే ఉంటుంది. దిల్‌రాజుగారి బ్యానర్‌లో కూడా సినిమా త్వరలోనే ఉంటుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved