pizza
Jawaan gets U/A, film release on 1 December
సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్‌1న U/A స‌ర్టిఫికెట్ తో
సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్ " గ్రాండ్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

23 November 2017
Hyderabad

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హించిన చిత్రం జ‌వాన్‌- ఇంటికొక్క‌డు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఈరోజు 9 గంట‌ల‌కి ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. రొమాంటిక్ కామెడిగా స్టార్ట‌యిన ఈ ట్రైల‌ర్ హై టెక్నాల‌జి తో దేశ‌భ‌క్తిని మేళ‌వించిన ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అంద‌రి ప్ర‌శంశ‌లు పొందుతుంది. ప్ర‌త్య‌ఖంగా ట్రైల‌ర్ లొ హీరో సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించారు. అలాగే త‌మిళ ఆర్టిస్ట్ ప్ర‌స‌న్న పాత్ర కూడా చాలా అందంగా డిజైన్ చేశారు ద‌ర్శ‌కుడు. డిసెంబ‌ర్ 1న విడ‌ద‌ల కానున్న జ‌వాన్ చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని U/A స‌ర్టిఫికెట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకానుంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ ఇప్పటివరకు చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తయితే… జవాన్ లో చేసిన క్యారెక్టర్ మరో ఎత్తు. ట్రైల‌ర్ లో తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్ గా కనిపిస్తోంది. అలాగే ఆడియో కూడా చార్ట్‌బ‌స్ట‌ర్ లో నెం1 గా వుండ‌టం, సోష‌ల్‌మీడియాలో ట్రెండింగ్ కావ‌టం విశేషం.

ద‌ర్శ‌కుడు బివియ‌స్ ర‌వి మాట్లాడుతూ... ఎన్నిసార్లు చెప్పినా మ‌రోక్క‌సారి చెప్ప‌టానికి నెను గ‌ర్వ‌ప‌డుతున్నాను. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు అవ‌స‌రం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఒదిగిపోయి న‌టించాడు. తన కుటుంబాన్ని, అదేవిధంగా దేశాన్ని మ‌నోదైర్యంతో, బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాము. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. బెసిక్ గా ఇద్ద‌రూ ఈక్వ‌ల్ ఏజ్ గ్రూప్ వున్న‌వాళ్ల‌ని సెల‌క్ట్ చేశాము. సినిమాలో ప్ర‌తి సీన్ కి థ‌మ‌న్ సూప‌ర్బ్ రీ-రికార్డింగ్ ఇచ్చాడు. ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా ఓ రేంజి లో వుంటే థ‌మ‌న్ ఆర్ ఆర్ త‌రువాత రేంజి డ‌బుల్ అయ్యింది. అలాగే ఈరోజు సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌ది. డిసెంబ‌ర్ 1న U/A స‌ర్టిఫికెట్ తో విత్ అవుట్ క‌ట్స్ తో గ్రాండ్ గా అత్య‌ధిక దియోటర్స్ లో విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా మెగా అభిమానుల్ని, అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుంటుంది.. అని అన్నారు

నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు
కెమెరా మెన్ - కెవి గుహన్
మ్యూజిక్ - ఎస్‌. తమన్
ఆర్ట్ - బ్రహ్మ కడలి
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, మ‌ధు
సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి
పి.ఆర్‌.ఓ - ఏలూరు శ్రీను
బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్
సమర్పణ - దిల్ రాజు
నిర్మాత - కృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved