pizza
Kathakali release on 18 March
మార్చి 18న విశాల్‌ 'కథకళి'
You are at idlebrain.com > news today >
Follow Us

03 March 2016
Hyderaba
d

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన మాస్‌ హీరో విశాల్‌ తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'కథకళి' చిత్రంతో రాబోతున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన సెన్సేషనల్‌ మూవీ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీకృష్ణ క్రియేషన్స్‌ సమర్పణలో 'కథకళి' చిత్రాన్ని మార్చి 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ క్రియేషన్స్‌ అధినేత గౌరీకృష్ణ మాట్లాడుతూ - ''విశాల్‌ హీరోగా రూపొందిన 'కథకళి' తమిళ్‌లో పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకంతో మార్చి 18న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. విశాల్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా రూపొందిన 'కథకళి' తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' అన్నారు.

నిర్మాత, హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''తమిళంలో ఈ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఒక మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ఒక్కరోజులో జరిగే కథ ఇది. మా కథకి టైటిల్‌ యాప్ట్‌. చిల్డ్రన్స్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు తీసిన పాండ్యరాజ్‌ నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌. ఫస్ట్‌టైం అతను ఒక కొత్త జోనర్‌ ఫిలింని రూపొందించారు. కంప్లీట్‌ న్యూ జోనర్‌ ఫిలిం. స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. కథ విన్నపుడే నేను చాలా థ్రిల్‌ ఫీలయ్యాను. కేథరిన్‌ హీరోయిన్‌గా ఫెంటాస్టిక్‌గా చేసింది. మెయిన్‌గా హిప్‌హాప్‌ తమిళ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. మధుసూధన్‌ మెయిన్‌ విలన్‌గా ఎక్స్‌ట్రార్డినరీగా నటించాడు. కాంప్రమైజ్‌ అవకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్‌లో నటించాను. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. శశాంక్‌ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. నా ప్రీవియస్‌ ఫిలింస్‌ కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా 'కథకళి' ఆడియన్స్‌కి ఒక విజువల్‌ ట్రీట్‌ అవుతుంది'' అన్నారు.

హీరోయిన్‌ కేథరిన్‌ మాట్లాడుతూ - ''ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. ఔట్‌ అండ్‌ ఔట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. హిప్‌ హాప్‌ తమిళ మ్యూజిక్‌ బాగా ఎలివేట్‌ అయింది. కెమెరా విజువల్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. తమిళంలో పెద్ద హిట్‌ అయిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్‌హిట్‌ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు పాండ్యరాజ్‌ మాట్లాడుతూ - ''ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. మా ఫ్రెండ్‌ నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఒక మర్డర్‌ జరుగుతుంది. ఆ మర్డర్‌ ఎవరు చేశారనేది? ఆసక్తికరంగా తెరకెక్కించడం జరిగింది. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో సినిమా రన్‌ అవుతూ వుంటుంది. ఈ చిత్రం ఒక కొత్త జోనర్‌లో వుంటుంది. విశాల్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. అలాగే హిప్‌హాప్‌ తమిళ ఎక్స్‌ట్రార్డినరీగా రీరికార్డింగ్‌ చేశారు. హీరోయిన్‌ కేథరిన్‌ గ్లామర్‌, పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. తమిళ్‌లో పెద్ద హిట్‌ అయిన ఈ చిత్రం నాకెంతో పేరు తెచ్చింది. తెలుగులో విశాల్‌కి చాలా మంచి ఫాలోయింగ్‌ వుంది. తెలుగులో కూడా ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.

మాస్‌హీరో విశాల్‌ సరసన కేథరిన్‌ త్రెస జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, కరుణాస్‌, శత్రు, సూరి, శ్రీజిత్‌ రవి, పవన్‌, మైమ్‌ గోపీ, మధుసూదన్‌రావు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం, సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, ఎడిటింగ్‌: ప్రదీప్‌ ఇ.రాఘవ్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, ఫైట్స్‌: అనల్‌ అరసు, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సమర్పణ: శ్రీకృష్ణ క్రియేషన్స్, నిర్మాత: విశాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved