22 February -2021
Hyderabad
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న 'విరాటపర్వం'ను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు, రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, సంక్రాంతి పర్వదినాన రిలీజ్ చేసిన రానా-సాయిపల్లవి జంట పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇవన్నీ 'విరాటపర్వం'పై అంచనాలను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిపల్లవి జోడీ చూడచక్కగా ఉందని అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వచ్చాయి.
లేటెస్ట్‌గా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్‌కు సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 25న ఫస్ట్ సాంగ్ "కోలు కోలు" లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కాకతీయ తోరణం దగ్గర హీరోయిన్ సాయిపల్లవి డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గ్రీన్ కలర్ లంగా-జాకెట్టు, యెల్లో కలర్ వోణీతో సంప్రదాయ దుస్తుల్లో ఆమె చూడముచ్చటగా ఉన్నారు. "కోలు కోలు" పాటను సినిమాలో ఆమెపైనే దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరించారు.
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సమర్పణ: సురేష్ బాబు
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి. సినిమాస్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర
కొరియోగ్రఫీ: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి
పీఆర్వో: వంశీ-శేఖర్.