pizza
మే 14న అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ ఆడియో
You are at idlebrain.com > news today >
Follow Us

08 May 2015
Hyderabad

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై  రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్ బాండ్’. .   ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్.  సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 14న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. 
సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ప్ర‌తి పాట డిప‌రెంట్ గా ఉంటుంది.పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది.సాయి కార్తీక్ అద్భుతైమన సంగీతాన్నందించారు. ఈ చిత్ర ఆడియో మే 14న విడుదల చేస్తున్నాం. సినిమాని కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ. 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved