pizza
Jathagaa audio soon
త్వరలో ఆడియో
డిసెంబర్ ద్వితీయార్ధంలో సురేశ్ కొండేటి 'జతగా...'విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

29 November 2015
Hyderabad

ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రాలను అందిస్తుంటారు సురేశ్ కొండేటి. ఆయన విడుదల చేసే చిత్రాలన్నీ కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి. అందుకే సురేశ్ కొండేటి ఓ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటే మంచి కథాంశంతో సాగే యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని చూడొచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తారు. ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా, రేణి గుంట, మహేష్, డా. సలీమ్... ఇలా ఇప్పటివరకూ పదకొండు విజయవంతమైన చిత్రాలు అందించిన సురేశ్ ఇప్పుడు 'జతగా..' అనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.

మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన 'ఉస్తాద్ హోటల్'ని 'జతగా...' పేరుతో తెలుగులోకి అనువదించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - "లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. అర్థవంతమైన చిత్రం.ఇటీవల విడుదలైన 'ఓకే బంగారం'లో దుల్కర్, నిత్యా మీనన్ జోడీ చేసిన మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'జతగా' లో ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగా కుదిరింది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన 'జర్నీ', 'పిజ్జా', 'డా. సలీమ్' చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు 'జతగా...'కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రం ఇది. త్వరలో పాటలను, డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం '' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved