pizza
Kishore as menacing George in 'PSV Garuda Vega'
`పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M`లో “జార్జ్”గా కిషోర్
You are at idlebrain.com > news today >
Follow Us

19 May 2017
Hyderabad

Dr. Rajasekhar, the versatile actor who acquired the image of an angry young man through such films as 'Ankusham', 'Magadu' and 'Aagraham', is one of the most loved all-round actors in the history of Telugu cinema. His action entertainer with director Praveen Sattaru is titled 'PSV Garuda Vega 126.18M'. The film is produced by M Koteswara Raju on Jyostar Enterprises and presented by Shivani Shivathmika Movies.

After roping in Sunny Leone for a special song, the makers have revealed something interesting about Kishore's character in the movie. Named George, he is evil-personified in this stylish entertainer. Devious, deceptive and deadly, George is physically imperfect, but mentally sharp. None can outsmart him, come what may.

He can’t be reasoned with and sure as hell, he can’t be threatened with anything. A perfect kill machine with no empathy, an avaricious predator and, finally, the ultimate, unapologetic villain. Kishore has earlier played defining characters in such films as 'Kabali' and 'Cheekati Rajyam'. In 'Garuda Vega', his character will be on a par with that of greatest on-screen villains like Mr. India's Mogambo and Sholay's Gabbar Singh.

Moreover, the director of the critically-acclaimed 'Chandamama Kathalu' and the adult comedy 'Guntur Talkies' is out to unveil a stylish and suave Rajasekhar in this flick.

Pooja Kumar is the female lead. Sunny Leone, Arun Adith, Shraddha Das, Ali, Nasser, Prudhvi, Ravi Varma, Charan Deep, Sayaji Shinde, Posani Krishna Murali and others are part of the cast.

Music is by Sri Charan. Cinematography is by Anji. Art direction is by Srikanth. It's produced by Koteswara Raju.

`పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M`లో “జార్జ్”గా కిషోర్

యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M``. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో కిషోర్ అత్యంత బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు జార్జ్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు.

త‌న కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ముఖ్యంగా కబాలి,చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్‌కు ఈ జార్జ్ పాత్ర మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. కిషోర్ జార్జ్ పాత్ర గురించి చెప్పాలంటే..జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం... శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధి తో డ్డి కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు,భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు... జాలి,దయ,ప్రేమ,కరుణ అతని డిక్షనరీల నే లేవు అనేలా జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది.

డా.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజ‌న్‌, షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్‌, జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved