
                          03 June
                            Hyderabad
                          
                           
                          తలసాని ట్రస్ట్ ఆద్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించిన తలసాని సాయి కిరణ్ ,ఇకముందు కూడా ఇలానే కార్మికులను ఆదుకుంటామన్నారు .హైదరాబాదు ఫిలిం చాంబర్ లో ఏర్పాటు  ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, అభిషేక్ నామా పాల్గొన్నారుముందుగా సి కల్యాణ్ మాట్లాడుతూ.. తలసాని గారితో 30ఏళ్ల అనుబంధం.. రాజకీయంగా తలసాని గారు  ఎదిగిన మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది సినీ కార్మికులకు అండంగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు.
                          
                            సినీ పరిశ్రమకు అండంగా తలసాని గారిలా మరెవరు లేరు.సిఎం కేసిఆర్ కూడా మా పరిస్దుతులను అర్దం చెసుకున్నారు.అతి త్వరలొనె  చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారన్నారు
                            
                            ఆ తర్వాత నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ
                            తలసాని శ్రీనివాస్ గారు మా నిర్మాతలకు ఎంతో అండంగా ఉన్నారు  తలసాని సాయి గారు తమ ట్రస్ట్ ద్వారా కార్మికులను ఆదుకున్నారు  వారిద్దరికి ధన్యవాదాలన్నారు
                            
                            అనంతరం తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణా ను సాధించటం తో పాటు, రాష్టాన్ని అభివృద్ధి పదంలో కేసిఆర్ గారు నడిపిస్తున్నారు.అలాగే సినీ పరిశ్రమ విషయంలో కూడా కేసిఆర్ గారు ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ ప్రతి సినిమాను తొలిరోజు చూస్తారు. ఈరోజు చిరంజీవి, నాగార్జున ,మిగతా అసోషియేషన్స్ అంతా కలిసి లీడ్ తీసుకుని చిత్రీకరణ విషయంలో సమావేశాలు ఏర్పాటు చెశారు. అలాగే సిసిసి ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటున్నామన్నారు.