pizza
Wamiqa Gabbi interview about Nannu Vadali Neevu Polevule
ఆ రోజు నాకు స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు. - వామికా
You are at idlebrain.com > news today >
Follow Us

08 March 2016
Hyderaba
d

`భ‌లే మంచి రోజు` సినిమాలో న‌టించిన భామ వామికా. ఆమె న‌టించిన త‌మిళ సినిమా మాలై నేర‌త్తు మ‌య‌క్కం. తెలుగులో `న‌న్ను వ‌ద‌లి నీవు పోలేవులే` పేరుతో ఈ నెల 18న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వామికా గ‌బ్బి హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* `న‌న్ను వ‌ద‌లి నీవు పోలేవులే` త‌మిళ వెర్ష‌న్‌కు ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?
- చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నా పెర్ఫార్మెన్స్ కి అప్రిషియేష‌న్ బాగా వ‌చ్చింది. నా ట్విట్ట‌ర్ అయితే ట్వీట్ల‌తో నిండిపోయింది.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- మ‌నోజా అనే పాత్ర చేశాను. త‌ను మోడ్ర‌న్ గ‌ర్ల్. ప్ర‌తి మ‌హిళా కోరుకునేట‌ట్టు త‌ను కూడా ప్రేమ కావాల‌ని కోరుకుంటుంది. త‌న‌కు కాబోయేవాడు ఎలా ఉండాలో క‌ల‌లు కంటుంది. కాస్త రియ‌లిస్టిక్ పాత్ర అది.

* ఏ జోన‌ర్ చిత్రం?
- రిలేష‌న్‌షిప్ డ్రామా. రియ‌లిస్టిక్‌గా ఉంటుంది.

* ఈ సినిమాను చేయ‌డానికి మిమ్మ‌ల్ని ప్రేరేపించిన అంశాలేంటి?
- బోల్డ్ గా చెప్పాలంటే మంచి స్క్రిప్ట్ ఇది. ముందు క‌థ విన‌గానే నేను చేయ‌డానికి హెజిటేట్ చేశాను. కానీ చేశాను.

Wamiqa Gabbi interview gallery

* కొన్ని బోల్డ్ సీన్లు కూడా ఉన్న‌ట్టున్నాయి క‌దా?
- అంటే అవి సినిమాకు అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలేమీ కావు. సినిమాలో భాగ‌మైన స‌న్నివేశాలు. అదీ ఓ మ‌హిళా ద‌ర్శ‌కురాలి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించినందువ‌ల్ల నాకేమీ చెడుగా అనిపించ‌లేదు.

* గీతాంజ‌లితో చేయ‌డం ఎలా అనిపించింది?
- నేను చాలా ఫ్రీగా త‌న‌తో మూవ్ అయ్యేదాన్ని.

* శ్రీరాఘ‌వ గురించి చెప్పండి?
- సెల్వ చాలా అమేజింగ్ ప‌ర్స‌న్‌. మంచి స్టోరీ, స్క్రీన్‌ప్లేని ఇచ్చారు.

* ముందు క‌థ విని వ‌ద్ద‌ని చెప్పాన‌న్నారుగా ఎందుకు?
- నేను ఇంత‌కు ముందు పంజాబీ, హిందీ సినిమాలు చేశాను కానీ ద‌క్షిణాది సినిమాలు చేయ‌లేదు. నాకు భాష రాని ప్రాంతంలో ఎలా ఉంటాన‌నే ఆలోచ‌న‌తోనే నేను సినిమా చేయ‌న‌ని అన్నాను. కానీ శ్రీరాఘ‌వ ద‌గ్గ‌ర నుంచి ఆఫ‌ర్ వ‌స్తే చేయ‌న‌ని అంటావా? అని అన‌డంతో మ‌ర‌లా ప‌రిశీలించి ఒప్పుకున్నాను.

* శ్రీరాఘ‌వ వ‌ర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది?
- త‌ను నాకు టీచ‌ర్‌లాంటివాడు. క‌నురెప్ప‌లు ఎక్కువ‌గా వాల్చినా ఇంకో షాట్ తీస్తాడాయ‌న‌. అలాగే చాలా సెటిల్డ్ గా న‌టించాలి. ఐబ్రో ని కాస్త పైకి లేపినా ఒప్పుకోడు.. అందుకే నేను ప్ర‌తి షాటూ చేయ‌డానికి ముందు మీరు నా పాత్ర ఈ స‌మ‌యంలో ఎలా బిహేవ్ చేస్తుంద‌ని రాస్తే అలాగే చేస్తాను. వివ‌రించండి అని అడిగేదాన్ని. ఆయ‌న చెప్పిన‌దాన్ని బ‌ట్టే న‌టించాను.

* ఈ సినిమా తొలి రోజు గుర్తుందా?
- ఈ సినిమా ఆడిష‌న్ కోసం చెన్నైకి రాత్రి 10.30కి వెళ్ళా. 11.30కి ఆడిషన్స్ స్టార్ట్ అయ్యాయి. రాత్రి 1 గంట‌కు సెల్వ గారి ద‌గ్గ‌ర‌కి అసిస్టెంట్స్ వెళ్ళారు. ఆయ‌న ఓకే అని చెప్ప‌డంతో కిందికి వ‌చ్చి చెప్పారు. ఆ రోజును మాత్రం మ‌ర్చిపోలేను. భ‌లే మంచి రోజు క‌న్నా ముందు నేను చేసిన సినిమా ఇది. నా న‌ట‌న‌కు చాలా మంచి అప్లాజ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర‌హా సినిమాల‌ను చేయాల‌ని ఉంది.

* ఈ సినిమాను చెన్నైలో థియేట‌ర్ల‌లో చూశారా?
- ఓ రోజు నా ఫ్యామిలీతో వెళ్లాను. అదే రోజు మా కెమెరామేన్‌, మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అంద‌రూ ఫ్యామిలీస్‌తో వ‌చ్చారు. నేను థియేట‌ర్‌కు వ‌చ్చాన‌ని తెలిసి పై నాలుగు రోల్స్ లో కూర్చున్న వారు లేచి క్లాప్స్ కొడుతూ స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు.

* నిర్మాత గురించి చెప్పండి?
- ఎప్పుడూ చిరున‌వ్వుతో ఉంటారు మా నిర్మాత కోలా భాస్క‌ర్‌గారు.. ఎక్క‌డ ఏ ఇబ్బంది ఉంద‌ని తెలిసినా వెంట‌నే దాన్ని సాల్వ్ చేస్తారు. అంతేగానీ అవాయిడ్ మాత్రం చేయ‌రు. నా తెలుగు ప్రొడ్యూస‌ర్ కూడా అంతే గొప్ప వ్య‌క్తి. సో సౌత్‌లో ఇప్ప‌టికి నేను చేసింది రెండు సినిమాలే అయినా రెండు సినిమాల‌కూ మంచి పేరు వ‌చ్చింది. నిర్మాత‌లు చాలా మంచి వారు.

* హీరో గురించి చెప్పండి?
- బాల‌కృష్ణ కోలా కొత్త వ్య‌క్తి అయినా చాలా బాగా చేశాడు. మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కావ‌డంతో చాలా స‌ర‌దాగా ఉండేవాళ్ళం. ప్ర‌భు అనే పాత్ర‌లో తాను జీవించాడ‌నే చెప్పాలి.

* ఇంకే సినిమాలైనా చేస్తున్నారా?
- మ‌ల‌యాళంలో ఓ సినిమా చేస్తున్నా. రెజ్ల‌ర్‌గా చేస్తున్నా. రెజ్లింగ్ ట్రైనింగ్ తీసుకోబోతున్నా. స్పోర్ట్స్ కామెడీ చిత్ర‌మిది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved