pizza
Khakee opens to unanimous positive response
హౌస్ ఫుల్స్ తో `ఖాకి` హంగామా
You are at idlebrain.com > news today >
Follow Us

18 November 2017
Hyderabad

Karthi's 'Khakee' has opened to unanimous positive response all over on day 1 and the film has been declared a super hit. The film has been running to packed houses and with the positive word of mouth, the film is expected to do great business at the box-office.

Karthi's stunning performance as a sincere cop in this riveting cop drama has won huge applause. Rakul Preet's screen presence and her chemistry with Karthi is also being talked about. Director H Vinoth has been praised by everyone for such a tight script and fabulous presentation. It is being said as one of the best films this year. This is the first production of Aditya Music Pvt. Ltd and the producers are set to make huge profits as the film has been going very strong at the box-office.

హౌస్ ఫుల్స్ తో `ఖాకి` హంగామా

ఇప్పుడు సినిమా ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ చూసినా `ఖాకి` మాట‌లే. విడుద‌లైన మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది `ఖాకి`. సినిమా గురించి ఉన్న‌దున్న‌ట్టుగా చెబుతూ చిత్ర టీమ్ చేసిన ప్ర‌మోష‌న్‌తో మార్నింగ్ షోకి థియేట‌ర్లు కిట‌కిట‌లాడాయి. ముందు నుంచీ తాము విన్న‌దే సినిమాలోనూ క‌నిపించేస‌రికి సినీ ప్రియుల్లో ఆనందం మొద‌లైంది. మౌత్‌టాక్    వ‌ల్ల సినిమామీద ఇంకా క్రేజ్ పెరిగింది. స‌ర్వ‌త్రా థియేట‌ర్ల‌న్నీ జ‌నాల‌తో కిక్కిరిసిపోతున్నాయి.

ఇప్ప‌టిదాకా ర‌క‌ర‌కాల పాత్ర‌ల్లో తెలుగువారిని మెప్పించిన కార్తి కాప్‌గా న‌టించిన చిత్ర‌మిది. త‌న‌కున్న ఒత్తిళ్లు, ఫ్యామిలీ టెన్ష‌న్స్ మ‌ధ్య క‌ర్కోట‌కంగా ప్ర‌వ‌ర్తించిన నేర‌గాళ్ల చ‌రిత్ర‌ను ఓ నిజాయ‌తీగ‌ల పోలీస్ అధికారి, అత‌ని టీమ్ ఎలా బ‌య‌ట‌పెట్టింద‌నే కాన్సెప్ట్ తో తెర‌కెక్కింది. సినిమా ఆద్యంతం రేసీ సీక్వెన్స్ తో మెప్పించింది. ఫ‌స్టాఫ్‌లో కార్తి, ర‌కుల్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. పెళ్లైన కొత్త‌లో జ‌రిగిన విష‌యాలు దంప‌తుల‌కు మ‌రోసారి గుర్తుచేసేలా ఉంటాయి. ప‌క్కింట‌మ్మాయిని,  ఎదురింటి అమ్మాయిని ప్రేమించిన వారు, ప్రేమ‌లో ఉన్న‌వారు కార్తి, ర‌కుల్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌కు మ‌రింత‌గా క‌నెక్ట్ అవుతారు. జిబ్రాన్ చేసిన ట్యూన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ల‌స్ అవుతున్నాయి. కార్తి న‌ట‌న‌,  హెచ్‌.వినోద్ అల్లుకున్న ఇంటెన్స్ సీక్వెన్స్ లు థ్రిల్ క‌లిగిస్తున్నాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ కు మాస్ ఫిదా అవుతున్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved