pizza
Vijay Devarakonda interview (Telugu) about Dwaraka
ఇమ్రాన్ హ‌ష్మితో పోలిస్తే అవ‌మానంగా ఫీల‌వుతా - విజ‌య్ దేవ‌ర‌కొండ‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2017
Hyderabad

చిన్న చిన్న సినిమాల‌తో నిల‌దొక్కుకుని మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌ల విడుద‌లైన పెళ్లిచూపులు ఆయ‌న‌కు హీరోగా చాలా పెద్ద విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న న‌టించిన ద్వార‌క విడుద‌ల కానుంది. ఆ సినిమా గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* ఎలా ఉండ‌బోతోంది ద్వార‌క‌?
- ఇప్ప‌టిదాకా నేను అలాంటి పాత్ర చేయ‌లేదు. చాలా బావుంది. దొంగ బాబా పాత్ర‌. ఎర్ర‌శీను అనే కేర‌క్ట‌ర్‌లో చేశా. విన‌గానే నాకు చాలా కొత్త‌గా అనిపించింది.

* ద్వార‌క అని ఎందుకు పెట్టారు?
- ఈ చిత్రంలో ద్వార‌క అనే అపార్ట్ మెంట్ ఉంటుంది. దానిలో జ‌రిగే అంశాల‌కు, సినిమాకు సంబంధం ఉంటుంది. ర‌క‌ర‌కాల మ‌న‌స్త‌త్వాలున్న వ్య‌క్తుల‌తో హీరో క‌లిసిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌న్న‌ది ఈ సినిమా.

* ఇందులో దొంగ‌గా న‌టించారా?
- అవునండీ. దొంగ‌త‌నాలు చేస్తుంటాను. ఒక‌సారి దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికే ఈ అపార్ట్ మెంట్లోకి వెళ్తాను.

* మీరు ఎప్పుడైనా అపార్ట్ మెంట్లో ఉన్నారా?
- ఉన్నాను. ఒక‌ప్పుడు అపార్ట్ మెంట్లు స‌ర‌దాగా ఉండేవి. ఇప్పుడు ఏ అపార్ట్ మెంట్‌లో ఎవరున్నారో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అలాంటి ప‌రిస్థితి ఉంది.

* మీ ఫ్లాట్‌ని అంద‌రూ గుర్తుప‌ట్టే ఉంటారు లెండి?
- నిజ‌మే. పెళ్లి చూపులు త‌ర్వాత అంద‌రూ బాగానే గుర్తుప‌డుతున్నారు. మా వైపు బారాత్ వెళ్లినా, ఇంకేదైనా ఊరేగింపు వెళ్లినా, మా అపార్ట్ మెంట్ ముందు ఆగి విజ‌య్‌ని కిందికి ర‌మ్మ‌ని పిలుస్తున్నారు. అందుకే మా నాన్న నాతో ఈ మ‌ధ్య ఒక‌మాట అన్నారు. `ఎక్కువ‌గా విండోస్ వైపు ఉండ‌కురా`ఎవ‌రైనా అడిగితే షూటింగ్‌లో ఉన్నావ‌ని చెప్తా` అని అన్నారు.

Vijay Devarakonda interview gallery

* అంటే ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి దూర‌మ‌వుతున్న‌ట్టు అనిపిస్తోందా?
- అంటే షూటింగ్‌ల వ‌ల్ల అలా అనిపిస్తోందేమో కానీ నిజంగా ఏమీ కాదు. ఇప్ప‌టికి ఏమాత్రం స‌మ‌యం దొరికినా నా స్కూల్ ఫ్రెండ్స్ తో వాలీబాల్ ఆడుకుంటుంటా. కాస్త జ‌నాలు ఎక్కువుంటే క్రికెట్ ఆడుకుంటాం. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.

* ఏవో కొన్ని క‌థ‌లు కూడా రాశార‌ట క‌దా.. అవి ఇప్పుడు మీకు ప‌నికొస్తాయా?
- లేదండీ. నేను రాసే క‌థ‌ల్లో నేను హీరోగా ఎప్పుడూ ఉండ‌ను. అలాగే ఒక‌వేళ సినిమా తీసినా హీరో నేను కాను. ఇంకెవ‌రో ఉంటారు.

* ఈ మ‌ధ్య ముద్దులు చాలా పెడుతున్న‌ట్టున్నారు?
- ముద్దుపెట్ట‌గానే అంద‌రూ ఇమ్ర‌న్‌తో పోలిస్తే చాలా చిరాకుగా ఉంది. నా దృష్టిలో ప్ర‌తి మ‌గ‌వాడూ ముద్దుపెట్ట‌గ‌లిగిన‌వాడే. అలాంట‌ప్పుడు ఇమ్ర‌న్‌తో మాత్ర‌మే ఎందుకు పోల్చాలి. అంటే మిగిలిన మ‌గ‌వాళ్ల‌ను కించ‌ప‌రిచిన‌ట్టేగా. ఈ సినిమాలో హీరోయిన్‌తో రెండు సార్లు ముద్దులున్నాయి.

* పెళ్లిచూపులు సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌ని వాడుకున్నారా?
- ఆ... (న‌వ్వుతూ) రెమ్యున‌రేష‌న్ పెంచా క‌దా.

* నెక్స్ట్ సినిమాలేంటి?
- అర్జున్ రెడ్డి విడుద‌ల‌కుంది. ఆ త‌ర్వాత గీతా ఆర్ట్స్ లో రెండు సినిమాలున్నాయి. ఒక‌టి రాహుల్‌తో, మ‌రొక‌టి ప‌ర‌శురామ్‌తో.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved