pizza
K Balachander is no more
You are at idlebrain.com > news today >
Follow Us

23 December 2014
Hyderabad

Veteran south Indian filmmaker K Balachander (84) is no more. He has breathed his last tuesday evening (23 December 2014) at Chennai. He has written and directed around 80 films in various south Indian languages (mostly Tamil). His films Maro Charitra and Aakali Rajyam have become classics. He was honored with Government awards like PadmaSri and Dada Saheb Phalke award for his achievements. It was K Balachander who has discovered spark in great actors like Kamal Haasan and Rajinikath and made them stars. He has produced Roja which introduced musical genius AR Rahman. He has won 7 National awards through his films as director and producer. He has won Nandi awards for his Telugu films Tholi Kodi Koosindi, Anthuleni Katha and Kokilamma. May his soul rest in peace!

బాలచందర్ ఇకలేరు

ప్రముఖ దర్శకుడు బాలచందర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన చెన్నై కావేరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. బుధవారం ఆయన పార్థివ దేహానికి చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయనకు 84 ఏళ్లు. 1930, జులై 9న తంజావూరు నన్నిలంలో పుట్టారు. ఒక భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 101కి పైగా సినిమాలు చేసిన ఆయన రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా సుప్రసిద్ధులు. రజనీకాంత్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు బాలచందర్. ఇటీవల సీరియల్స్ కూడా చేశారు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయనకు పేరుంది. కమలహాసన్, ప్రకాష్ రాజ్, రమేష్ అరవింద్, మాధవి, జయసుధ, జయప్రద, శ్రీప్రియ, సరిత, సుజాత, శ్రీవిద్య, విమలారామన్ తో పాటు పలువురు నటీనటులను ఆయన తెరకు పరిచయం చేశారు. మమ్ముటిని కూడా ఆయనే పరిచయం చేశారు. ఆయన కవితాలయ బ్యానర్ పై రూపొందించిన రోజా సినిమాతోనే ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 1973లో కలైమామణి , 1982లో ఏక్ తుజే కేలియో సినిమాతో ఫిల్మ్ ఫేర్ పురస్కారం, 1987లో పద్మశ్రీ, 1989లో రుద్రవీణ సినిమాకు గానూ నర్గీస్ అవార్డుతో పాటు 2010లో దాదా సాహెబ్ అవార్డు, గత రెండేళ్ల క్రితం ఏఎన్నార్ అవార్డుతో పాటు తొమ్మిది సార్లు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్న ఘనత ఆయనది. సింధుభైరవి, ఆకలిరాజ్యం, కొత్త కొత్త అర్థాలు, మరోచరిత్ర, రుద్రవీణ, తొలి కోడి కూసింది, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆడవాళ్లు మీకు జోహారు వంటివి ఆయన సినిమాల్లో కొన్ని. ఇటీవల కమల్ హాసన్ నటించిన ఉత్తమవిలన్ సినిమాలో ఓ పాత్ర పోషించారు బాలచందర్. ఆ సినిమా విడుదల కావాల్సింది ఉంది. జానపదబాణీలకు, జానపద జీవితానికి వెండితెరపై జీవం పోసిన వ్యక్తి బాలచందర్. ఆయన మృతిపట్ల కె.విశ్వనాథ్, రామానాయుడు, జయసుధ, పరుచూరి గోపాలకృష్ణతో పాటు సినీ ప్రముఖులు పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Condolences:

Trivikram: Kb sir redefined South Indian cinema and touched all dark corners of Middle class with dignity and sympathy. The legend lives on. My deepest condolence to his family.

Ram Charan: My deepest condolence to Legendary director sri k.BALACHANDAR GARU family. May his soul rest in peace.

K Raghavendra Rao: బాలచందర్ గారు లేరు అనేది అత్యంత భాధాకరమైన విషయం. భారత చలన చిత్ర పరిశ్రమ కి తీరని లోటు. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి చేకురాలని కోరుకుంటున్నాను.

Allu Arjun: భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో మెట్ట‌మద‌టి వ‌ర‌స‌లో నిలిచే ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్. ఎంద‌రో న‌టీన‌టుల్ని స్టార్స్ ని చేసిన ఘ‌న‌త ఆయ‌నిది. మెగాస్టార్ చిరంజీవి గారితో రుద్ర‌వీణ లాంటి సందేశాత్మ‌క చిత్రం తె్ర‌కెక్కించి ఇప్ప‌టికి అంద‌రి హ్రుద‌యాల్లో చిర‌స్టాయిగా నిలిచిపోయేలా చేసిన ద‌ర్శ‌క పితామ‌హుడు కె.బాల‌చంద‌ర్ మృతి, యావ‌త్ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటని , ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని, తీవ్ర సంతాపాన్ని తెలిపారు అల్లు అర్జున్‌

Maruthi: భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్, ద‌ర్శ‌కుడు పేరుతో సినిమా కి ప్రేక్ష‌కులు రావ‌టం మెద‌లుపెట్టింది ఆయ‌న త‌రం నుంచే.. స్టార్స్ ని న‌మ్ముకోకుండా ఆయ‌నే ఎంద‌రో న‌టీన‌టుల్ని స్టార్స్ ని చేసిన ఘ‌న‌త ఆయ‌నిది. ఏన్నో చిత్రాలు ఆణిముత్యాలు గా తీర్చిదిద్దిన బాల‌చంద‌ర్ గారి సినిమాలు మా ద‌ర్శ‌కుల కులానికి ఓ లైబ్ర‌రి గా నిలిచిపోతాయి. ఆక‌లిరాజ్యం చిత్రం నాకు చాలా ఇష్ట‌మైన చిత్రం. ఆయ‌న శ‌రీరానికి మ‌ర‌ణం వుందేమో గాని ఆయ‌న‌కి కాదు. ఆయ‌న చిత్రాల ద్వారా ఎప్పుడూ అంద‌రి హ్రుద‌యాల్లో చిర‌కాలం బ్ర‌తికేవుంటారు .. శారీర‌కంగా ఈలోకాన్ని వ‌దిలి వెల్లిన ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. అని అన్నారు ద‌ర్శ‌కుడు మారుతి

:


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved