pizza
Killing Veerappan - Ram Gopal Varma press note
కిల్లింగ్ వీరప్పన్ మీద రాంగోపాల్ వర్మ ప్రెస్ నోట్ 
You are at idlebrain.com > news today >
Follow Us

26 December 2015
Hyderaba
d

వీరప్పన్ సబ్జెక్ట్ నాకు ఎప్పటినుండో చాలా ఆసక్తికరంగా వుండేది. 12 ఏళ్ళ క్రితం నేను “Lets catch Veerappan” అనే సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. అందులో ముగ్గురు వ్యక్తులు వీరప్పన్ పైన ఉన్న రివార్డ్ మనీ కోసం అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. ఆ మూవీ ని షిమిత్ అమీన్ “Chakde India” సినిమా దర్శకుడు డైరెక్ట్ చేయాల్సింది.

కానీ మేము షూటింగ్ ప్రారంభించముందే వీరప్పన్ చంపబడ్డాడు. చనిపోయిన వ్యక్తిని వెతికి పట్టుకోవటం అనే పాయింట్ మీద సినిమా తీయటం అర్ధం లేదని ఆపేశా.

తరువాత వీరప్పన్ జీవిత చరిత్ర మీద సినిమా తీయాలనే ఆలోచన కూడా ఉండేది. కానీ అప్పటికే వీరప్పన్ జీవితానికి సంబధించిన విషయాలన్నీ బుక్స్ ద్వారా, డాక్యుమెంట్రిస్ ద్వారా జనాలకి తెలిశాయి. అందువల్ల ఆ ఆలోచనని కూడా పక్కన పెట్టాను.

సంవత్సరం క్రితం Mr.Senthamarai Kannan అనే ఒక పోలిస్ ఆఫీసర్ గురించి విన్నాను. తను వీరప్పన్ ఇంటలిజెన్స్ ఆపరేషన్కి హెడ్. మీడియాలో ఇతని గురించి అప్పటి టాస్క్ ఫోర్స్ హెడ్ అయిన Mr.Vijaykumar కూడా చాలా గొప్పగా పొగిడారు. అప్పటివరకు కన్నన్ కన్న ముందొచ్చిన పోలిసులందరూ వీరప్పన్ని అడవిలోపల వేటాడి పట్టుకోవాలనుకున్నారు. కానీ కన్నన్ మాత్రం అతన్ని అడవి నుండి బయటకు రప్పించాలనుకున్నాడు. ఆ ఆపరేషన్ అసలు ఎలా జరిగిందో అన్న మొత్తం డీటెయిల్స్ నేను చాలా మంది దగ్గరనుంచి విన్న తరువాత నా ఉత్సాహానికి అవధులు లేవు.

అప్పుడే ఈ డీటెయిల్స్ దేశంలోని ప్రతి ఒక్కరికి తెలియాలని నేను అనుకున్నా. ఎందుకంటే వీరప్పన్ చాప్టర్ భారతదేశపు నేర చరిత్రలోనే అన్నింటికన్నా ముఖ్యమైన ఘట్టం.

శివరాజ్ ఇందులో మెయిన్ కాప్ రోల్ చేస్తున్నాడు. ఇతను వీరప్పన్ చనిపోవటానికి వేసిన ప్లాన్ లో ముఖ్య పాత్ర పోషించాడు. నేను శివరాజ్ కుమార్ నే ఈ పాత్రకి తీసుకోవటానికి గల కారణం నాకు ఆ వయసున్న, ఆ లుక్కున్న అలాగే పెర్ఫార్మెన్స్ ఇవ్వగల వ్యక్తి కావాలి. అంతేకాకుండా వీరప్పన్ కిడ్నాప్ చేసిన “రాజ్ కుమార్” కొడుకు ఇతను అవడంతో మొత్తం కాస్టింగ్ వాల్యునే పెరిగింది ఎందుకంటే రియల్ లైఫ్ విలన్ ని రీల్ లైఫ్ హీరో చంపుతాడు.

శివరాజ్ కుmar మొదట అందరికీ తెలిసిన కథని ఎందుకు చేయాలని అన్నారు...తరువాత నేను ఆ కథని ఎలా చెప్పాలనుకుంటున్నానో అన్న విషయాన్ని వివరించిన తరువాత అందులోని కొత్తదనానికి తను చాలా ఇంప్రెస్ అయ్యాడు.

శివరాజ్ కి వున్న స్టార్ ఇమేజ్, అభిమానుల వల్ల ఇటువంటి పూర్తి విభిన్నమైన క్యారెక్టరైజేషన్ని ఒప్పుకుంటాడా అన్న సందేహం నాకుండేది. కానీ, శివరాజ్ కుమార్ వెంటనే ఒప్పుకున్నాడు. ఇందులో అతను చేసిన పెర్ఫార్మెన్స్ కి చాలా ఇంప్రెస్స్ అయ్యాను. అలాగే తన క్యారెక్టర్ ని తను పాడిన హయ్య, హయ్య పాటలో కూడా కాప్చర్ చెయ్యడం నాకు చాలా బాగా నచ్చింది.

అందరూ అనుకున్నట్టు సందీప్ కి, వీరప్పన్ కి నిజజీవితంలో ఎటువంటి పోలికలు వుండవు. ఈ క్రెడిట్ మాత్రం మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ ది. తను సందీప్ ని పూర్తిగా వీరప్పన్ లాగా మార్చేశాడు. అలాగే సందీప్ గొప్ప నటుడు. తను ఫిజికల్ గానే కాకుండా, మెంటల్ గా ఈ పాత్ర లో ఒదిగిపోవటానికి ప్రిపేర్ అయినందుకు తనకు కూడా ఈ క్రెడిట్ లో చాలా భాగముంది. ఆల్రెడీ ఈ సినిమా చూసిన చాలా మంది సినిమా రిలీస్ అయ్యాక అసలు వీరప్పన్ని మరిచిపోయి సందీప్ నే గుర్తు పెట్టుకుంటారని చెప్పారు.

కిల్లింగ్ వీరప్పన్ మూవీలో పారుల్ యాదవ్ చేసిన క్యారెక్టర్ నిజజీవితంలో పోలీసులు వీరప్పన్ని పట్టుకోవటానికి సాధారణ జనంనుంచి ఎంచుకున్న ఒక అమ్మాయి పాత్రే. మామూలుగా పోలీసులు బయట వ్యక్తులని ఇలాంటి వాటికి ఎంచుకోరు. కానీ కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి ఇలాంటి వారిని ఎంచుకుంటారు. భద్రత కారణాలవల్ల నిజజీవితంలోని ఆ అమ్మాయి పేరు బయటపెట్టదలుచుకోలేదు. పారుల్ యాదవ్ కూడా తన పాత్రకు అన్ని విధాల nyayam chesindhi

నిజజీవితంలో వీరప్పన్ భార్య అయిన ముత్తులక్ష్మి క్యారెక్టర్ ని యజ్ఞ శెట్టి చేస్తుంది. నేను ముత్తులక్ష్మిని కలిసినప్పుడు ఆమె పోలీసులు వీరప్పన్ని పట్టుకోవటానికి చేసిన ఆపరేషన్స్ గురించి, ఇంకా వీరప్పన్ తో తనకున్న పర్సనల్ రిలేషన్ విషయాలు మరియు నేర చరిత్ర గురించి కూడా చెప్పింది. అలాగే యజ్ఞా కి, ముత్తులక్ష్మికి దగ్గర పోలికలు ఉండడంతో ఆ క్యారెక్టర్ బాగా పండింది. నాకు తెలిసినంతవరకు ఒక సినిమా లో విలన్ కి లవ్ స్టొరీ వుండి హీరోకి లేకపోవటం ఇదే మొదటిసారి.

వీరప్పన్ తన సొంత కూతురుని చంపే సీన్లో పాప ఏడ్చే సౌండ్ ని తీసేయమన్నారు. అందువల్ల మేము ఆ సౌండ్ ని మాత్రం మ్యూట్ చేశాం. అంతేగాని మిగతా సినిమా లో పెద్దగా కట్స్ చెప్పలేదు చిన్న చిన్నవి తప్ప.

ఇంతకు ముందు వీరప్పన్ మీద వచ్చిన సినిమాల మీద ఆమె వ్యక్తపరచిన అభ్యంతరాలు గురించి నాకు తెలియదు. మా సినిమా విషయంలో మాత్రం ముత్తులక్ష్మి కి అడవిని మరియు దానిలో వుండే జంతువులను కొంతమంది అవినీతి గవర్నమెంట్ అధికారుల్ని నుండి కాపాడే తన భర్తైన వీరప్పన్ని మేము నెగటివ్ యాంగిల్లో చూపిస్తున్నామని ఆమె ఉద్దేశం. అంతే కాకుండా అలా వీరప్పన్ని నెగటివ్ యాంగిల్ చూపటం వల్ల కన్నడ మరియు తమిళ ప్రజల మధ్య గొడవలొచ్చే అవకాశం ఉందని ఇంకా సెన్సార్ బోర్డ్ కూడా మేము (నేను, శివరాజ్) చెప్పినట్టు చేస్తుందని ఆమె అభ్యంతరం. ఏదైతేనేం చివరిగా ఆమెతో మేము కోర్ట్ బయటే మాట్లాడి ప్రాబ్లెం సాల్వ్ చేసుకున్నాం.

ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగిన నిజజీవిత కథలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేక రూపాల్లో, అనేక కోణాల్లో వేరు వేరు ఆధారాల నుండి వస్తుంది. వీరప్పన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన కర్ణాటక, తమిళనాడు పోలీసులు, వీరప్పన్ మాజీ అనుచరులు మరియు బంధువులు ఇంకా పేర్లు చెప్పలేని కొంతమంది వ్యక్తుల నుండి నేను సేకరించిన విస్తృత సమాచారంతో ఈ సినిమా తీయటం జరిగింది. అందువల్ల నేను ఏదైతే ఈ సినిమాలో చూపించానో అది నిజం. కానీ భద్రత కారణాల దృష్ట్యా వాటి కాల సమయాలు, పాత్రల పేర్లు మరియు ప్రదేశస్థానాలు మార్చడం జరిగింది. నేను సినిమాలో అసలు ఆఫీసర్ ఎవరు, ఆ ఆఫీసర్ ఎక్కడి వాడు మరియు ఇదంతా ఎప్పుడు జరిగిందనేది చెప్పలేదు ఎందుకంటే నా చిత్రంతో నిర్దిష్టమైన వ్యక్తుల గురించి చెప్తున్నాను కానీ అవసరం లేని వివరాల

నాకు తెలిసి ఈ సినిమా చూసే వాళ్ళలో 3 రకాల ప్రేక్షకులు వుంటారు.
1.వీరప్పన్ గురించి కొంచెం కూడా తెలియని వాళ్ళు.
2.వీరప్పన్ గురించి కొంచెం తెలుసు. కానీ వివరంగా తెలియదు.
3.వీరప్పన్ గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు.

మొదటి గ్రూప్ వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి వాళ్ళకి ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే వీరప్పన్ లాంటి వాడు ఆసియా నేర చరిత్రలో వేరే వాడు లేడు. అంతకన్నా ఎక్కువ శివరాజ్ చేసిన పోలిస్ క్యారెక్టర్ కూడా ఎవరూ ఎక్కడా చూసి వుండరు.

రెండవ గ్రూప్ వాళ్ళకి వీరప్పన్ గురించి కొంతే తెలుసు కాబట్టి, విషయాల్ని ఇంకా డీటెయిల్ గా చూడడంతో ఎక్సైట్ గా ఫీల్ అవుతారు.

ఇక మూడవ గ్రూప్ వాళ్ళకి ఇప్పటి దాకా వాళ్ళు నిజం అనుకున్న దానికి మూవీ లో చూసిన దానికి తేడా ఉంటుంది..ఎందుకంటే నాకు తెలిసిన నిజం వేరు కాబట్టి. కానీ వాళ్ళు కూడా "killing Veerappan"వీరప్పన్ సినిమా చూసిన తర్వాత ఇంత డీటెయిల్ గా ఎవరు చూపించలేదు అని చెప్తారు.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved