pizza
హీరో శివాజీకి తన సంఘీభావాన్ని తెలియజేసిన కాదంబరి కిరణ్ కుమార్
You are at idlebrain.com > news today >
Follow Us

05 May 2015
Hyderabad

ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన శివాజీ ప్రస్తుతం బిజెపి పార్టీ కార్యకర్తగా ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేకహోదా హమీ నేరవేర్చలేదని కొన్నిరోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శివాజీకి పలు రాజకీయ, సామాజిక సంస్థల మధ్ధుతు వస్తుంది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాదంబరి కిరణ్ కుమార్ హీరో శివాజీకి తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘’హీరో శివాజీ తెలుగు చిత్రాల్లో తన నటన ద్వారా అలరించారు. ప్రస్తుతం రాజకీయపార్టీ కార్యకర్తగా తన హక్కు ప్రశ్నిస్తూ నిరాహారదీక్ష చేస్తున్నారు. అతనికి నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను’’ అన్నారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved