pizza
VV Vinayak interview (Telugu) about Khaidi No. 150
రిలీజ్‌కు ముందే సూపర్‌హిట్‌ ఫీలింగ్‌లో ఉన్నాను - వి.వి.వినాయక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 January 2017
Hyderaba
d

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ బ్యాన‌ర్‌పై శ్రీమ‌తి సురేఖ కొణిద‌ల స‌మ‌ర్ప‌ణ‌లో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`. సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌తో ఇంట‌ర్వ్యూ....

సినిమా రిలీజ్‌ అవుతుంది కదా..ఏమైనా టెన్షన్‌ పడుతున్నారా...?
నాకు ఎలాంటి టెన్షన్‌ లేదు. సినిమా రిలీజై సూపర్‌హిట్‌ అయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా రిలీజైన తర్వాత చిరంజీవిగారు సినిమా చూసి నన్ను హగ్‌ చేసుకున్నారు.

తమిళంలో కథతో ఎలాంటి మార్పు చేశారు?
- కథ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే చిరంజీవిగారి సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్‌ కామెడి, డ్యాన్సులు, పాటలు వాటిని యాడ్‌ చేశాను. బ్రహ్మానందం, రఘుబాబు పాత్ర, ఐటెంసాంగ్‌ తదితర అంశాలను జోడించాం.

చిరంజీవి క్యారెక్టర్స్‌ గురించి చెప్పండి....?
- చిరంజీవిగారు రెండు క్యారెక్టర్స్‌ చేశారు. అందులో ఒకటి చదువుకున్న గ్రాడ్యుయేట్‌. మరో రోల్‌ అల్లరి చిల్లరిగా ఉంటుంది. ఇంటర్వెల్‌ నుండి అల్లరి చిల్లరి క్యారెక్టర్‌ రెస్పాన్సిబిలిటీగా ఫీలై చేయడం మూడో షేడ్‌లా చేశారు. చిరంజీవిగారు రీమేక్‌ చేస్తారనుకోగానే పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్‌గారు, సాయిమాధవ్‌ బుర్రా అనేక వెర్షన్స్‌ రాశారు. చివరకు మంచి వెర్షన్‌ను సెలక్ట్‌ చేసుకున్నాం.

అభిమానులకు, ప్రేక్షకులకు సినిమా ఎలాంటి ఫీల్‌ను కలిగిస్తుంది...?
- సినిమా చూసిన వారు థ్రిల్‌ అయితే, సినిమా చూడనివారు డబుల్‌ థ్రిల్‌ ఫీలవుతారు. ఇంత మంచి కథను అందించిన మురుగదాస్‌గారికి థాంక్స్‌. ఠాగూర్‌ కంటే ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఠాగూర్‌ స్థాయిలో ఈ సినిమా ఎక్కడా తగ్గదు.

VV Vinayak interview gallery

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ?
- చిరంజీవిగారి ముందు సినిమాలు ఎలా ఉన్నా, ఖైదీ నుండి ఆయన జర్నీ డిఫరెంట్‌గా సాగింది. ఆ ఖైదీ ఇక్కడి వరకు చేరుకున్నాడనేదే నా ఇన్నర్‌ ఫీలింగ్‌...కథ పరంగా చూస్తే చిరంజీవిగారు జైలు నుండి ఖైదీగా కనపడతారు. ఆయన నెంబర్‌ 150. అందుకే ఈ టైటిల్‌ను పెట్టాం.

అసలు కథేంటి...?
- వేల రూపాయలు కూడా చూడని ఓ రైతు, కోట్ల రూపాయల కార్పొరేట్‌ కంపెనీలతో ఎలా పోరాడాడు. ఆ రైతు పోరాటానికి ఓ నాయకుడు(చిరంజీవి) ఎలా అండగా నిలబడ్డాడనేదే కథ. రైతు బాధను అందరికీ చెప్పే ప్రయత్నం చేశాం.

పొలిటికల్‌ టచ్‌ ఉంటుందా?
- పొలిటికల్‌ టచ్‌ ఉండదు. రైతు సమస్యలపై పోరాడే ఓ యువకుడి కథే ఇది.

ఠాగూర్‌కు ఈ చిత్రానికి చిరంజీవిగారిలో మీరేం గమనించారు?
- ఠాగూర్‌ కంటే ఖైదీ నంబర్‌ 150లో చిరంజీవిగారు చాలా అందంగా కనపడ్డారు. చూడాలని ఉంది సినిమాలో అప్పటి చిరంజీవి ఎలా ఉన్నారో అలా కనపడతారు. రేపు సినిమా చూస్తే మీరే ఆ విషయాన్ని చెబుతారు.

ముందు నుండి కాజల్‌ అగర్వాల్‌నే హీరోయిన్‌గా అనుకున్నారా?
- హీరోయిన్స్‌గా ఎక్కువ మందిని అనుకోలేదు. నేనైతే అనుష్కను, తర్వాత కాజల్‌ అగర్వాల్‌లో ఎవరో ఒకరిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాను. అనుష్క చేయాలనుకుంది కానీ అప్పటికి బాహుబలి2, ఓం నమో వేంకటేశాయ సినిమాలు చేస్తుండటంతో తను చేయలేక పోయింది. చివరకు కాజల్‌ హీరోయిన్‌గా చేసింది. సినిమాలో హీరోయిన్‌ పాత్రకు తగ్గ ఇంపార్టెన్స్‌ ఉంటుంది.

చిరంజీవితో వర్క్‌ చేశారు, చరణ్‌తో వర్క్‌ చేశారు...ఇద్దరికీ తేడా ఏం గమనించారు?
- చరణ్‌ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతారు. చిరంజీవిగారు సినిమా వర్క్‌లో ఇన్‌వాల్వ్‌ అవుతారు. చరణ్‌ ఈ సినిమాలో అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు సాంగ్‌లో ఓ బిట్‌లో డ్యాన్స్‌ చేశారు.

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రెస్పాన్స్‌ ఎలా అనిపించింది?
- మా సినిమా కుదరలేదు కానీ మంచి గ్రౌండ్‌ దొరికి ఉంటే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఇంకా అదిరిపోయుండేది. ఈ వేదికకు చాలా మంది పాసులున్నా రాలేకపోయారు. చిరంజీవిగారు వేదిక ఎక్కగానే మధ్యలో గేట్‌ను విరిచేశారు. పోలీస్‌ ఐజీ అయితే ఫంక్షన్‌ ఆపేయండని కూడా అన్నారు. అంటే అన్నయ్య అంటే ఇంకా అభిమానం ఏ మాత్రం తగ్గలేదని అనిపించింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved