pizza
KK Radhamohan interview about Khaidi
కార్తి 'ఖైదీ' ఈ దీపావళికి కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది - శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 October, 2019
Hyderabad

Karthi's 'Khaidi' Emerged As Cult Blockbuster For This Diwali - KK Radha Mohan, Sri Sathya Sai Arts

Angry Hero Karthi starrer Different ACtion Thriller 'Khaidi' Directed by Lokesh Kanagaraj, Produced by SR Prakash Babu, SR Prabhu, Thiruppur Vivek under DreamWarrior Pictures banner released worldwide on October 25th. Sri Sathya Sai Arts KK Radha Mohan has presented 'Khaidi' in Telugu states. The film is running with superb collections all-over with a terrific response from the audience. On this occasion, KK Radha Mohan interacted with media at Prasad Labs, Hyderabad.

Sri Sathya Sai Arts KK Radha Mohan said, " The audiences have received our 'Khaidi' very well which is released on the auspicious occasion of Diwali. Thanks to Karthi for accepting and doing such a different film and also to Producers Prakash Babu, Prabhu, Vivek for giving me this opportunity to release the film in Telugu states. I am elated as the film has not only received good ratings but also getting superb mouth talk. 'Khaidi' is the gift the audiences have given to our banner after 'Bengal Tiger'. Director Lokesh Kanagaraj must be appreciated for his efforts for engaging the audience for 2 hours 20 mins with his arresting narration even without songs and heroine. This is his second film. His first film 'Nagaram' also runs in the night backdrop. It became a very good hit. Though the entire film runs in a span of four hours in a night, He managed to maintain the curiosity among the audiences right from the start to the end. 'Khaidi' got rave reviews. Collections have improved further today. I am receiving congratulatory calls from our distributors. 'Khaidi' is a cult blockbuster given to us by the audience for this Diwali.

How do you feel when you first listened to the story?
- Coming to the story I know that the story will take place in a span of four hours in a night. This is a dark night film but, the Hero and producers are very confident about the film. Lokesh's first movie 'Nagaram' scored a good success and his next film is with Hero Vijay. These indicate that the director is immensely talented and the film will surely workout bigtime. The audience also showing interest in a new kind of films. They are accepting films with new content. Keeping all these things in mind, I released the film in both Telugu states.

How do you feel after watching the film?
- I watched the film yesterday evening at RK Cineplex. The film has a very simple thread but out director handled it perfectly. The film is even 20 % better than what we expected. Audiences are enjoying by clapping and whistling even in multiplexes. Telugu dubbing which is in perfect sync also became a plus point for this film.

What is Karthi's reaction after the release of the film?
- During the pre-release event, Karthi garu confidently said that 'Films like this should be within 2 hours of run-time but this film which has a duration of 2 hours 20 minutes will thrill the audience'. His words became true after the film's release. He shared his happiness during his facebook interaction with the audience today.

How is the response to the film in Tamil Nadu?
- The film has a very good response in Tamil too. The audience are completely enjoying the film. The film became a huge success there.

Is there going to be any sequel to 'Khaidi'?
- Recently when I asked Karthi garu about the same, he said that they will decide after seeing the result of the film. A few moments back, Lokesh Kangaraj has tweeted that' Dilli Is Ging To Come Back'.

How is the response from the distributors?
- Distributors are very confident in this film right from the beginning. Their belief became true today as the film is getting superb response all-over. All area distributors are very happy about the result.

You produce films in your banner. What is the reason for releasing Tamil films too in your banner?
- I used to stay in abroad and I occasionally come here to look after the production works. We completely shifted to India last year. We are making a film on our banner. As we wanted to release good films in Telugu, we got this chance to release this film. I will continue to release good content-oriented films through my banner.

You released Suriya, Karthi's films in Telugu in your banner. Will you do straight films with them?
- Both of them are busy with their projects. I will definitely do films with them if I find good subject and apt director for it.

The audience also promoting 'Khaidi' film on their own. What do you say about it?
- Yes. There are a lot of strategies in advertising content. But, social media is the most powerful, popular media these days. We are promoting 'Khaidi' in all kinds of social media platforms so that it will reach more audiences in a quick time. It is also one of the main reasons for the success of our film.

All films with 'Khaidi' in the title became Hits.
- Yes, films titled 'Khaidi', 'Khaidi No 786', 'Khaidi No 150'... became big hits. 'Khaidi' is an apt title for this subject. Our entire team felt happy for attaining this title.

What is the progress of 'Orey Bujjigaa' film?
- We are currently producing 'Orey Bujjiga' starring Raj Tarun, Malavika Nair in Konda Vijaykumar's direction in our banner. 50% of the Shooting part has been completed. The entire shooting part will be completed by December. We will soon fix good release date.

Will you continue producing content-based films in Sri Sathya Sai Arts banner?
- Our 'Adhinetha' was made with a good message. 'Emaidi Ee Vela' also based on a contemporary issue. 'Bengal Tiger' and 'Pantham' were also message-oriented films. Cinema is a very big media. We can change at least 10% of the audience by making strong message oriented films. I will try to make suc films in my banner. We are developing some stories. 'We will begin our next film after the completion of 'Orey Bujjiga'.

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ - ''దీపావళి శుభసందర్భంగా రిలీజైన మా 'ఖైదీ' చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఇలాంటి ఒక డిఫరెంట్‌ సినిమాని యాక్సెప్ట్‌ చేసి ఎంతో నమ్మకంగా చేసిన హీరో కార్తిగారికి, అలాగే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రకాష్‌బాబు, ప్రభు, వివేక్‌లకు కృతజ్ఞతలు. ఒక సినిమా సక్సెస్‌ అయ్యి, మంచి రేటింగ్‌తో పాటు మంచి మౌత్‌ టాక్‌ ఉంటే ఆ సంతోషమే వేరు. 'బెంగాల్‌ టైగర్‌' తర్వాత ప్రేక్షకులు మాకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్‌ 'ఖైదీ'. ఈ సినిమాలో హీరోయిన్‌, పాటలు లేకపోయినా రెండు గంటల ఇరవై నిమిషాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్‌ చేసిన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ని అభినందిస్తున్నాను. తనకి ఇది రెండో సినిమా. ఫస్ట్‌ సినిమా 'నగరం' కూడా రాత్రి నేపథ్యంలోనే ఉంటుంది. మంచి హిట్‌ అయ్యింది. ఒక రాత్రి నాలుగు గంటల్లో జరిగే కథ అయినా చిత్రాన్ని స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు అడియన్స్‌లో క్యూరియాసిటీ కలిగించారు. 'ఖైదీ' సినిమాకి రివ్యూస్‌ చాలా గొప్పగా వచ్చాయి. ఈరోజు కలెక్షన్స్‌ ఇంకా పెరిగాయి. మా డిస్ట్రిబ్యూటర్స్‌ ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఈ దీపావళికి ప్రేక్షకులు మాకు ఇచ్చిన కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ 'ఖైదీ'.

ఈ కథ వినగానే మీకేమనిపించింది?
- కథ గురించి చెప్పాలంటే ఒక రాత్రి నాలుగు గంటల్లో జరిగే స్టోరి అని తెలుసు. ఒక డార్క్‌ నైట్‌ మూవీ అయినా.. హీరో, నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. లోకేష్‌ ఫస్ట్‌ మూవీ 'నగరం' మంచి సక్సెస్‌ అవ్వడం, 'ఖైదీ' తర్వాత హీరో విజయ్‌తో సినిమా చేస్తున్నాడంటే డైరెక్టర్‌లో కంటెంట్‌ ఉందని అర్థం. ఇవన్నీ చూస్తుంటే సినిమా డెఫినెట్‌గా వర్కవుట్‌ అవుతుందనిపించింది. అందులోనూ ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాల్ని కోరుకుంటున్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు వస్తే వాటిని ఆదరిస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నేను రిలీజ్‌ చేయడం జరిగింది.

సినిమా చూశాక మీరెలా ఫీలయ్యారు?
- నిన్న సాయంత్రం ఆర్‌కె కాంప్లెక్స్‌లో సినిమా చూశాను. చాలా సింపుల్‌ థ్రెడ్‌ అయినా మా దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. మేం ఊహించినదాని కన్నా ఇంకా 20 పర్సెంట్‌ బెటర్‌గా ఉంది. మల్టీప్లెక్స్‌ల్లోనూ ప్రేక్షకులు విజిల్స్‌ వేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా కుదరడం సినిమాకి చాలా ప్లస్‌ అయ్యింది.

సినిమా విడుదలయ్యాక కార్తి రియాక్షన్‌ ఏంటి?
- కార్తి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా, ఇలాంటి సినిమాలు రెండు గంటలే ఉండాలి. కానీ కథ మీద నమ్మకంతో 2 గంటల 20 నిమిషాలు ఉన్నా ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది అని చెప్పారు. కొద్దిసేపట్లో ఈ సినిమా సక్సెస్‌ని ఫేస్‌బుక్‌ ద్వారా ఆడియన్స్‌తో పంచుకోబోతున్నారు హీరో కార్తి.

తమిళనాడులో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- తమిళ్‌లో కూడా చాలా మంచి రెస్పాన్స్‌ ఉంది. ఆడియన్స్‌ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ కూడా పెద్ద సక్సెస్‌ అయ్యింది.

'ఖైదీ' సీక్వెల్‌ ఉంటుందా?
- మొన్న కార్తిగారిని కూడా ఇదే అడిగితే.. 'ఖైదీ' రిజల్ట్‌ని బట్టి సీక్వెల్‌ ఉంటుందా? లేదా! ప్లాన్‌ చేస్తాం అని చెప్పారు. అయితే ఇంతకుముందే లోకేష్‌ కనకరాజ్‌ ఢిల్లీ ఈజ్‌ గోయింగ్‌ టు కమ్‌ బ్యాక్‌ అని ట్వీట్‌ చేశారు అంటే అర్థం అయింది కదా.

డిస్ట్రిబ్యూటర్స్‌ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ఈ సినిమాపై ఫస్ట్‌ నుండి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వారి నమ్మకానికి తగ్గట్లే మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉన్నారు.

మీ బేనర్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు కదా! తమిళ్‌ సినిమాలు కూడా మీ బేనర్‌లో రిలీజ్‌ చేయడానికి రీజన్‌?
- నేను అబ్రాడ్‌లో ఉండేవాడిని. అప్పుడప్పుడు వచ్చి నిర్మాణ పనులు చూసుకొని వెళ్లేవాడ్ని. అయితే లాస్ట్‌ ఇయర్‌ ఇండియాకి షిఫ్ట్‌ అయ్యాం. మా బేనర్‌లో సినిమా జరుగుతుంది. అవకాశం ఉంటే తెలుగులో మంచి సినిమా రిలీజ్‌ చేద్దాం అని ఈ సినిమా రిలీజ్‌ చేశాం. మా బేనర్‌లో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు రిలీజ్‌ చేయడానికి ప్రయత్నిస్తాను.

సూర్య, కార్తి సినిమాలు తెలుగులో రిలీజ్‌ చేశారు కదా! వారితో స్ట్రెయిట్‌ సినిమా చేసే అవకాశం ఉందా?
- వారిద్దరూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మంచి సబ్జెక్ట్‌ ఉండి, దానికి తగ్గ డైరెక్టర్‌ దొరికితే డెఫినెట్‌గా చేస్తా.

ఆడియన్స్‌ కూడా 'ఖైదీ' సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు కదా?
- అవునండి. ఎడ్వర్‌టైజ్‌మెంట్‌లో చాలా రకాలున్నాయి. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా అన్నింటికన్నా పవర్‌ఫుల్‌, పాపులర్‌ అయింది. అందుకే మేం అన్ని రకాల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 'ఖైదీ' సినిమాని ప్రమోట్‌ చేస్తున్నాం. దానివల్ల ఆడియన్స్‌కి త్వరగా రీచ్‌ అవుతుంది. మా సినిమా సక్సెస్‌కి అది కూడా ఒక కారణం.

'ఖైదీ' పేరుతో వచ్చిన అన్ని సినిమాలు హిట్‌ అయ్యాయి కదా?
- 'ఖైదీ', 'ఖైదీ నెంబర్‌ 786, 'ఖైదీ నంబర్‌ 150' ఇలా.. ఖైదీ పేరుతో వచ్చిన అన్ని సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. అయితే ఈ టైటిల్‌ మాత్రం స్టోరి పరంగా అనుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కి కూడా 'ఖైదీ' యాప్ట్‌ టైటిల్‌. ఈ టైటిల్‌ దొరికినందుకు మా టీమ్‌ అంతా చాలా హ్యాపీ.

'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రం ప్రోగ్రెస్‌?
- మా బేనర్‌లో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా కొండా విజయ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒరేయ్‌ బుజ్జిగా' షూటింగ్‌ 50 పర్సెంట్‌ పూర్తయింది. డిసెంబర్‌ కల్లా సినిమా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అవుతుంది. మంచి డేట్‌ చూసుకొని రిలీజ్‌ చేస్తాం.

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో ఇలాంటి కంటెంట్‌ ఉన్న మూవీస్‌ని నిర్మిస్తారా?
- మీరు మా 'అధినేత' సినిమా చూస్తే మంచి మెసేజ్‌తో తెరకెక్కింది. అలాగే 'ఏమైంది ఈవేళ' కూడా ఒక కాంటెంపరరీ ఇష్యూ మీద తీసిన సినిమా. అలాగే 'బెంగాల్‌ టైగర్‌', 'పంతం' సినిమాలు కూడా మెసేజ్‌ ఒరియెంటెడే. సినిమా అనేది చాలా పెద్ద మీడియా. అందుకే మంచి సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తే ఒక టెన్‌ పర్సెంట్‌ ఆడియన్స్‌ అయినా ఛేంజ్‌ అవుతారు. అందుకే మా బేనర్‌లో అలాంటి చిత్రాలు నిర్మించడానికి ట్రై చేస్తాను. కొన్ని కథలు డెవలప్‌ చేస్తున్నాం. 'ఒరేయ్‌ బుజ్జిగా' పూర్తికాగానే మరో సినిమా ప్రారంభిస్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved