pizza
Karthi interview (Telugu) about Khakee
తెలుగు ప్రేక్షకులు ఆ నమ్మకాన్నిచ్చారు - కార్తి
You are at idlebrain.com > news today >
Follow Us

13 November 2017
Hyderabad

యంగ్‌ హీరో కార్తీ, గ్లామర్‌ స్టార్‌ రకుల్‌ప్రీత్‌ హీరోయిన్‌గా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వినోద్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ తమిళంలో నిర్మించిన 'ధీరం అధికారం ఒండ్రు'. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌పై ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మాత‌లుగా `ఖాకి` పేరుతో సినిమా తెలుగులో న‌వంబ‌ర్‌ఱ 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో కార్తీ ఇంట‌ర్వ్యూ...

పోలీస్ ఆఫీసర్ జర్నీ..
సాధారణంగా మనం న్యూస్ పేపర్‌లో వార్తలు చదివేటప్పుడు ఓ దొంగతనమో, హత్య గురించి వార్త చదువుతాం. తర్వాత పేజీలోకి వెళ్లి పోతామే కానీ, మనం చదివిన వార్త వెనుక ఏం జరిగి ఉంటుందని ఆలోచించం. క్రైమ్ వెనుక ఏం జరిగిందని ఎవరూ రీసెర్చ్ చేయరు. ఈ సినిమా అలాంటి ఓ రీసెర్చ్‌పై సాగుతుంది. సాధారణంగా ఓ క్రైమ్‌లో నిందితుడుని గుర్తించడమే కష్టం. అటువంటిది పదేళ్ల క్రితం ఎటువంటి సాక్ష్యాలు లేని ఓ నేరంలో నిందితులను తమిళనాడు పోలీసులు ఆంధ్ర, రాజస్థాన్ పోలీసుల సహాయంతో ఎలా పట్టుకున్నారనేదే కథ. ఓ పోలీస్ అతని టీం చేసిన జర్నీని ఈ సినిమాలో చూస్తాం. సినిమాల్లో పోలీసులు ఎమైనా చేసేస్తుంటారు. వారికి ఎటువంటి రూల్స్ ఉండవు. కానీ నిజ జీవితంలో పోలీసులకు ఆడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా సవుస్యలుంటాయి. ఓ సాధారణ జీతానికి పోలీసులు ఇంత కష్టపడతారా అనిపించింది. మామూలుగా రోజులో మనం ఎనిమిది నుండి పన్నెండు గంటలు వరకు కష్టపడతాం. కానీ నేను చేసిన రీసెర్చ్‌లో పోలీసు అనేవాడు ఇరవై రెండు గంటలు కష్టపడతాడని తెలిసి ఆశ్చర్యపోయాను.

ఐదారేళ్ల క్రితం విన్న కాన్సెప్ట్...
- ఐదారేళ్ల క్రితం.. నేను విక్రమార్కుడు తమిళ వెర్షన్‌లో నటించినప్పుడు ఓ పోలీస్ టీం హెడ్ జహంగీర్‌గారిని కలిశాను. ఆయన దగ్గరుండే డిఎస్‌పి, ఇతర ఆఫీసర్స్ నాకు ఈ సినిమాలోని తెరకెక్కించిన కేసు గురించి చెప్పారు. తర్వాత వినోద్‌గారు ఇదే కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకుని నాదగ్గరకు వచ్చారు. సినిమా క్యారెక్టర్ పరంగా కొత్తగా ఏం చూపించాలనుకోలేదు. ఓ సాధారణైవెున వ్యక్తి పోలీసు బాధ్యతను ఎలా నిర్వరిస్తాడనేదే సినిమాలో చూపించాం. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాటిక్‌గా తెరకెక్కించాం. సినిమాలో పాటలు కూడా కథలో భాగంగానే సాగుతాయి.

రెండేళ్ల రీసెర్చ్..
- ఇసుకలో నుండి లేచి పరిగెత్తే సీన్‌ను నిజంగానే చేశాను. దొంగలను పట్టుకునే సన్నివేశ చిత్రీకరణలో భాగంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాం. ఇదే టీజర్ షాట్ అని దర్శకుడు వినోద్ ముందే చెప్పారు. రాజస్థాన్‌కు వెళ్లిన తొలిరోజు షాట్ చిత్రీకరణ కూడా అదే. దర్శకుడు వినోద్ ఈ కథ కోసం రెండేళ్లు రీసెర్చ్ చేశారు. అంతకు ముందు వినోద్‌గారు ‘చతురంగే వేట్టై’ అనే సినిమా చేశారు.

interview gallery

పూర్తి స్థాయి యాక్షన్ మూవీ..
- ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో ఇది పెద్ద యాక్షన్ మూవీ. ఇలాంటి మూవీ చేసేటప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలి. అందుకని పోలీస్ ఆకాడమీలో నాతో పాటు యూనిట్ కొన్ని రోజులు ట్రయినింగ్ తీసుకున్నాం.

కథల ఎంపికలో...
- సినిమా కథలను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సినిమాను బై లింగువల్‌లో చేయువచ్చా? లేదా? అని ఆలోచించను. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా? అనే ఆలోచిస్తాను. మంచి చిత్రానికి ఎక్కైడెనా ఆదరణ ఉంటుంది. దంగల్ సినిమా విషయానికి వస్తే..ఆ సినిమాను ఎంతో మంది ఇష్టపడి చూశారు. మంచి సినిమాలను ఆదరిస్తామని నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా కలిగించారు. అందుకనే నేను డిఫరెంట్ సినిమాలు చేయుగలుగుతున్నాను.

అదే పెద్ద ఛాలెంజ్..
- ‘చెలియా’ సినిమా చేసేటప్పుడు మణిగారు నాతో ‘ఓ కొత్త లవ్‌స్టోరీ చేస్తున్నాను. నాకు కార్తి వద్దు..విసి అనే ఆఫీసర్ కావాలి’ అన్నారు. నా స్వభావానికి విరుద్ధంగా ఉండే పాత్రను ‘చెలియా’ సినిమాలో చేశాను. అలాంటి పాత్రను మణిగారి దర్శకత్వంలో చేయడం పెద్ద ఛాలెంజ్. అయితే సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. ఓటమిని మనం స్వీకరించాలి. ఎందుకంటే ఓటవునేది లేకపోతే జీవితం లేదు. మన తప్పుల నుండి కొత్త విషయాలు నేర్చుకోవాలి.

తదుపరి చిత్రాలు..
- పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాను. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఓ లవ్‌స్టోరీ చేయుబోతున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved