pizza
K. J. Yesudas Sings for Manalo Okadu
'మనలో ఒకడు` కోసం కె.జె.ఏసుదాస్ గానం
You are at idlebrain.com > news today >
Follow Us

20 August 2016
Hyderaba
d

ఆర్పీ ప‌ట్నాయ‌క్ అన‌గానే శ్రావ్య‌మైన సంగీతం, మ‌న‌సును తాకే న‌ట‌న, మెప్పించ‌గ‌లిగిన ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ వ‌రుస‌బెట్టి గుర్తుకొస్తాయి. ఈ బహుముఖ ప్ర‌జ్ఞాశాలి తాజాగా తెర‌కెక్కిస్తున్న సినిమా `మ‌న‌లో ఒక‌డు`. ఆయ‌న న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, సంగీత సార‌థ్యం చేసిన చిత్ర‌మిది. `మ‌న‌లో ఒక‌డు` కోసం ఆర్పీ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీని ఇటీవ‌ల కె.జె.ఏసుదాస్ ఆల‌పించ‌డం విశేషం. ఈ చిత్రంలోని పాట‌ల్ని ఈ నెల 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించిన ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``కె.జె.ఏసుదాస్ అనే పేరు విన‌గానే గంధ‌ర్వ‌గానం గుర్తుకొస్తుంది. కొంత విరామం త‌ర్వాత ఆ గాన‌గాంధ‌ర్వుడు తెలుగులో పాడిన పాట మా సినిమా కోసం కావ‌డం ఆనందంగా ఉంది. వ‌న‌మాలి రాసిన `క‌లి క‌లి క‌లికాలం` పాట‌ను ఏసుదాస్‌గారు ఆల‌పించారు. త‌ప్ప‌కుండా శ్రోత‌ల‌ను అల‌రిస్తుంది. మ‌రో పాట‌ను చైత‌న్య‌ప్ర‌సాద్ రాయ‌గా సునీత పాడారు. శ్రావ‌ణ భార్గ‌వి గానం చేసిన పెప్పీ నెంబ‌ర్‌ను పుల‌గం చిన్నారాయ‌ణ రాశారు. ప్ర‌స్తుత ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు ఈ ఆల్బ‌మ్ కుదిరింది`` అని అన్నారు
.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ - ''కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ కథ ఇది. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ గారు దర్శకత్వం వహించిన 'బ్రోకర్' ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాన్ని మించే విధంగా ఉంటుంది. కె.జె.ఏసుదాస్‌గారు, సునీత‌గారు, శ్రావ‌ణ భార్గ‌విగారు పాట‌ల‌ను చాలా బాగా పాడారు. ఈ నెల 27న ఆడియో విడుద‌ల చేస్తాం'' అని చెప్పారు.

సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, శ్రీముఖి, రఘుబాబు, బెనర్జి, గొల్లపూడి మారుతీరావు, రాజా రవీంద్ర, 'జెమిని' సురేశ్, దువ్వాసి మోహన్, సందేశ్, గిరిధర్, వరుణ్, గుండు సుదర్శన్, కృష్ణవేణి, 'జబర్దస్త్' రాకేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.జె. సిధ్ధార్ధ్, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: కృష్ణ, మాటలు: తిరుమల్ నాగ్, పాట‌లు: చైత‌న్య‌ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌, స‌హనిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత: జి.సి. జగన్ మోహన్, కథ-స్ర్కీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ఆర్.పి. పట్నాయక్.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved