pizza
Kalyani Malik, Sirasri about Lakshmi's NTR
`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది - క‌ల్యాణి మాలిక్‌, సిరాశ్రీ
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2019
Hyderabad

ల‌క్ష్మీ పార్వ‌తి కోణం నుంచి రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సినిమా గురించి క‌ల్యాణి మాలిక్‌, సిరాశ్రీ శ‌నివారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

క‌ల్యాణి మాలిక్ మాట్లాడుతూ ``సిరాశ్రీగారి ద్వారా నాకు ఈ అవ‌కాశం వ‌చ్చింది. రామ్‌గోపాల్ వ‌ర్మ‌గారితో నాకు ఇంత‌కు ముందు ప‌రిచయం లేదు. ఈ సినిమాతోనే ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 11 పాట‌లు చేశాను. రీరికార్డింగ్‌కు కూడా స్పెష‌ల్ అప్రిషియేష‌న్ వ‌స్తోంది. `శంక‌రాభ‌ర‌ణం`, `మేఘ‌సందేశం` త‌ర‌హా పాట‌లు కావాల‌ని వ‌ర్మ‌గారు సిరాశ్రీగారితో అడిగార‌ట‌. వెంట‌నే ఆయ‌న నా పేరు స‌జెస్ట్ చేయ‌డంతో న‌న్ను పిలిపించారు. నేనుటీడీపీకి పెద్ద అభిమానిని. అయినా ఈ సినిమాకు సంగీతం చేశాను. ఓ క‌ళాకారుడిగా నా బాధ్య‌త నిర్వ‌ర్తించాను. 15 ఏళ్ల కెరీర్ నాది. ఇప్ప‌టికి 16 సినిమాలు చేశాను. మా అన్న‌య్య కీర‌వాణిగారితో నన్ను పోల్చ‌కూడ‌దు. ఆయ‌నకు చాలా విష‌యాలు తెలుసు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేసే సినిమాల‌కు నేను సౌండ్ సూప‌ర్‌వైజ్ చేస్తుంటాను. ఆర్ ఆర్ ఆర్ ఇంకా నా వ‌ర‌కు రాలేదు. సంగీతంలో నా పంథా వేరు. నాకు వ‌చ్చిన సినిమాల‌ను జాగ్ర‌త్త‌గా చేసుకుంటూ వెళ్తాను. నేను చేసే కృషి నా ప్ర‌తి పాట‌లోనూ క‌నిపిస్తుంది. ఫ్యామిలీకి ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించే మ‌న‌స్తత్వం నాది. సంపుల్ లైఫ్‌ని గడ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. ఈ సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌ల కాలేద‌న్న బాధ ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల కావాల‌ని కోరుకుంటున్నా. రీరికార్డింగ్‌లో సౌండ్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కొంద‌రు అన్నార‌ని తెలిసింది. సౌండ్ అనేది ఆయా థియేట‌ర్‌ను బ‌ట్టి ఉంటుంది. మేం ఒక థియేటర్లో కూర్చుని సౌండ్ డిజైన్ చేస్తాం. కానీ అన్ని చోట్లా అదే క్వాలిటీ రావాల‌నేం లేదు`` అని అన్నారు.

సిరాశ్రీ మాట్లాడుతూ ``ఒక‌సారి నేను, వ‌ర్మ‌గారు కూర్చుని మాట్లాడుతున్న‌ప్పుడు ఆయ‌న `మేఘ‌సందేశం`, `శంక‌రాభ‌ర‌ణం` త‌ర‌హా పాట‌లు కావాల‌ని అడిగారు. వెంట‌నే క‌ల్యాణి మాలిక్‌గారు చేసిన `ఏం సందేహం లేదు.. `అనే పాట‌ను వినిపించాను. వెంట‌నే ఆయ‌న క‌ల్యాణి మాలిక్‌గారిని పిలిపించి మాట్లాడారు. ఇందులో 11 పాట‌లున్నాయి. ఎన్టీఆర్‌గారు స్టెప్పు వేసే సీన్ చెప్పిన‌ప్పుడు ముందు మేం కూడా `ఎందుకు` అని అనుకున్నాం. కానీ సినిమాల్లో ఎన్నెన్నో స్టెప్పులేసిన ఆయ‌న ప్రైవేటుగా ఒక స్టెప్పు వేస్తే త‌ప్పేముంద‌ని వ‌ర్మ చెప్పిన రీజ‌న్ నాకు న‌చ్చింది. నా దృష్టిలో వ‌ర్మ ఒక మ‌నిషి కాదు. ఆయ‌న ఒక ఈవెంట్‌. ఈవెంట్‌ని అలా చూస్తూ ఉంటామంతే. ఆయ‌న‌తో నేను ప‌దేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా. 50 పాట‌ల‌కు పైగా రాశా. మిగిలిన సినిమాల‌కు ఇంకో 100 పాట‌లు రాశా. ఇప్పుడు కూడా ఆర్ ఎక్స్ 100 డైర‌క్ట‌ర్ సినిమాకు, ఆయ‌న అసిస్టెంట్ సినిమాకు, వ‌ర్మ‌గారి సినిమాల‌కు పాట‌లు రాస్తున్నా`` అని చెప్పారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved