pizza
Vijay Deverakonda interview (Telugu) about Taxiwaala
వాటిలాగా.. పైర‌సీ సైట్ల‌ను కూడా బ్యాన్ చేయాలి - విజ‌య్ దేవ‌ర‌కొండ‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2018
Hyderabad

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ఏం చేసినా టాకే. ఆయ‌న నోట్లో పుల్ల పెట్టుకున్న టాకే. కొత్త‌గా డ్ర‌స్ వేసుకున్నా టాకే. రౌడీస్ అన్నా టాకే. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `టాక్సీవాలా` శ‌నివారం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ఆయ‌న గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `నోటా` త‌ర్వాత వ‌స్తున్న సినిమా కదా... మీరేమైనా టెన్ష‌న్ ఫీల‌వుతున్నారా?
- లేదండీ. అలాంటిదేమీ లేదు. దానిక‌న్నా నేను ఈ సినిమా పైర‌సీ అయింద‌ని ఎక్కువ టెన్ష‌న్ ప‌డుతున్నా.

* చాలా ప్రెజ‌ర్ ఫీల‌వుతున్నారా?
- అంటే నేను `గీత గోవిందం`, `నోటా`కు ఎక్కువ ప్ర‌మోష‌న్ చేశాను కాబ‌ట్టి, ఈ సినిమాకు న‌న్ను వ‌దిలేయండి.. ఎందుకంటే అప్పుడు మాట్లాడింది.. ఇప్పుడు మాట్టాడింది.. అంతా ఒకేలా ఉంటుంది అని అన్నా. కానీ ఈ మ‌ధ్య మా సినిమాటోగ్రాఫ‌ర్‌, మా రైట‌ర్లు పోస్ట్ లు పెడుతుంటే, వాళ్ల రీచ్ కొంత వ‌ర‌కు ఉంటుంది అర్థ‌మైంది. అయితే వాళ్ల రీచ్ క‌న్నా, నేను మాట్లాడితే వేరుగా ఉంటుంది అని అనుకున్నా. నా టీమ్ త‌ర‌ఫున బాధ్య‌త‌గా ఫీల‌యి వ‌చ్చి చేస్తున్నా. ఈ సినిమా ఎప్పుడు విడుద‌లైనా ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కానీ పైర‌సీ కావ‌డం వ‌ల్ల ఏమ‌వుతుంది? అంద‌రూ సినిమా ఆల్రెడీ చూసేసి ఉంటారా? చూసిన వాళ్లు మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అని అనుకున్నా. `పెళ్లిచూపులు` రిలీజ్ అయ్యే ముందు ఇలా లీక్ అయితే, నాకు అర్జున్‌రెడ్డి వంటి సినిమా లేకపోయేది. కానీ ల‌క్కీగా నాకు ఆ సినిమాకు కాలేదు. జ‌నాలు చూశారు. అంద‌రికీ న‌చ్చింది. అందువ‌ల్ల నాకు కెరీర్ మొద‌లైంది. ఇప్పుడు బావున్నాను. ఈ సినిమాకు నా టీమ్ ప‌డ్డ క‌ష్టం నాకు తెలుసు. నేను ఇప్పుడు అనుకుంటే ఇదే టీమ్‌తో మ‌ర‌లా సినిమా కూడా చేసుకోవ‌చ్చు. అయితే మేం ఆడియో లాంచ్‌లో ఇంత‌గా చెప్పిన త‌ర్వాత కూడా కొన్ని సైట్లు సినిమాను ఇంకా పెడుతూనే ఉన్నాయి. అంతేగాదు.. మాకు సారీలు కూడా చెబుతున్నాయి.

* మీ సినిమాలు వ‌రుస‌గా లీక్ అవుతుంటే ఏమ‌నిపిస్తోంది?
- ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ మ‌ధ్య కాకినాడ‌లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు నా ఫ్రెండ్స్ క‌లిశారు. వాళ్ల‌తో పాటు నేనున్న కొన్ని వీడియోలు చూపించారు. 2012, 2013 లో తీసుకున్న‌ వీడియోలు అవి. వాటిలో నేను న‌న్ను చూస్తుంటే గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నా. అప్పుడు కెరీర్ టెన్ష‌న్ చాలా ఉండేది. డ‌బ్బుల టెన్ష‌న్ ఉండేది. అందులో అంద‌రూ న‌వ్వుతూ ఉంటే, నేను మాత్రం ఆలోచ‌న‌లో ఉన్నా. అప్పుడు రెస్టారెంట్‌కు వెళ్తుంటే ఇబ్బంది ఫీలింగ్ ఉంటుంది. `నేను ఆర్డ‌ర్ చేసి, నేను క‌డ్త‌లేను` అని అనిపిస్తుండేది. ఒక‌ప్పుడు సినిమాలే ఉంట‌యో, లేదో అనే టెన్ష‌న్‌. సినిమాలే లేని టెన్ష‌న్‌తో పోలిస్తే, ఇప్పుడు బెట‌ర్ క‌దా. ఇప్పుడు నేను చేసిన సినిమా అటూ ఇటూ అయినా న‌న్ను, నా టీమ్‌ను సేఫ్‌గార్డ్ చేసే పొజిష‌న్‌, ఆరాధించే వ్య‌క్తులు ఉన్నారు. అవ‌న్నీ చాలా హ్యాపీగా అనిపించే విష‌యాలు.

* కంటెంట్ బ‌య‌ట‌కు రాగానే కొంత కంట్రోల్ చేసిన‌ట్టున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్టున్నాయిగా?
- నిజమే. పైర‌సీ సైట్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ప్ర‌తి దాన్లోనూ కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. యాంటీ పైర‌సీ టీమ్ ఒక్కో లింకును తీయ‌డానికి పావుగంట పడుతుంటే, ఆ త‌ర్వాత మ‌ర‌లా ఇంకో సైట్‌లో అది ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. పైగా కొన్ని సైట్లు `మా ద‌గ్గ‌ర రెండు నెల‌ల‌కు ముందే ఈ కంటెంట్ ఉంది. కానీ మేం సినిమా రిలీజ్ అయ్యాక పెట్టాల‌నుకున్నాం. అయితే ఇప్పుడు అన్నీ సైట్లు పెట్ట‌డంతో దీన్ని పెట్టాల్సి వ‌స్తోంది` అని కింద కామెంట్లు కూడా పెడుతున్నారు. అవ‌న్నీ చూసిన త‌ర్వాత రీచ్‌ను స్లో చేశాం.

* ఇప్పుడు ఏం చేయాల‌నిపిస్తోంది?
- నేను వ్య‌క్తిగ‌తంగా ఏమీ చేయ‌లేక‌పోతున్నా. ఇలాంటివాటిని గ‌వర్న‌మెంట్ ఏదో ఒక‌టి చేయాలి. దీని గురించి నాకు పెద్ద‌గా తెలియ‌దు. కానీ నా ఫ్రెండ్స్ ఒక‌రు ఏమ‌న్నారంటే `పోర్న్ సైట్ల‌ను బ్యాన్ చేసిన‌ట్టు ఈ సైట్ల‌ను బ్యాన్ చేయాలి` అని.

* వీటిని అరిక‌ట్ట‌డానికి మీకు వ్య‌క్తిగ‌తంగా టీమ్ ఉంద‌ని కూడా చెప్పారుగా?
- ఉన్నారు. వాళ్లు మోనిట‌ర్ చేస్తున్నారు. అయినా వెల్ విష‌ర్స్ కూడా ఆ లింకుల‌న్నిటినీ నాకు పంపిస్తున్నారు.

* ఒక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాలే లీక్ అయ్యేవి. కానీ ఇప్పుడు మీ సినిమాలు అలా అవుతున్నాయంటే మీరు ఎదిగినట్టున్నారుగా?
- నా ఫ్రెండ్ ఒక‌రు కూడా ఇలాగే అన్నారు. నీ సినిమా థియేట‌ర్ల‌కు వ‌చ్చేవ‌ర‌కు ఎవ‌రూ ఆగ‌డం లేదురా అని అన్నారు.

* లీకైన సినిమాలు బాగా ఆడుతున్నాయ‌నిపిస్తోందా?
- నేను అలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ అస‌లు పెట్టుకోను . సినిమా బావుంటే చూస్తార‌ని అనుకుంటా. అయితే ఈ మ‌ధ్య కొన్నిసార్లు అలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకోవాలేమోన‌ని అనిపిస్తోంది.

interview gallery



* నోటా సినిమాకు ఎక్కువ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నారేమో?
- అంటే అప్పుడు నేను ద‌గ్గ‌రుండి స్క్రిప్ట్ లు చూసుకునే పొజిష‌న్ నాకు లేదు. ఎందుకంటే ఒక‌వైపు గీత‌గోవిందం, ఒక‌వైపు నోటా, మ‌రోవైపు ట్యాక్సీవాలా.. ఇలా మూడు సినిమాల మ‌ధ్య తిరుగుతూ ఉన్నా. సినిమాను కూడా విడుద‌ల‌కు ఒక రోజు ముందే చూశా. ఇక అప్పుడు నేను చేయ‌గ‌లిగింది ఏమీ చేయ‌లేక చూడ‌లేదు. ఇక‌పై అలా కాకుండా ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేద్దామ‌ని అనుకుంటున్నా. అయితే అది వ‌చ్చే ఏడాది దాటాకే కుదురుతుందేమో.

* మీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గురించి చెప్పండి?
- నేను పెట్టాల‌ని ఏమీ అనుకోలేదు. కొండంత న‌మ్మ‌కం ఉన్న‌ప్ప‌టికీ, కొన్నిసార్లు మంచి స్క్రిప్ట్ లతో అంద‌రి చుట్టూ తిర‌గ‌డం నాకు గుర్తుంది. అలా కాకుండా టాలెండ్ ఉన్న వారికి అవ‌కాశం ఇద్దామ‌నుకున్నా. నేన‌యితే ప‌ర్టిక్యుల‌ర్‌గా ఏమీ అనుకోలేదు. కాక‌పోతే దానంత‌ట అదే ఒక షేప్ తీసుకుంటుంద‌ని న‌మ్ముతున్నా.

* ఇందులో హార‌ర్ ఎలిమెంట్స్ ఉంటాయా?
- ఉంటాయి. కానీ నాకు హార‌ర్ సినిమాలంటే భ‌యం నేను వాటిని పెద్ద‌గా చూడ‌ను.

* మామూలుగా మీ సినిమాల గురించి, మిగిలిన వాటి గురించి మీరు ఎవ‌రితో డిస్క‌స్ చేస్తుంటారు?
- ఎవ‌రితోనూ చేయ‌ను. నా స్కూల్ ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతుంటానంతే. చిరంజీవిగారు, బ‌న్ని అన్న మొన్న నాకు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చినందుకు చాలా థాంక్స్ చెబుతున్నా.

* పెద్ద ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌ట్లేదెందుకు?
- వ‌చ్చే ఏడాది చేస్తాను. పెద్ద ద‌ర్శ‌కులు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `మాతో కూడా సినిమాలు చేయి విజ‌య్` అని అడుగుతుంటే మ‌స్త్ హ్యాపీగా ఉంది. త‌ప్ప‌కుండా చేస్తా.

* ఇంకా ఏమేం సినిమాలున్నాయి?

- ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ ఉంది. `పెళ్లి చూపులు` టైమ్ లో భ‌ర‌త్ క‌మ్మ నాకు ఆ స్క్రిప్ట్ చెప్పి, ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. అది వ‌చ్చే ఏడాది వ‌స్తుంది.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved