pizza
పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'కేటుగాడు'
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2015
Hyderabad

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బలసాని నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా తాను 'కేటుగాడు' చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించడంలో తనకు నిర్మాత వెంకటేష్ పూర్తి సహాయ సహకారాలు అందించారని ఆయన ప్రశంసించారు. వచ్చే నెల మొదటివారంలో ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసి ...నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ముఖ్య నటీనట వర్గం: సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు, సత్య తదితరులు

సాంకేతిక వర్గం: మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి, భాషాశ్రీ, పాటలు: శ్రీమణి,కాసర్ల శ్యామ్‌,భాషాశ్రీ, బాలాజీ బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం, సంపత్‌కుమార్‌.ఎ, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టూ నల్లూరి


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved