pizza
Ganta Ravi, Jayanth C.Paranji's 'Jayadev' In Slovenia
స్లొవేనియా వెళ్తున్న గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల 'జయదేవ్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

26 April 2017
Hyderabad

Andhra Pradesh's minister Ganta Srinivasa Rao's Son Ganta Ravi is being introduced as Hero with 'Jayadev' in Decent Director Jayanth C.Paranji's Direction, Produced by Popular Producer K.Ashok Kumar in his Sri Lakshmi Venkateswara Art Creations banner. Film is shooting on a brisk pace and is being readied to release in the last week of May month.

'Jayadev' Teaser On April 27th
Producer Ashok Kumar says, "After 'Premante Idera','Eeshwar' with Jayanth, As a third film in our combination we are introducing AP Minister Ganta Srinivasa Rao's Son Ganta Ravi as Hero with a Powerful, Purposeful Action Entertainer, 'Jayadev'. We shot this film lavishly in various locations. We are releasing the Teaser on April 27th evening at 4:25 pm. First song will be released on April 30th. Two songs will be picturised from April 30th to May 8th in Slovenia. With this the entire shooting part will be completed. We are planning to release the film in last week of May."

Director Jayanth C.Paranji says, "This film is being made with all kinds of elements which will be loved by all sections of audience. This is a story about a sincere police officer. We designed the character of 'Jayadev' with the inspiration of many honest and brave police officer's who sacrificed their lives and families in their line of duty. There are 10 powerful action episodes in the film which will thrill the audience. These action episodes related to story will be the main highlight of the film. Under Ashok Kumar's banner, we introduced Prabhas as Hero with 'Eeshwar'. I am very happy to introduce Ganta Ravi as Hero under the same banner in my Direction."

Ganta Ravi, Malavika will be seen as Hero and Heroine. Other principle cast involves Vinod Kumar, Paruchuri Venkateswara Rao, Posani, Vennela Kishore, Hari Teja, Shravan, Supreet, Komati Jayaram, Rajeswari, Shiva Reddy, Kadambari Kiran, Bittiri Satthi, Karuna, Meena, Jyothi, Ravi Prakash, Aravind

Music : Mani Sharma, Cinematography : Jawahar Reddy, Original Story : Arun Kumar, Written By : Paruchuri Brothers, Editing : Marthand K Venkatesh, Fights : Venkat, Art : Krishna Maya, Stills : Narayana, Co-Director : Prabhakar Nag, Production Controller : P.Ram Mohan Rao, Producer : K.Ashok Kumar, Direction : Jayanth C Paranji

స్లొవేనియా వెళ్తున్న గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల 'జయదేవ్‌'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత కె.అశోక్‌కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఏప్రిల్‌ 27న 'జయదేవ్‌' టీజర్‌

నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''జయంత్‌ దర్శకత్వంలో ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌ తర్వాత మూడో చిత్రంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'జయదేవ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. వివిధ లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ భారీ లెవ్‌ల్‌లో చేశాం. ఏప్రిల్‌ 27 సాయంత్రం గం 4.25లకు 'జయదేవ్‌' టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ 30న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈచిత్రంలో వున్నాయి. ఇది ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved