ఈ తరం కమెడియన్లలో ప్రామిసింగ్ కమెడియన్ వెన్నెలకిశోర్. సినిమాల మీద ఉన్న అభిమానంతో యు.ఎస్.ను వదిలేసి సినిమా దారి పట్టారాయన. తాజాగా ఆయన విలన్‌గా నటించిన అమీతుమీ విడుదల కానుంది. ఈ సినిమా గురించి వెన్నెలకిశోర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
* అమీతుమీ గురించి చెప్పండి?
- చాలా క్యూట్‌గా ఉంటుంది. అవసరాల, అడివిశేష్ ఇద్దరూ హీరోలు. నేను వాళ్లకి మిత్రుడిని కాదు.వాళ్లిద్దరికీ లవ్ స్టోరీలుంటాయి. పెళ్లి కోసమని వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ఒకరోజు ఉదయం నేను బయలుదేరుతాను. ఆ తర్వాత ఏమైందనేది అసలు సినిమా.
* మీరు విలన్‌గా నటించారా?
- నెగటివ్ షేడ్‌లు చాలా ఉంటాయి. ఇందులో నా పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పేరు కొత్తగా ఉంటుంది.
* ఇంద్రగంటిగారితో చేయడం ఎలా ఉంది?
- జెంటిల్ మేన్ నుంచి నాకు ఆయనతో చాలా మంచి అసోసియేషన్ ఉంది. ఆయనకు ఏం కావాలో అది బాగా తెలిసిన వ్యక్తి. ఆయన అతి తక్కువ మందితో మాత్రమే కంఫర్ట్ గా ఉంటారు. ఆ కంఫర్ట్ ఆయనకు నాతో ఉండటం ఆనందంగా ఉంది.
* మీరు స్పాట్‌లో ఇంప్రూవైజేషన్ చేస్తుంటారా?
- అబ్బే ఇంద్రగంటిగారి సినిమాకు అది అవసరమే లేదండీ. ఆయన సినిమాకు రెండు నెలలకు ముందే ఆర్టిస్టులకు స్క్రిప్ట్ ను పంపేస్తారు. ఈ చిత్రానికి కూడా ఒకరోజు అలాగే పంపించారు. ఒకరోజు ఆవాసా హోటల్లో పెద్ద హాల్ బుక్ చేసి నటీనటుల్ని అందరినీ పిలిపించి స్క్రిప్ట్ రీడింగ్ చేయించారు. దాంతో ఎవరికీ స్పాట్‌లో డౌట్‌లు రావు. పైగా వర్క్ స్పీడ్‌గా జరగడానికి ఈ సెషన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
Vennela Kishoreinterviewgallery
* కమెడియన్‌గా మిమ్మల్ని మీరు ఎలా అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు?
- మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోవాల్సిందే. లేకుంటే ప్రతి శుక్రవారం ఇక్కడ ఓ కొత్త కమెడియన్ వస్తుంటారు. వాళ్ల మధ్య మనం ఉండలేం. ఈ రంగంలో ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఈ మధ్య కేశవలో నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. మారుతి ఈ సినిమాను చూసి `నిన్ను ఇలా కూడా వాడుకోవచ్చా` అని అన్నారు. ఫ్యామిలీ జోన్‌లోకి వెళ్లడానికి ఇది మంచి ఛాన్స్ అనిపించింది.
* హీరోగా నటించాలనిపించడం లేదా?
- లేదండీ. హీరోగా చేయాలంటే డ్యాన్సులు రావాలి. నాకు అవి రావు. ఆ మధ్య ఓం నమో వేంకటేశాయ షూటింగ్‌కి వెళ్లినప్పుడు రాఘవేంద్రరావుగారు నన్ను పిలిచి `ఇక హీరోగా ట్రై చేయను` అని నాకు ఒట్టేయ్ అని అన్నారు. సరేనని మాటిచ్చాను.