pizza
Nikhil Kumar Is Debuting As Hero With A 75 Crore Big Budgeted Film 'Jaguar'. First Look On July 31st
75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిఖిల్‌కుమార్‌ హీరోగా 'జాగ్వార్‌' జూలై 31న ఫస్ట్‌లుక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 July 2016
Hyderabad

Nikhil Kumar who is Grandson of Former Prime Minister Deve Gouda and Son of former Karnataka Chief Minister H.D Kumara Swamy who also produced several superhit films in Kannada, is debuting as hero with a 75 crore big budgeted film 'Jaguar'. Smt Anita Kumara Swamy is producing thius film under Chennambika Films banner. First Look and Teaser of 'Jaguar' is releasing on July 31st, 11:00 am at Park Hyat, Hyderabad in the presence of several tollywood celebrities.

Vijayendra Prasad who recently gave story for worldwide blockbusters 'Baahubali and 'Bhajrangi Bhaijaan' has provided story for 'Jaguar'. Mahadev who was a disciple of super successful director S.S Rajamouli is directing this film. Mahadev also providing screenplay and dialogues for this film.S.S Thaman who recently completed his 50th film is composing music for this film.Manoj Paramahamsa who is known for his work in big films like 'Race Gurram','Bruce Lee' is providing cinematography for this film. Action sequences in this film will match Hollywood standards. Along with Bulgarian action director Kaloyan, Ravi Varma, Ram-Lakshman, Selva who has composed fights for many Superhit films composed the action part engagingly. Especially the chase and a fight which was shot in Bulgaria spending a bomb will be a major highlight in this film. For all songs, Lyrics has been given by star lyricist Rama Jogayya Sastry who penned Lyrics for films like 'Srimanthudu','Janatha Garage'. Narayana Reddy who worked for many super-hit films is working as Art Director for this film. With top talented technicians and high technical values, H D Kumara Swamy is making this film without any compromise to impress Telugu audience. 'Jaguar' will. Complete it's shooting part with last schedule in Annapurna Studios 7 acres where lavish sets are being erected for this film. Makers are confident that 'Jaguar' will stand as a Sensationl Hit for the year 2016.

Along with lead pair Nikhil Kumar and Deepthi, Prime Star Jagapathi Babu will be seen in a very different role. Ramya Krishna will be seen in a crucial role. Others like Brahmanandam, Raghu Babu, Sampath, Aditya Menon, Supreet, Ravi Kaale will be seen in other important roles.

Story : Vijayendra Prasad, Cinematography : Manoj Paramahamsa, Music : S S Thaman, Art : Narayana Reddy, Lyrics : Rama Jogayya Sastry, Fights : Ravi Varma, Ram-Lakshman,Kaloyan (Bulgaria),Selva, Chief Co-Director : Ammineni Madhava Sai, Presented By : H D Kumara Swamy

Producer : Smt Anitha Kumara Swamy
Screenplay - Dialogues - Direction : A.Mahadev

75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిఖిల్‌కుమార్‌ హీరోగా 'జాగ్వార్‌' జూలై 31న ఫస్ట్‌లుక్‌

75 కోట్ల భారీ బడ్జెట్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న భారీ చిత్రం 'జాగ్వార్‌'. ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని జూలై 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేస్తున్నారు.

'బాహుబలి', 'భజరంగి భాయ్‌జాన్‌' చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ 'జాగ్వార్‌' చిత్రానికి కథ అందించారు. సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. 50కి పైగా చిత్రాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేసిన యస్‌.యస్‌. థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. 'రేసుగుర్రం', 'బ్రూస్‌లీ' వంటి భారీ చిత్రాలకు ఫొటోగ్రఫి చేసిన మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ పొటోగ్రఫిగా వర్క్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని బల్గేరియాకు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ కలోయాన్‌, ఎన్నో హిట్‌ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌చేసిన రవివర్మ, రామ్‌లక్ష్మణ్‌, సెల్వ ఈ చిత్రంలోని ఫైట్స్‌ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా బల్గేరియాలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజ్‌, ఫైట్‌ ఈ చిత్రంలో స్పెషల్‌ హైలైట్స్‌ అవుతాయి. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని ప్రముఖ గేయరచయిత రామజోగయ్యశాస్త్రి రాశారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు వర్క్‌చేసిన నారాయణరెడ్డి కళా దర్శకత్వం వహిస్తున్నారు. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులతో హై టెక్నికల్‌వాల్యూస్‌తో 'జాగ్వార్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా హెచ్‌.డి. కుమారస్వామి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో వేస్తున్న భారీ సెట్స్‌లో జరిగే షెడ్యూల్‌తో నిర్మాణం పూర్తి చేసుకునే 'జాగ్వార్‌' చిత్రం 2016లో వచ్చే సినిమాల్లో ఓ సెన్సేషన్‌ హిట్‌గా నిలుస్తుంది.

నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌, ఆదిత్యమీనన్‌, సుప్రీత్‌, రవికాలే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్‌, ఫొటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, సంగీతం: యస్‌.యస్‌. థమన్‌, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రవి వర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌, (బల్గేరియా), సెల్వ, చీఫ్‌ కో-డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి,
సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎ.మహదేవ్‌.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved