pizza
Vineet about Pidugu
నాకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం – హీరో వినీత్
You are at idlebrain.com > news today >
Follow Us

13 March 2016
Hyderaba
d

గోటి సన్స్ పతాకంపై వినీత్, మోనికా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'పిడుగు'. సి.హెచ్.రామ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశోక్ గోటి నిర్మించారు. సినిమాను మార్చి 18న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంలో హీరో వినీత్తో ఇంర్వ్యూ....

నేప‌థ్యం...
- మాది విశాఖ. ఎంబీయే చదివాను. నాన్నగారికి రియ‌ల్ ఎస్టేట్‌, భవన నిర్మాణంలో అపార అనుభవముంది. నటుడిగా ఎప్పుడూ ఊహించుకోలేదు. చదువు పూర్తయిన తర్వాత రెండేళ్లు వ్యాపారం చూసుకున్నాను. నటనలో సత్యానంద్ గారివద్ద శిక్షణ తీసుకున్నాను. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చేవాడ్ని. చాలా బహుమతులు వచ్చాయి. స్నేహితులందరూ సినిమాల్లో ప్రయత్నించమంటూ ప్రోత్సహించారు.అలా సినిమాల్లో చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేయ‌గ‌ల‌ను.

ద‌ర్శ‌కుడు సి.హెచ్.రామ మోహన్ గురించి....
- ఈ సినిమా చేయ‌డానికి ముందు 30 క‌థ‌లు వ‌ర‌కు విన్నాను. అయితే రామ్మోహ‌న్ గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాను. ద‌ర్శ‌కుడు సి.హెచ్‌.రామ్మోహ‌న్ ప‌లువురు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో వ‌ర్క్ చేశారు. సినిమా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. నాకు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైటులతో కమర్షియల్ మూవీ. క‌థ‌, నెరేష‌న్ న‌చ్చ‌డంతో నాన్న నిర్మాతగా మారారు. గ‌త ప‌దేళ్ళ‌లో ఇలాంటి స‌బ్జెక్ట్ సినిమా రాలేదు.

క్యారెక్ట‌ర్ గురించి..
- 'పిడుగు'లో సంపన్న యువకుడు జై శ్రీవాత్సవ పాత్రలో నటించాను. నా పాత్రలో నాలుగైదు కోణాలున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కథలో మలుపు వస్తుంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు గత పదేళ్లలో ఇటువంటి కథ రాలేదు. ప్రేమ, వినోదం, యాక్షన్.. చిత్రంలో అన్నీ ఉన్నాయి.

సీనియ‌ర్స్‌తో యాక్ట్ చేయ‌డం ప్ల‌స్ అయ్యింది...
- ఈ చిత్రంలో వినోద్ కుమార్, బెనర్జీ, జబర్దస్త్ గ్యాంగ్ చిత్రంలో నటించారు. సీనియ‌ర్స్ తో చేయ‌డం వ‌ల్ల వారు యాక్టింగ్‌లో కొన్ని టెక్నిక్స్ చెప్పారు. వారితో క‌లిసి యాక్ట్ చేయ‌డం ప్ల‌స్ అయ్యింది. పాటలకు మంచి స్పందన లభించింది. చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్‌....
- నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓ పెద్ద ద‌ర్శ‌కుడితో చేయ‌బోతున్నాను. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా బ‌యట నిర్మాణ సంస్థలో ఉంటుంది. ఈ నెలాఖరున కొత్త సినిమా వివరాలు తెలియ‌జేస్తాను.

 

Vineet interview gallery

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved