pizza
Yamini Bhaskar interview (Telugu) about Bhale Manchi Chowka Beram
`భ‌లే మంచి చౌక బేర‌మ్‌` స‌క్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - యామినీ భాస్క‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

19 September 2018
Hyderabad

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌'. అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. 'అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌,'పంతం' వంటి చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రాన్ని సమర్పించడం విశేషం. సెప్టెంబర్‌ 20న హీరోయిన్‌ యామినీ భాస్కర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఇంటర్వ్యూలో యామినీ భాస్కర్‌ మాట్లాడుతూ ..

రియల్‌ లైఫ్‌కు దగ్గరగా...
- నా పాత్ర, కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తాను. సినిమా అంతా నా పాత్ర ఉండి ప్రాముఖ్యత లేకపోతే గుర్తింపు రాదు కదా!. ఇక సినిమా విషయానికి వస్తే.. 'భలే మంచి చౌకబేరమ్‌' చిత్రంలో నా పాత్ర పేరు ఆదర్శి. ఎదుటివారు కష్టాల్లో ఉంటే తన దగ్గరున్నది కూడా ఇచ్చేసే మంచి మనసున్న అమ్మాయి పాత్ర నాది. హీరో కూడా నా మంచి మనసుని మోసం చేస్తాడు. రియల్‌ లైఫ్‌లో కూడా నేను అంతే ఎదుటివారు కష్టాల్లో ఉంటే నా వల్లనైనా సాయం అందిస్తాను.

నమ్మకంగా ఉన్నాం...
- నటిగా నా వల్ల ఎంత సపోర్ట్‌ ఇవ్వగలుగుతానో అంతా చేశాను. మా టీమ్‌లో అందరం సినిమా బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది. కాబట్టి టీమ్‌ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. కన్‌ఫ్యూజన్‌ కామెడీతో సినిమా అంతా సాగుతుంది.

డైరెక్టర్‌ మురళీకృష్ణ గురించి..
- డైరెక్టర్‌ మురళీగారు ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబట్టుకున్నారు. సినిమా చిత్రీకరణను అందరం ఎంజాయ్‌ చేశాం. నవీద్‌, పార్వతీశం సినిమాలో నాతో పాటు నటించారు. నవీద్‌ స్నేహితుడి పాత్రలో పార్వతీశం నటించారు. మాతో పాటు రాజా రవీంద్రగారి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.

interview gallery



కొత్త విషయాలు తెలుసుకుంటున్నా...
- నటిగా ప్రతి సినిమాకు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నాను. మనం ఏదైనా సినిమా చేస్తున్నామంటే.. ఎలాంటి సినిమాలు పిక్‌ చేసుకోవాలనే దానిపై ఓ అవగాహన కలిగింది. నటిగా నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

తదుపరి చిత్రాలు..
- ప్రస్తుతం స్క్రిప్ట్స్‌ వింటున్నాను. తమిళంలో ఇది వరకు ఓ సినిమాలో నటించాను. అవకాశాలు వస్తే.. తమిళంలో కూడా నటిస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved