pizza

Full Kicku song from Khiladi is full of energy
‘ఫుల్ కిక్కో..’ అంటూ రవితేజ మాస్ బీట్

You are at idlebrain.com > news today >
Follow Us

26 January 2022
Hyderabad

‘‘నీ లిప్పోలోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు
ఓ నిప్పులాగ న‌న్ను తాకి పెంచ‌ను ప‌ల్సు
అది వంటిలోన చేసిన‌ల్ల‌రి నీకేం తెలుసు
ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో...’’

అని డింపుల్ హ‌యతిని ఉద్దేశించి పాడేస్తున్నారు మాస్ మ‌హరాజా ర‌వితేజ‌. అస‌లు వాళ్లిద్ద‌రి కిస్సు గొడ‌వేందో తెలియాలంటే ‘ఖిలాడి’ సినిమా చూసేయాల్సిందేనండోయ్ . మాస్ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి హీరోయిన్స్‌గా న‌టించారు.

బుధవారం (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ‘ఖిలాడి’ మూవీ నుంచి ఓ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి మ‌ధ్య చిత్రీక‌రించారు. ప‌క్కా మాస్ బీట్‌తో సాంగ్ ఎన‌ర్జిటిక్‌గా ఉంది.

పాట ప్రారంభానికి ముందు ర‌వితేజ‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మ‌ధ్య సాగే చిన్న‌పాటి స‌ర‌దా సంభాష‌ణ.. అక్క‌డ నుంచి పాట‌లోకి ఎంట్రీ ఇచ్చిన తీరు అంతా చ‌క్క‌గా ఉన్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ‘ఖిలాడి’ మూవీలోని ఈ పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా, సాగ‌ర్‌- మ‌మ‌తా శ‌ర్మ ఆల‌పించారు. శేఖ‌ర్ వీజీ నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. సుజిత్ వాసుదేవ్‌, జి.కె.విష్ణు సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

జ‌యంతి లాల్ గ‌డ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌పై ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తోన్న ఈచిత్రానికి ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved