pizza
Keechaka Villain Intro promo release
You are at idlebrain.com > news today >
Follow Us

09 September 2015
Hyderabad

ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గులైన సైకో లలో ఒకడైన అక్కు యాదవ్ జీవిత గాధ ఆధారం గా నిర్మించ బడిన చిత్రం కీచక. అతని జీవితం అతనిలాంటి వాళ్లందరికీ ఒక గుణపాఠం గా మిగలాలి అన్న ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని నిర్మించామని ఫిల్మ్ మేకర్స్ తెలియజేశారు. అయితే అంతటి దుర్మార్గుడి కథ ను తెరకు ఎక్కిస్తున్న సందర్భం లో కొన్ని చోట్ల హార్ష్ గా, మరికొన్ని చోట్ల వయోలెంట్ గా ఉండక తప్పలేదని వారు అన్నారు.

సెన్సార్ నుండి ఎడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం నిజానికి Grown Ups Only అని అభివర్ణించారు. ఈ చిత్రం కొంతమందిని అప్సెట్ చేస్తుంది. ఇంకొంత మందిని ఆలోచింపజేస్తుంది. మహిళలను వేధించే వారికి ఇదొక హెచ్చరిక లా తోస్తుంది.బాధితులకు ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అని మేకర్స్ చెప్పారు.

గత ఏడాది ఆస్కార్ పోటీకి ఎంపికయిన మిణుగురులు చిత్ర కథా రచయిత NVB చౌదరి కీచక చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే తో బాటు దర్శకత్వం వహించారు. శ్రీ గౌతమీ టాకీస్ పతాకంపై పర్వత రెడ్డి కిషోర్ కుమార్ నిర్మించిన కీచక చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భం లో 'కీచక- ఒక రాక్షసుడి పరి​​చయం' అనే ప్రోమో ను విడుదల చేశారు

తమిళం లో అసురన్ గా విడుదల:
విడుదలకు ముందే కాంట్రవర్షియల్ చిత్రం గా గుర్తింపు పొందిన కీచక చిత్రాన్ని తమిళం లోకి అనువదిస్తున్నారు. పెద్దోడు- చిన్నోడు, ఆదిత్య 369 వంటి చిత్రాలు అందించిన శ్రీదేవి మూవీస్ సంస్థ పార్ట్నర్, సీనియర్ నిర్మాత MV రావు, రచయిత వెన్నెలకంటి కీచక చిత్ర అనువాద హక్కులు పొంది ' అసురన్' అనే పేరుతో తమిళంలో రిలీజ్ చేయనున్నారు. చెన్నైలో డబ్బింగ్ వర్క్ జరుగుతోంది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved