pizza
Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments’ Konda Polam Awarded With Clean U Certificate
You are at idlebrain.com > news today >
Follow Us

01 October 2021
Hyderabad


Expectations are quite high on Mega sensation Vaisshnav Tej’s second film Konda Polam, since his first film Uppena was a blockbuster and this spectacular action adventurous movie is directed by creative director Krish with gorgeous diva Rakul Preet Singh playing the female lead and popular production house First Frame Entertainments is producing it.

Promotions are also happening in full swing for the film ahead of its release and trailer as well as songs got optimistic response. Konda Polam has completed all the formalities, including censor and the movie is awarded with clean U certificate. Censor officials have appreciated the makers and have recommended no cuts. The final duration of the movie is 2:15 hours and it’s a perfect runtime.

Konda Polam is now all set for a grand release worldwide on 8th of this month. Both Vaisshnav Tej and Rakul Preet Singh played their parts exceptionally well, while director Krish made the movie as a commercial entertainer. Gnana Shekar VS’s top-notch camera work and MM Keeravani’s magical music are other big assets of the film.

Konda Polam’s audio launch event will take place tomorrow at Kurnool Convention Centre, Santhosh Nagar Colony in Kurnool. The event begins from 5 PM onwards.

Adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy, Konda Polam is produced by Saibabu Jagarlamudi, Rajeev Reddy and is presented by Bibo Srinivas.

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, క్రిష్ మ‌రియు ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొండ‌పొలం సెన్సార్ పూర్తి...క్లీన్ యు స‌ర్టిఫికేట్‌

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత  మెగాసెన్సేష‌న్  వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న
రెండవ చిత్రం `కొండపొలం` పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ చిత్రానికి  క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీంతో  ప్రమోషన్స్  ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయి. తాజాగా కొండ‌పొలం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ మూవీకి సెన్సారు వారు ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో పాటు సినిమా చూసి మేకర్స్ ను ప్రశంసించారు. కొండ‌పొలం  2:15గంట‌ల ప‌ర్‌ఫెక్ట్ ర‌న్‌టైమ్‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్  మ‌రియు  'ఓబులమ్మ' 'శ్వాసలో' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండ పొలం' నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది.

కర్నూలులోని సంతోష్ నగర్ కాలనీలోని `కర్నూలు కన్వెన్షన్ సెంటర్` లో రేపు కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుండి ప్రారంభమవుతుంది.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

సాంకేతిక బృందం

దర్శకుడు:  క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్
కథ : సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి
ఎడిటర్ : శ్రావన్ కటికనేని
ఆర్ట్ : రాజ్ కుమార్ గిబ్సన్
కాస్టూమ్స్ : ఐశ్వర్యా రాజీవ్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో : వంశీ-శేఖర్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved