pizza
Director Virinchi Varma interview about Majnu
స్క్రిప్ట్ పై న‌మ్మ‌కంగా ఉన్నా...ద్వితీయ విఘ్నం గురించి భ‌యంలేదు - విరించి వ‌ర్మ‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 September 2016
Hyderaba
d

వరుస హిట్స్‌తో ముందుకు దూసుకెళ్తున్న నేచురల్‌ స్టార్‌ నాని 'మజ్ను'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'అంత:పురం', 'ఒకరికొకరు', 'నువ్వు నేను' రీసెంట్‌గా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'బీరువా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత పి.కిరణ్‌ కేవ మూవీస్‌ అధినేత్రి గీత గొల్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మజ్ను'. అనుఇమ్మాన్యుయ‌ల్‌, ప్రియ హీరోయిన్స్‌గా 'ఉయ్యాల జంపాల' ఫేం విరించివర్మ దర్శకత్వంలో రూపొందిన 'మజ్ను' చిత్రం సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రిలీజ్‌ అవుతోంది.ఈ సంద‌ర్భంగా దర్శ‌కుడు విరించి వ‌ర్మ‌తో ఇంట‌ర్వ్యూ....

ద‌ర్శ‌కుడు కాక‌ముందు...
- మదన్‌గారి వద్ద పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, గుండెఝల్లుమంది సినిమాలకు వర్క్‌ చేశాను. రామ్మోహన్‌గారిని కలిసిన తర్వాత ఆయనకు ఉయ్యాలా జంపాలా కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో సినిమా దర్శకత్వం చేశాను.

మజ్ను అంటే....
- లవ్‌ ఫెయిల్యూర్స్‌ అందరికీ ఉంటాయి. అయితే కొంత మంది మాత్రమే ఆ లవ్‌ఫెయిల్యూర్స్‌ను దాటి వారి ప్రేమను సక్సెస్‌ చేసుకుంటారు. అంత సిన్సియర్‌ లవర్‌ అన్నమాట. అయితే అప్పటి మజ్ను తన ప్రేమ కోసం చనిపోయాడు. కానీ మా మజ్ను సినిమా బాధాకరంగా ఉండదు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా మజ్ను హ్యాపీ మజ్ను...

డిఫరెంట్‌ లవ్‌స్టోరీ...
- నాని, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీలు మెయిన్‌గా నడిచే ఈ సినిమాలో ముగ్గురి మధ్య ప్రేమ ఉంటుంది కానీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ కాదు. అందుకే డిఫరెంట్‌గా ఉండే టిపికల్‌ లవ్‌స్టోరీ అని ట్రైలర్‌లోనే చూపించాం. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నాకు ఏ ప్రేమకథలు లేవు. నాకు సంబంధించిన ఏ రియల్‌ లైఫ్‌ ఇన్‌సిడెంట్స్‌ ఇందులో చూపించలేదు.

Director Virinchi Varma interview gallery

టెన్షన్‌ పడలేదు...
- నాని వరుస సక్సెస్‌లతో ఉన్నాడు. కాబట్టి అందరూ నాని అంటే పాజిటివ్‌గా ఉంటారు. ఇప్పుడు నాని చెప్పే విషయాన్ని ఆడియెన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకుంటారనే నమ్మకంతో నేను టెన్షన్‌ పడలేదు.

నానితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌...
- ఉయ్యాలా జంపాలా సినిమా నుండి నానితో మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో నానికి కథ వినిపించాను. కథ వినగానే నాని సినిమ చేయడానికి రెడీ అయ్యారు. నటుడిగా నాని యాక్టింగ్‌ టైమింగ్‌ చాలా బావుంటుంది. కథ రాసుకునేటప్పుడే నాని అనుకునే కథ రాసుకున్నాను. ఈ సినిమాలో కూడా ఒక పక్క ఏడుస్తూనే నవ్వించేలా సీన్స్‌ ఉంటాయి. ఇలాంటి వేరియన్స్‌ ఉన్న సీన్స్‌లో నాని మాత్రమే నటిస్తాడనిపించింది. అలాగే తన నటనలో కూడా వేరియేషన్స్‌తో నటించాడు నాని. తనతో వర్క్‌ చేయడం మంచి అనుభూతినిచ్చింది. షూటింగ్‌ టైంలో కూడా సీన్స్‌ను ఇంకా ఎలా బాగా చేయాలో చెప్పి సీన్స్‌ బాగా రావడానికి ఎంతగానో సపోర్ట్‌ చేశారు.

ఆ భయం లేదు...
- నేను స్క్రిప్ట్‌ రాసుకునేటప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి నమ్మకంగా ఉంటాను. కాబట్టి ద్వితీయ విఘ్నం గురించి భయపడలేదు.

వారిద్దరూ కనపడతారు...
- సినిమాలో నాని రాజమౌళిగారి అసిస్టెంట్‌గా కనపడతారు. కాబట్టి ఓ సీన్‌లో బాహుబలి చిత్రీకరణ లోకేషన్‌ను మజ్నులో చూపిస్తున్నాం కాబట్టి రాజమౌళిగారు ఈ సినిమాలో కనపడతారు. అలాగే హీరో రాజ్‌తరుణ్‌ కూడా స్పెషల్‌ అప్పియరెన్స్‌లో కనపడతారు.

తదుపరి చిత్రం గురించి...
- ఓ కథను రాసుకుంటున్నాను. నా మైండ్‌లో ఆ కథకు ముగ్గురు హీరోలు అయితే సరిపోతారనుకుంటున్నాను. కథ పూర్తి కాగానే వారిని కలిసి కథ చెప్పి ఒప్పుకుంటే సినిమా చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved