pizza
Kedi Billa Kiladi Ranga in dubbing work
You are at idlebrain.com > news today >
Follow Us

24 October 2015
Hyderabad

‘కేడి బిల్లా - కిలాడి రంగా’ డబ్బింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం!!

ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్‌ (పసంగ ఫేం) దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మల్స్పల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రంలో విమల్‌, శివకార్తికేయన్‌ హీరోలు కాగా.. రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు. యువన్‌ శంకర్‌రాజా సంగీత సారధ్యం వహించారు. విజయదశమి పర్వదినాన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ డబ్బింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘తమిళంలో సంచన విజయాలతో దూసుకుపోతున్న పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఆడియో విడుద చేసి, నవంబర్‌ చివరివారంలో లేదా.. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, మ్యూజిక్‌ అండ్‌ సౌండ్‌ సూపర్‌విజన్‌: శేషు కె.యం.ఆర్‌, మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.సత్యనారాయణ, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: తుమ్మపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: పాండిరాజ్‌!!

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved