pizza

Venky Kudumula interview about Chalo
ఇప్పుడు వ‌స్తున్న ద‌ర్శకుల‌లో చాలా మందిపై ఆయ‌న ప్ర‌భావం ఉంటుంది - వెంకీ కుడుముల‌

You are at idlebrain.com > news today >
Follow Us

29 January 2018
Hyderabad

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం 'ఛలోస‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల పాత్రికేయుల‌తో సినిమా గురించి ముచ్చ‌టించారు.

నేప‌థ్యం..?
- మాది ఖ‌మ్మం జిల్లా అశ్వారావ్ పేట‌. ఎంబీఏ చ‌దివాను. సినిమాల విషయానికి వ‌స్తే ముందుగా.. నేను తేజ‌గారి డైరెక్ష‌న్ టీంలో `నీకు నాకు డాష్ డాష్` అనే సినిమాలో ప‌నిచేశాను. అందులో చిన్న పాత్ర‌లో కూడా న‌టించాను. నా ప్ర‌యాణం అలా ప్రారంభ‌మైంది. త‌ర్వాత `జాదూగాడు` సినిమా కోసం యోగిగారితో ప‌నిచేశాను. అలాగే తుఫాన్ తెలుగు వెర్ష‌న్‌కు కూడా ప‌నిచేశాను. త‌ర్వాత త్రివిక్ర‌మ్‌గారి వ‌ద్ద `అఆ` సినిమాకు ప‌నిచేశాను. బ‌ల‌భ‌ద్ర పాత్రుని ర‌మ‌ణి అనే ర‌చయిత ప‌రిచ‌యం ఉన్నారు. ఆమె స‌హాయంత తేజ‌గారికి ప‌రిచ‌యం అయ్యాను.

నా జ‌ర్నీ అలా స్టార్ట్ అయ్యింది?
- `జాదూగాడు` సినిమాకు నేను అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ప్పటి నుండి నాగ‌శౌర్య‌తో ప‌రిచయం ఉంది. త‌ను న‌న్ను ఎలాగైనా డైరెక్ట‌ర్ చేయాల‌నుకున్నాడు. అలాగే నేను కూడా నా తొలి సినిమాను నాగ‌శౌర్య‌తో చేయాల‌నుకున్నాను. అయితే త‌న‌తో సినిమా చేస్తాన‌ని చెబితే స్నేహం ఎక్క‌డ చెడుతుందోన‌ని అనుకుంటుండేవాడిని. అలాంటి స‌మ‌యంలో `అఆ` సినిమా పూర్త‌యిన త‌ర్వాత ఓరోజు శౌర్య ఫోన్ చేసి వెంకీ క‌థ త‌యారు చేసుకో. మ‌నం సినిమా చేద్దామ‌ని అన్నాడు. నాకు చాలా సంతోష‌మేసింది.

ఇన్‌స్పిరేష‌న్ ఏంటి?
-శౌర్య‌తో ముందు క్రైమ్ కామెడీ చేద్దామ‌ని అనున్నాను. అయితే శౌర్య క్రైమ్ కామెడీ ని కాకుండా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేద్దామ‌ని అన‌డంతో.. ఎలా చూపించాల‌ని ఆలోచించాను. ఇప్ప‌టి వ‌ర‌కు శౌర్య‌ను అంద‌రూ కామ్‌గా, ల‌వ‌ర్‌బోయ్‌లా చూపించారు. అయితే ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా చూపిస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించాను. త‌న‌కు చెబితే చేసేద్దామ‌ని అన్నాడు. అశ్వారావు పేట నుండి రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ఉంది. రెండు బోర్డ‌ర్స్ ప‌క్క‌న ఉండ‌టంతో ఈ క‌థ‌ను చేస్తే బావుంటుంద‌నిపించి క‌థ‌ను త‌యారు చేశాను.

?త్రివిక్ర‌మ్‌కు క‌థ చెప్పారా?
- త్రివిక్ర‌మ్‌గారితో `అఆ` సినిమా మాత్ర‌మే చేశాను. కానీ మంచి అనుబంధం ఏర్ప‌డింది. నిజానికి `అజ్ఞాత‌వాసి` సినిమా కూడా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాను. అయితే ఈ సినిమా త‌ర్వాత నువ్వు డైరెక్ట‌ర్ అవ్వు వెంకీ, నా సపోర్ట్ నీకు ఉంటుందిలే అని త్రివిక్ర‌మ్‌గారు అన్నారు. ఆయ‌న అలా చెప్పిన కొన్ని రోజుల‌కే నాకు డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌కు ఈ పాయింట్ చెప్పాను. విని బావుంద‌ని అన్నారు. నాకు పూరిగారు, త్రివిక్ర‌మ్‌గారు ఇన్‌స్పిరేష‌న్‌.

అస‌లు నాగ‌శౌర్య త‌ల్లిదండ్రులు ఈ సినిమాను నిర్మించ‌డానికి కార‌ణ‌మేంటి?
- ముందు ఈ క‌థ‌ను వేరే నిర్మాత‌కు చెప్పాం. క‌థ బావుంది. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో చేద్దామ‌ని అన్నారు. ఈ సంగ‌తి తెలిసిన అంటీ, అంకుల్ (నాగ‌శౌర్య‌) త‌ల్లిదండ్రులు మంచి క‌థ అంటున్నారు... వెంకీ మ‌న ఇంటి కుర్రాడే.. శౌర్య న‌మ్మ‌కం పెట్టుకున్న క‌థ‌ను మ‌న‌మే ఎందుకు చేయ‌కూడ‌ద‌ని ఆలోచించి.. క‌ష్ట‌మో న‌ష్ట‌మో వారే సినిమా నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ఎంతో ఫ్రీడ్ ఇచ్చి సినిమా అవుట్‌పుట్ బాగా రావడానికి స‌పోర్ట్ చేసిన వారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను.

ర‌ష్మిక‌ను హీరోయిన్‌గా ఎంచుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?
- నేను స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం చెన్నై వెళ్లాను. అక్క‌డ క‌న్న‌డ సినిమా కిరిక్ పార్టీ చూశాను. సినిమా బావుంది. హీరోయిన్ చాలా బావుంది.. బాగా న‌టించ‌ద‌ని అనుకంటూ బ‌య‌ట‌కు రాగానే, శౌర్య ఫోన్ చేసి నీకొక లింక్ పంపాను. చూడు అన్నాడు. ఆ లింక్ మ‌రేదో కాదు.. కిరిక్ పార్టీలోని సాంగే. నేను ఫోన్ చేసి నిర్మాత‌ల‌కు చెప్పాను.

రైట‌ర్‌గా మీపై త్రివిక్ర‌మ్ ప్ర‌భావం ఎంత‌?
- ఇప్పుడు వ‌స్తున్న యువ ద‌ర్శ‌కులంద‌రిపై త్రివిక్ర‌మ్‌గారి ప్ర‌భావం త‌ప్ప‌కుండా ఉంటుంది. అయితే ఆయ‌న్ని ఇమిటేట్ చేయ‌కూడ‌దు.

సినిమా వ‌ల్ల ఒత్తిడికి లోన‌వుతున్నారా?
- సినిమా అవుట్‌పుట్ చూసుకున్నాం కాబ‌ట్టి, ఏ ప్రెష‌ర్ లేదు.

త‌దుపరి చిత్రం?
- ప్ర‌స్తుతానికి నెక్ట్స్ చిత్రాలేవీ లేవు. `ఛ‌లో` సినిమా రిలీజ్ త‌ర్వాత చూడాలి.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved