pizza
Raghava Lawrence’s ‘Kanchana-3’ will hit the screens on 19th of April worldwide
ఏప్రిల్ 19 న ప్ర‌పంచ‌వాప్తంగా విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్ మాసివ్ పెర్ఫార్మెన్స్ "కాంచ‌న‌-3"
You are at idlebrain.com > news today >
Follow Us

16 March 2019
Hyderabad

After bagging huge successes with Muni, Kanchana, Kanchana-2 choreographer turned director Raghava Lawrence now coming with one more horror comedy film that is "Kanchana-3". This will be the special project for Raghava Lawrence despite all his previous movies are super hits at the box-office. The shoot is almost wrapped up and makers are planning to release the film in Telugu and Tamil languages.

Raghava Lawrence takes special care in each and everything when it comes to film making. The motion picture which released a few days back grabbed the attention. Everyone from a common movie lover to film critique impressed with the idea of motion picture. It was the first time a motion picture got released along with Dolby Atmos audio.

Light House Movie Makers and Raghavendhra Productions Banner is bankrolling this project and B.Madhu will present the film while Raghava is investing in the project.

While speaking Lawrence the director and protagonist of the film said “ We worked very hard for this film. Story-Screenplay and graphics will mesmerize everyone. This ‘Kanchana-3’ will be released on 19th of April this year worldwide. This is the fourth film in this series. We shoot for almost 220 days for this film and executed every detail so perfectly. We are planning to cut the trailer to beat the response of Motion picture. My getup got a lot of accolades from the critics and I am very happy about that. We are planning to release this movie as a summer gift to all movie lovers. We strongly believe that ‘Kanchana-3’ will be a whole new level of horror-comedy experience you will taste this year.”

Cast: Raghava Lawrence, Oviya, Vedhika, KoVy Sarala, Kabhir Dhuhan Singh, Sriman, DevaDarshini, Sathyaraj, Kishore and others.

Cinematography: Vetri, Sarvesh Murari

PRO: Eluru Srinu

Production: Light House Movie Makers, LLP Banner, Raghavendhra Productions.

Presenter: B. Madhu

Story-Screenplay-Direction: Raghava Lawrence

ఏప్రిల్ 19 న ప్ర‌పంచ‌వాప్తంగా విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్ మాసివ్ పెర్ఫార్మెన్స్ "కాంచ‌న‌-3"

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, తన స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రాఘ‌వ లారెన్స్ ఏం చేసినా స్పెష‌ల్ గా, సెన్సేషన్ గా ఉంటుంది. ఇటీవలె కాంచ‌న‌-3 కోసం విడుదల చేసిన మొదటి లుక్ మోషన్ పోస్టర్ ఒక మాసివ్ వేవ్ ని తీసుకొచ్చింది.. అటు సినీ ప్రేక్షకులు నుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మోషన్ పోస్టర్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టర్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులొ మొట్టమెద‌టి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో ఈ మోషన్ పోస్టర్ ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేయనున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. ఇప్పటికే రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2019 కి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవనుందని టెక్నిషన్స్ నుండి వస్తున్న సమాచారం తో ట్రేడ్ లో మోస్ట్ క్రేజి ఫిల్మ్ గా అంచనాలు పెరిగాయి.. అతి త్వరలో వచ్చే ట్రైలర్ ఈ అంచనాలు థ్రిబుల్ చేయనుందని యూనిట్ అంటున్నారు.. అంతేకాదు అంచనాల్ని మించి ఈ చిత్రం ఏప్రిల్ 19 న సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

ఈ సంద‌ర్బంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.... కాంచన 3 చిత్రం నా కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మంచిన కథా బలంతో వస్తున్నాం. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశాం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఆ రెస్పాన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ను లావిష్ గా కట్ చేస్తున్నాం. త్వరలో రిలీజ్ చేయనున్న ఆ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరతాయిని ధీమాగా చెబుతున్నాం. తమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో నా గెటప్ కు చాలా మంచి పేరొచ్చింది. నా లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాం. ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగులో బి.మధు గారు విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫి- వెట్రి, స‌ర్వేష్ మురారి,
మ్యూజిక్ - తమన్
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం - రాఘ‌వ లారెన్స్‌Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved