pizza
Kapatadhaari on 19 Feb
ఫిబ్ర‌వ‌రి 19న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సుమంత్‌, క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ చిత్రం `క‌ప‌ట‌ధారి`
You are at idlebrain.com > news today >
 
Follow Us

05 February -2021
Hyderabad




సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌`క‌ప‌ట‌ధారి`. `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాత డా.ధ‌నంజ‌యన్ మాట్లాడుతూ ``కొత్త క‌థాంశాలతో రూపొందే చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆద‌రిస్తారో అంద‌రికీ తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే క‌ప‌ట‌ధారి నిర్మించాం. సుమంత్‌గారు త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సంప‌త్ రాజ్, జ‌య‌ప్ర‌కాశ్‌, నందిత అందరి పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌ప‌ట‌ధారి సినిమాను రూపొందించాం. చాలా ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న భారీగా విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

న‌టీన‌టులు:

సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

 

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాత‌: డా.జి.ధ‌నంజ‌య‌న్‌
యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌
మ్యూజిక్‌: సైమ‌న్ కె.కింగ్‌
ఆర్ట్‌: విదేశ్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
మాట‌లు: బాషా శ్రీ
స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌: డా.జి.ధ‌నంజ‌య‌న్‌
క‌థ‌: హేమంత్ ఎం.రావు
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

 

 

 

 

 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved