pizza
VI Anand interview about Disco Raja
కాన్సెప్ట్‌, కమర్షియల్‌ బ్యాలెన్స్‌ చేసిన చిత్రమే: 'డిస్కో రాజా'
You are at idlebrain.com > news today >
Follow Us

22 January 2020
Hyderabad

సినిమాకు కాన్సెప్ట్‌ ముఖ్యం. హీరోని బట్టి కథను రాసుకోను. కాన్సెప్ట్‌ ప్రకారం హీరోను ఎన్నుకుంటాను. కాన్సెప్ట్‌ను కమర్షియల్‌ను బ్యాలెన్స్‌ చేసుకుని 'డిస్కో రాజా'తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ఈ సినిమా చేశాను. హాలీవుడ్‌ సినిమాలు చూసుకున్న కాన్సెప్ట్‌లో కూడా మంచి కమర్షియల్‌ ఉంటుంది. ఆ సినిమాలన్ని పెద్ద హిట్‌ అయ్యాయి. రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుడు మంచి అనుభూతికి గురవుతాడు'' అని 'డిస్కోరాజా' దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ తెలియజేశారు.

మాస్‌ మహారాజ రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా దర్శకుడు విఐ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం 'డిస్కో రాజా'. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు వి.ఐ ఆనంద్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన చెప్పి విశేషాలు.

- నాకు చిన్నప్పటి నుండి సైన్స్‌ ఫిక్షన్‌ అంటే బాగా ఇంట్రస్ట్‌. ఒకవిధంగా సైన్స్‌ ఫిక్షన్‌ నా ఫేవరేట్‌ జోనర్‌ కూడా. ఇక ఈ డిస్కో రాజా కాన్సెప్ట్‌ పది సంవత్సరాల క్రితమే నా మైండ్‌లోకి వచ్చిన కాన్సెప్ట్‌. ఎప్పటి నుండో ఈ సినిమా కథకు సంబంధించి ఫుల్‌ డైటిల్స్‌ కోసం సెర్చ్‌ చేస్తూనే ఉన్నాను. అలా రీసెర్చ్‌ చేసి తీసిన సినిమా ఇది.

- ఇది దేనికీ స్పూర్తికాదు. పేపర్లో గత ఏడాది బయో కెమికల్‌ ల్యాబ్‌ గురించి ఒక ఆర్టికల్‌ చదివాను. ఆ ల్యాబ్‌ రీసెర్చ్‌ సక్సెస్‌ అయితే ఎలా ఉంటుందనే కోణంలో స్క్రిప్ట్‌ రాసుకున్నా. స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. నాచురల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ అయినా ఎక్కడా ఫోర్స్‌డ్‌ ఎలిమెంట్స్‌ కనిపించవు. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంది. ఆడియన్‌ కూడా ఎగ్జైట్‌ కావాలనే రవితేజగారు చెప్పారు. అన్నీ కథలో భాగంగా వస్తాయి. సినిమాలో మంచి హ్యూమర్‌తో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ సహజంగా ఉంటాయి.

interview gallery



- నా కెరీర్‌లో 'ఎక్కడిపోతావు చిన్నదానా.. టైగర్‌' కంటే కూడా ఈ చిత్రం చాలా బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ చిత్రం అని చెప్పాలి.

- 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సినిమా క్రూ యాక్షన్‌ సీన్స్‌కి పని చేశారు. ఐస్‌లాండ్‌లో సీన్స్‌ చేయాలి. అక్కడ నిముషనిముషానికి టెంపరేచర్‌ మారిపోతుంది. అక్కడ ప్రత్యేకమైన కార్లు ఉపయోగించి చేయాల్సి వచ్చింది. 12 నిముషాల నిడివితో క్రిష్టోఫర్‌ అద్భుతగా మలిచారు.

- ఇది వేరే నటుడితో తీయాలనుకున్న కథ కాదు. డిస్కో రాజా రాసేటప్పుడే రవితేజకు సెట్‌ అవుతుంది అన్న ఆలోచనతో రాశాను. డిస్కోరాజా ఓ గ్యాంగ్‌స్టర్‌.. మ్యూజికల్‌ లవింగ్‌ క్యారెక్టర్‌ తనది. కథ ప్రకారం 1980 ప్రెజెన్స్‌ కావాలి. రవితేజ దానికి యాప్ట్‌. ఆయన నటన, డైలాగ్‌లు భిన్నంగా వుంటాయి. ఒక సీన్‌లో గన్‌పెట్టి బులెట్స్‌ లోడ్‌ చేస్తే చాలు. కానీ ఆయన డైలాగ్‌ కూడా చెప్పేస్తారు. ఇలాంటివి ఆయనలోని ప్రత్యేకతలు.

- రవితేజగారికి మొదటినుంచి కూడా డిస్కో అంటే చాలా ఇష్టమట. మిథున్‌ చక్రవర్తి నటించిన 'డిస్కోడాన్సర్‌'లో 'ఐయామే డిస్కోడాన్సర్‌' అనే పాటకు చాలా కనెక్ట్‌ అయ్యారు. అందుకే క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యి నటించారు.

- సినిమా మొత్తం అంతా డిస్కోరాజాదే. ఇక టైటిల్‌కు వివరణ ఏమిటనేది మూవీలో చూడాల్సిందే.

- ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్‌ కోసం కాస్త ఎక్కువ రోజులు తీసుకున్నాం. ఐస్‌లాండ్‌ లొకేషన్‌లో వెళ్ళాకే అన్నీ పరిశీలించాం. ప్రతిదీ డిటైల్‌గా చేయాలని టైం తీసుకున్నాం. ఇందులో బాబీ సింహా పాత్ర బర్మాసేతుగా నటించారు. తను చెన్నైలో ఓ గ్యాంగ్‌ స్టర్‌. 'జిగర్‌తాండా'లాగా భిన్నమైన పాత్ర.

- రవితేజ దగ్గరకామెడీ.. హరోయిజం.. అన్నీ ఉన్నాయి. ప్రెజెంటేషన్‌ డిఫరెంట్‌గా వుంటుంది. మాస్‌ ఎలిమెంట్స్‌ కామెడీ టైమింగ్‌ హీరో రవితేజ నుంచి ఒక ఆడియన్‌ ఏదైతే కోరుకుంటాడో ప్రతి ఒక్కటి ఈ సినిమాలో కనిపిస్తుంది. కథలో ఏవిధంగా రావాలో అదే విధంగా వస్తాయి. ఏదీ ఫోర్స్‌డ్‌గా వుండకూదని రవితేజ రూల్‌.

- 'ఒక్కక్షణం' చిత్రం దర్శకుడిగానాకు సంతృప్తి నిచ్చింది. నిర్మాతకూ మంచి పేరు వచ్చింది. కానీ డిసెంబర్‌ 28న విడుదల కావడం రాంగ్‌ టైంగా తర్వాత భావించాం. ఆ సినిమా చూశాక ఇండస్ట్రీ పెద్దలు, విమర్శకులు కూడా బాగుందని మెచ్చుకున్నారు.

- నా తదుపరి ప్రాజెక్ట్‌ గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో సినిమా చేయాలి. నిఖిల్‌తోనా ఎవరితో అన్న విషయం త్వరలో మీకే తెలుస్తుంది. ఇంకా భిన్నమైన జోనర్‌లో సినిమాలు చేయాలనుంది.

- సినిమా ఇండస్ట్రీకి నేను కొత్త. కోర్సుకూడా చేయలేదు. బేసిగ్గా నేను ఆర్ట్కిటెక్‌ని. చెన్నయ్‌లో చదివాను. ధీసెస్‌లో భాగంగా ఫిలింసిటీని ఎంపిక చేసుకున్నాను. అక్కడ వుండగానే ఇండస్ట్రీలోకి ప్రవేశం కల్గింది. తొలుత అసిస్టెంట్‌గా పనిచేశాను.

- నేను దేవుడిని, దెయ్యాలను నమ్ముతాను. అలాగే ఎలియన్స్‌నూ నమ్ముతాను, సైన్స్‌, గాడ్‌ డిఫరెంట్‌ నేమ్స్‌. రెండిటినీ నమ్ముతాను సైన్స్‌లో ఎనర్జీ ఉంది. దాన్ని దేవుడు అనుకోవచ్చు.

- నాకు తెలిసి రవితేజలో టాప్‌ పెర్‌పార్మెన్స్‌లో ఇది ఒకటి. ఇంతవరకు ఈ పాత్ర చేయలేదు. ఇది నేను గర్వంగా చెబుతా..

- ఈ చిత్రినికి సీక్వెల్‌ కూడా రెడీగా వుంది. లైన్‌చెప్పాను.. ఈ రిజల్ట్‌ని బట్టి ఆ చిత్రం ప్లాన్‌ చేస్తాం.

- వెబ్‌ సిరీస్‌.. ఇలాంటి కథలు చేయవచ్చు. కానీ నాకు కమిట్‌మెంట్‌ వున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved