pizza
Vikram K. Kumar interview about 24 success
వ్యవధి కంటే ఎంత మంచి కథ చెప్పామనేదే ముఖ్యం – విక్రమ్ కె.కుమార్
ou are at idlebrain.com > news today >
Follow Us

11 May 2016
Hyderaba
d

13బి, ఇష్క్, మనం వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్  ఫిక్షన్ థ్రిల్లర్ 24. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. మే 6న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తో ఇంటర్వ్యూ....

సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా హ్యాపీగా ఉన్నాం. టీం వర్క్ తో మేం ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని తెరపై చూపెట్టాం. ఈ సినిమా ప్రారంభం నుండి ఓ ఎగ్జయిట్ మెంట్ విషయాన్ని చెబుతున్నామని తెలుసు. పెద్దల వారితో పాటు పిల్లలు కూడా సినిమాను బాగా ఇష్టపడుతున్నారు.

ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?
చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ను, ఇంత సింపుల్ గా ఎలా చెపారని అన్నారు. ఇలాంటి కాంప్లిమెంట్ వింటుంటే హ్యాపీగా ఉంది. సూర్యగారు చాలా రిలీఫ్ గా ఉన్నారు. హీరోగా ఆయన్ను చాలా రకాలైన క్యారెక్టర్స్ లో చూసుంటారు. నిర్మాతగా కూడా ఆయనెంత ఫ్యాషనేటెడ్ పర్సనో ఈ సినిమా ద్వారా తెలిసింది. ఆయన బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను.

24 చిత్రీకరణ సమయంలో బాగా ఎక్కువగా ఆలోచించిన సన్నివేశం?
సినిమాలో ప్రతి విషయాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా విషయాలను నేర్చుకున్నాం. అయితే కథలో హీరోకు వాచ్ దొరికినప్పుడు దానితో ఏం చేయవచ్చు అనే విషయాలను చాలా  సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఏదో వాచ్ దొరికిందిగా, ఏదో చేయవచ్చు.. అన్నట్లు చెబితే ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని ఆ విషయంలో చాలా ఎక్కువగా ఆలోచించాను. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం అనేది అంటే ఆ వాచ్ ను ఎమోషనల్  సీన్స్ కు ఎలా కనెక్ట్ చేయాలి, లవ్ సీన్స్ కు, వాచ్ కు మధ్య సంబంధాన్ని ఎలా చూపెట్టాలనే విషయం చాలా కష్టం.

Vikram K. Kumar interview gallery

పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత..ట్రిమ్ చేయడానికి కారణమేంటి?
ఒక్కొక్క కథకు ఒక్కొక్క వ్యవధి ఉంటుంది. ప్రతి కథను రెండు గంటల ఇరవై  నిమిషాల్లో చెప్పడం కష్టం. ఆడియెన్స్ సినిమాను ఇంత వ్యవధిలోనే చెప్పాలని చెప్పలేదు. వ్యవధి కంటే ఎంత మంచి కథ చెప్పామనేదే ముఖ్యం.

ప్రతి సినిమాను చాలా డిఫరెంట్ చేస్తున్నారు ఈ ఆలోచనల వెనుక దాగిన ప్రాసెస్ ఏంటి?
సినిమాను ఓకే స్టయిల్ లో చేసుకుంటూ వస్తే బోరింగ్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయడం వల్ల కొత్త సీన్స్ రాసుకోవచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి. టైం గురించి చాలా మంది చాలా రకాలుగా రాశారు. 24 సినిమాలో నేను చెప్పిన పాయింట్ నా స్టయిల్ లో సింపుల్ గా చెప్పాను. మన ఆడియెన్స్ కు నచ్చేలా ఉండాలి కానీ ఇంగ్లీష్ సినిమాల తరహాలో ఉండకూడదని అనుకుంటాను.

24 సినిమాకు సీక్వెల్ ఉంటుందా?
24 సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందండీ..అల్రెడి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. ప్రీక్వెల్ చేయడానికి కారణమేమంటే ఆత్రేయ ఆ వాచ్ ను ఎందుకు పొందాలనుకుంటాడనే పాయింట్ నుండి సినిమాను స్టార్ట్ చేశాను. సినిమాలో చాలా విషయాలు ఆలోచించేలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన కథకు ముందు ఏం జరిగిందనే దాన్ని సినిమాగా ప్రీక్వెల్ లో చూపిస్తాను.

సమంత, నిత్యామీనన్ మీకు లక్కీ హీరోయిన్స్ గా భావిస్తారా?
వందశాతం అవుననే అంటాను...అయితే అంత కంటే ముందు వాళ్లిద్దరూ వండర్ ఫుల్ నటీమణులు. ఇద్దరితో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడతాను.

తదుపరి చిత్రాలు...
నేను ఇష్టం సినిమాతో దర్శకుడిగా మారాను. చిన్న బ్రేక్ తీసుకున్నా కానీ నాకు తెలుగు సినిమానే ముఖ్యం. అల్లుఅర్జున్ తో నా తదుపరి చిత్రం ఉంటుంది. నేను చెప్పిన పాయింట్ తనకు బాగా నచ్చింది. అలాగే మహేష్ బాబుగారికి కూడా చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. వాళ్లిద్దరితోనే నా నెక్ట్స్ మూవీస్ ఉంటాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved