pizza
Kamal Kamaraju interview (Telugu) Kutumba Katha Chitram
కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌జేస్తుంది - క‌మ‌ల్ కామ‌రాజు
You are at idlebrain.com > news today >
Follow Us

11 December 2017
Hyderabad

`ఆవ‌కాయ్ బిర్యాని`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు క‌మ‌ల్ కామ‌రాజు. ఆ త‌ర్వాత `క‌ల‌వ‌ర‌మాయె మ‌దిలో`తో పాటు ప‌లు సినిమాల్లో న‌టించారు. `కాట‌మ‌రాయుడు`, `అర్జున్ రెడ్డి` సినిమాల‌లో బ్ర‌ద‌ర్‌గానూ న‌టించారు. తాజాగా ఆయ‌న వాచ్‌మేన్‌గా న‌టించిన `కుటుంబ‌క‌థా చిత్ర‌మ్` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ఆయ‌న హైద‌రాబాద్‌లో సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `కుటుంబ క‌థా చిత్ర‌మ్‌` అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- `కాట‌మ‌రాయుడు`, `అర్జున్ రెడ్డి` సినిమాల తర్వాత వచ్చిన అవ‌కాశ‌మిది. ద‌ర్శ‌కుడు క‌థ చెబుతానంటే స‌రేన‌న్నా. ఆయ‌న్ని చూస్తే నాకు తొలుత ఎలాంటి ఫీలింగూ లేదు. ఎలా చెప్తాడో అని అనుకున్నా. చాలా బాగా చెప్పాడు. ఆ త‌ర్వాత ఇంగ్లిష్ సినిమాల‌న్నా చూశాడోలేడో అనుకున్నా. చూడ‌లేద‌ని చెప్పాడు. సినిమా ఎలా తీస్తాడోన‌నే భ‌యం ఉండేది. కానీ చాలా బాగా తీశాడు.

* సినిమా షూటింగ్ ఎలా జ‌రిగింది?
- గండిపేట ద‌గ్గ‌ర ఓ హౌస్‌లో జ‌రిగింది. ఆ హౌస్‌కి సాయంత్రం చేరుకునేవాళ్లం. రాత్రి రెండు గంట‌ల వ‌ర‌కు అక్క‌డ షూటింగ్ చేసేవాళ్లం. అక్క‌డి నుంచి ఎవ‌రి ఇళ్ల‌కు వాళ్లం వెళ్లేవాళ్లం. సినిమా అంతా పూర్త‌యిన త‌ర్వాత ఒక‌సారి నిర్మాత‌లు సినిమా చూసుకున్నారు. వాళ్ల‌కు కాస్త కాన్ఫిడెన్స్ రావ‌డంతో మాకు చూపించారు. సినిమా నిజంగా చాలా బాగా వ‌చ్చింది.

* నందు, శ్రీముఖి, మీరు.. మీలో ఎవ‌రు నెగ‌టివ్ పాత్ర చేశారు?
- అది చిన్న స‌స్పెన్స్ అండీ. సినిమా చూస్తేనే తెలుస్తుంది. సినిమాను చాలా వ‌ర‌కు సింగిల్ టేక్‌లో చేయాల‌ని మా ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించారు. నందు, శ్రీముఖి మ‌ధ్య వ‌చ్చే కొన్ని సీన్ల‌ను వాళ్లు నిజంగానే ఒకే ఫ్లోలో చేశారు. వాళ్ల మ‌ధ్య వ‌చ్చే గొడ‌వ‌ల స‌న్నివేశాల‌ను చూస్తుంటే నిజంగా మ‌న ఇళ్ల‌ల్లో జ‌రిగిన‌ట్టు అనిపిస్తుంది.

* ఇంకా సినిమాలో హైలైట్స్ ఏమి ఉంటాయి?
- క్లైమాక్స్ లో ఓ పాప స‌న్నివేశం ఉంటుంది. డ‌బ్బుల కోసం ప‌రుగులు తీస్తూ పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోవ‌డానికి తీరిక లేని త‌ల్లిదండ్రుల గురించి ప్ర‌స్తావన ఉంటుంది. అవ‌న్నీ చూస్తున్నంత సేపు చాలా మ‌న‌సుకు ట‌చింగ్‌గా అనిపిస్తాయి.

* అస‌లు హీరోగా కొన‌సాగుతున్న మీరు కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎలా ట‌ర్న్ అయ్యారు?
- ఇది గ‌మ్మ‌త్తైన అంశం అండీ. ఎందుకంటే నాకు అర్జున్‌రెడ్డి సినిమా స్క్రిప్ట్ ను సందీప్ చెప్పాల‌నుకున్నాడు. అందుకు రాజ్‌కందుకూరి నాకు ఫోన్ చేశారు. చాలా మంది జుట్టు అటూ ఇటూ తోసుకుంటూ వ‌స్తున్నారు.. అయినా అలాంటి క‌థ‌ల్లో నేను చేయ‌ను అని ముందు నెగ్ల‌క్ట్ చేసిన మాట వాస్త‌వ‌మే. కానీ సందీప్ ప‌ట్టుబ‌ట్టి నాకు అవ‌కాశం ఇచ్చాడు. మా అమ్మావాళ్లు కూడా ముందు ఏదో ఒక పాత్ర చేయి. ఆ త‌ర్వాత జ‌నాల్లోకి వెళ్తే వాళ్లే నిన్ను అక్కున చేర్చుకుంటారు అని చెప్పారు. స‌రేన‌ని ఒప్పుకున్నా. కాట‌మ‌రాయుడు, అర్జున్ రెడ్డి విడుద‌ల‌య్యాక ఇప్పుడు సినిమాల ఫ్లో పెరిగింది.

* ఇంకేం సినిమాలు చేస్తున్నారు?
- విజ‌య‌వాడ బేస్డ్ ప్రేమ క‌థ ఒక‌టి చేస్తున్నా. విజ‌య‌వాడ‌లో షూటింగ్ చేయ‌డం ఇదే నేను తొలిసారి. ఆ త‌ర్వాత మ‌రో ఇంట్ర‌స్టింగ్ ప్రాజెక్ట్ చేస్తాను. అది అర్బ‌న్ బేస్డ్ స్టోరీ.

* నిర్భ‌య కేసు జ‌రిగిన‌ప్పుడు చెప్పులు లేకుండా తిరిగారు క‌దా?
- అవునండీ. అప్పుడు నాకు చాలా అస‌హనంగా అనిపించింది. అందుకే అలాంటివారి మీద కోపంతో, విసుగుతో ఆరు నెల‌లు అలా తిరిగాను. ఒక‌రోజు త్రివిక్ర‌మ్‌గారితోనూ దానిగురించి డిస్క‌ష‌న్ చేశాను.

* మీరు ఆర్కిటెక్ట్ కూడా క‌దా..?
- చాలా బిల్డింగ్‌ల‌కు నేనే ఆర్కిటెక్ట్ చేశాను. నో వాస్తు అనేది నా కాన్సెప్ట్. చాలా ప‌క్క‌గా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved