pizza
NTR - Koratala Siva - Janatha Garage Shoot from Feb 22nd
ఫిబ్రవరి 22న ఎన్టీఆర్ - కొరటాల శివ ల జనతా గారేజ్ షూటింగ్ ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

21 February 2016
Hyderaba
d

Young Tiger NTR and acclaimed director Koratala Siva have teamed up for a new project titled 'Janatha Garage' and this film is being produced by the prestigious Mythri Movies banner. The film was formally launched on October 25th last year.

Regular shooting will commence from February 22nd in Ramoji Film City. After that,shooting will move to a specially erected set. Art Director A.S. Prakash has created a fantastic set that is causing awe among visitors.

NTR is fresh from the blockbuster success of 'Nannaku Prematho' and he is going to be seen in this film with a new look. Samantha and Nithya Menen will be seen as the heroines in this movie and legendary Malayalee actor Mohan Lal will be seen in an important role. Koratala Shiva is going ahead with a big cast for this film.

Well known actors like Sai Kumar, Unni Mukundhan, Brahmaji, Benarjee, Ajay, Sitara, Devayani, Gunaji etc. will be seen in this movie.

Director Koratala Siva has made a mark for himself with blockbusters like 'Mirchi' and 'Srimanthudu'. He is extremely confident about this new project. "I have known NTR garu since Brindavanam days and he is a wonderful person. This is a very stylish and emotional action entertainer that will give NTR the kind of subject he deserves. He is a brilliant actor who can handle a range of emotions and this script will do justice to his talent. We are aiming for a grand worldwide release on August 12th", he said.

Speaking at the launch, producers Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan (C.V.M.) expressed their happiness. "We are delighted to produce this film with a brilliant actor like NTR and our director Koratala Siva has come up with a superb script. This is our second project with him after Srimanthudu and this shows how happy we are with his work. This film will be a milestone in NTR's career and we are going for a release on August 12th", they said.

Crew Details :

Writing - Direction - Koratala Siva
Producers : Naveen Yerneni, Mohan (CVM), Y. Ravi Shankar
Executive Producer : Chandrasekhar Ravipati
Music - Devi Sri Prasad
Editing - Kotagiri Venkateswara Rao
Fights : Anal Arasu
Cameraman - Thiru
Art - A.S. Prakash


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో 'జనతా గారేజ్' అనే ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం గత ఏడాది October 25 న హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో, చిత్ర బృందం నడుమ జరిగింది. 'నాన్నకు ప్రేమతో' చిత్రం తో భారి బ్లాక్బస్టర్ ను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సరికొత్త లుక్ తో ఈ చిత్రం లో కనిపించనున్నారు.

ఫిబ్రవరి 22 న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో లాంచనం గా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ఈ చిత్రం కోసం ప్రత్యేకం గా నిర్మించిన భారీ సెట్ లో షూటింగ్ కొనసాగుతుంది.

ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్, గుణాజీ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ : "యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా ఆయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను. ఫిబ్రవరి 22న షూటింగ్ ను ప్రారంభించి, ఆగష్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం", అని తెలిపారు

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ : "మా బ్యానర్ లో రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా బ్యానర్ లో మొదటి చిత్రం అయిన 'శ్రీమంతుడు' ని బ్లాక్బస్టర్ గా తీర్చిదిద్దిన మా డైరెక్టర్ కొరటాల శివ గారితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషం గా ఉంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తాం. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. హైదరాబాద్ , చెన్నై, ముంబై మరియు కేరళ లో షూటింగ్ జరుగుతుంది. భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు" అని తెలిపారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved