pizza
Kabali fight masters for Sundeep Kishan film
"క‌బాలి" ఫైట్ మాస్ట‌ర్స్ డైర‌క్ష‌న్ లో సందీప్ కిషన్ యాక్ష‌న్
You are at idlebrain.com > news today >
Follow Us

5 February 2017
Hyderabad

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో యూత్ ని ఆక‌ట్టుకున్న‌ మెహరీన్ హీరోయిన్ గా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై స్వామిరారా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ తోపాటు, హీరోహీరోయిన్లపై ఒక పాటను కూడా వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్నికాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం "నా పేరు శివ" ఫేమ్ సుసీంథరన్ దర్శకత్వం చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రానికి క‌బాలి చిత్రంలో యాక్ష‌న్ తో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన అంబు, అరివు లు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తున్నారు. "గజరాజు"," జిల్లా", "రైల్" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన త‌మిళ సంగీత ద‌ర్శ‌క‌డు డి.ఇమ్మాన్ ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ సందర్భంగా సహ-నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. "నా పేరు శివ చిత్రంతో ద‌ర్శ‌కుడి గా చాలా మంచి పేరు సంపాయించిన ద‌ర్శ‌కుడు సుసీంథ‌ర‌న్‌ దర్శకత్వంలో "నా పేరు శివ" తరహాలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా అదే స్థాయి కథ-కథనాలతో రూపొందుతుంది. దర్శకులు సుసీంధరన్ అద్భుతమైన కథను రెడీ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్ష‌న్ పార్ట్ ని క‌బాలి చిత్రానికి ప‌నిచేసిన అంబు, అరియు లు చేస్తున్నారు. ఈ చిత్రంలో మా హీరో సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నారు. సందీప్ త‌ప్ప‌కుండా కొత్త కేర‌క్ట‌రైజేష‌న్ తో అంద‌రిని ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌స్తుతం వైజాగ్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్ లో సందీప్-మెహరీన్ లపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ సారధ్యంలో ఒక పాట తోపాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. 30 రోజులపాటు వైజాగ్ లో జరగనున్న ఈ భారీ షెడ్యూల్ కోసం ఒక సెట్ కూడా వేశారు, ఆ సెట్ లోనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. హీరోహీరోయిన్లతోపాటు సత్య, ప్రవీణ్, ధనరాజ్ లు కూడా పాల్గొననున్న ఈ షెడ్యూల్ లోనే అంబు, అరియు నేతృత్వంలో రెండు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన డి.ఇమ్మాన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్, ఎడిటర్: ఎం.యు.కాశీవిశ్వనాధం, పాటలు: రామజోగయ్య శాస్త్రి-శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.సి, సహ-నిర్మాత: రాజేష్ దండా, సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంధరన్!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved