pizza
Vijay Devarakonda interview (Telugu) about Geetha Govindam
తప్పులు చేయడానికి ఇష్టపడతాను - విజయ్‌ దేవర కొండ
You are at idlebrain.com > news today >
Follow Us

14 August 2018
Hyderabad

విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో బన్నివాసు నిర్మించిన చిత్రం 'గీత గోవిందం'. ఆగస్ట్‌ 15న సినిమా విడుదలవుతుంది. ఈసందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ ఇంటర్వ్యూ...

ఫుల్‌ బిజీగా ఉన్నట్లున్నారు కదా?
- కొన్ని నెలలుగా గ్యాప్‌ లేకుండా కంటిన్యూగా పని చేస్తున్నాను. కాస్త ఆలసటగా అనిపిస్తుంది. సినిమా రిలీజైన తర్వాత వారం పాటు ఫుల్‌ రెస్ట్‌లో ఉండాలనుకుంటున్నాను. బిజీగా ఉండాలనే అనుకుంటున్నాను. పని విషయంలో నేను కంప్లయింట్‌ చేయాలనుకోవడం లేదు. అయితే ఓ ఫేజ్‌లో కంటిన్యూగా పని చేసుకుంటూ... రెస్ట్‌ లేకపోతే సమస్యలు వచ్చేస్తాయి. రెస్ట్‌ కూడా తీసుకోవాలి కదా. ఈ ఫేజ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను. ఆలోచించడానికి టైమ్‌ లేకుండా పని చేసుకుంటూ పోతున్నాను.

కన్‌ఫ్యూజన్‌లో తప్పులు చేస్తాననే భయం లేదా?
- 'పెళ్ళిచూపులు' నుండి అన్ని స్పీడుగా జరిగిపోతున్నాయి. నా కెరీర్‌ వెనుక నేను పరిగెత్తుతున్నాను. కన్‌ఫ్యూజన్‌లో తప్పులు చేస్తాననేం లేదు. ఎందుకంటే నేను చిన్నప్పట్నుంచి కన్‌ఫ్యూజింగ్‌ పర్సనే. నేను తప్పులు చేయడానికి ఇష్టపడతాను. నా నిర్ణయం వల్ల తప్పులు జరిగితే వాటిని భరిస్తాను. వేరే వారి వల్ల తప్పులు జరిగి.. వాటిని నేను బాధ్యుడ్ని అయితే భరించలేను. నచ్చిన వర్క్‌ను చేసుకుంటూ పోతున్నాను.

ఈ సినిమాలో మీరు పాడిన పాట ట్రోలింగ్‌ అయింది కదా?
- పాట సరదాగా సాగేదే. నచ్చే పాడాను. ఓరోజు టైమ్‌ తీసుకున్నాను. 45 నిమిషాల్లో పాడటం పూర్తయ్యిది. పాట ట్రోలింగ్‌ అయినప్పుడు నేను ఎంజాయ్‌ చేశాను. పాట బాలేదు.. దరిద్రంగా ఉందంటే సరే... ఇక పాటలు పాడటం ఆపేయ్‌ అంటే ఎలా! సలహాలు చెబితే నాకు నచ్చదు. అమ్మ నాన్న సలహాలు చెబితేనే వినను. అలాంటిది బయటివాళ్లు చెబితే ఎలా వింటాను.

interview gallery



అర్జున్‌రెడ్డి తర్వాత వస్తున్న సినిమా కదా.. పోలికలున్నాయా?
- అర్జున్‌రెడ్డిలో హీరో.. హీరోయిన్‌ని సిన్సియర్‌గానే ప్రేమిస్తాడు. ఈ సినిమాలో కూడా గోవిందం.. గీతను సిన్సియర్‌గానే ప్రేమిస్తాడు. ప్రేమ ఒకటే కామన్‌. అయితే రెండు దారులు వేర్వేరుగా ఉంటాయి. నాకు ఫ్యామిలీ చిత్రాలు చూడటమే ఇష్టం. చేయడానికి కాదు. అయితే 'ఇలాంటి జోనర్‌ సినిమాలు చేస్తేనే కదా! రీచ్‌ ఉంటుంది' అని బన్ని వాసు అన్నారు. నాకు నిజమేననిపించింది. ఈ సినిమాకు నాకు ఏదైనా క్రెడిట్‌ వస్తే.. అది పరుశురాం బన్నివాసులకే దక్కుతుంది.

సినిమా పైరసీ కావడం .. చాలా బాధపడ్డటున్నారు?
- కచ్చితంగా బాధ ఉంటుంది. ఎవరికైనా బాధ ఉంటుంది. ఇది జరగకుండా ఉండుంటే బావుండేది. సినిమా అయినా.. లైఫ్‌ అయినా డ్రామా కచ్చితంగా ఉండాల్సిందే. ఈ ఘటనను ఓ జ్ఞాపకం అనుకుంటానంతే.

మీ తమ్ముడి సినీ రంగ ప్రవేశం గురించి...?
- ఆ సంగతి వాడినే అడగండి.. వాడి విషయాలను నేను పట్టించుకోను. నా గోల.. నా సినిమాలు నావి.

టాక్సీవాలా ఆలస్యమవుతుంది?
- సీజీ వర్క్‌ కారణంగానే ఆలస్యం అవుతుంది. ఇంతకు ముందు చేసిన సీజీ వర్క్‌ నచ్చలేదు. దాంతో మళ్లీ సీజీ వర్క్‌ చేయిస్తున్నాం. కాస్త ఆలస్యమైనా.. హడావుడి లేకుండా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.

ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తున్నట్లున్నారు?
- ఆ సంగతులను త్వరలోనే చెబుతా

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved