pizza
Krack Bhoom Baddal song launched
ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రం 'క్రాక్‌'లో 'భూమ్ బ‌ద్ద‌ల్' లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

13 November -2020
Hyderabad

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'క్రాక్' సినిమా టాకీ పార్ట్ పూర్త‌యింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాట‌ను త్వ‌ర‌లో చిత్రీక‌రించ‌నున్నారు.

దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం 'భూమ్ బ‌ద్ద‌ల్' లిరికల్ వీడియో సాంగ్‌ను నేడు విడుదల చేసింది. ర‌వితేజ‌, అప్స‌రా రాణిపై ఐట‌మ్ నంబ‌ర్‌గా దీన్ని చిత్రీక‌రించారు.

అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ మాస్ అప్పీలింగ్ సాంగ్‌ను అందించారు. మంచి రిథ‌మ్‌తో జోరుగా సాగే లైన్ల‌తో రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా, మాస్ బీట్స్‌కు త‌గ్గ‌ట్లు సింగ‌ర్స్‌ సింహా, మంగ్లీ హుషారుగా, మంచి ఎన‌ర్జీతో ఈ పాట‌ను ఆల‌పించారు.

టెర్రిఫిక్ డాన్స‌ర్ అయిన ర‌వితేజ విజిల్స్ వేసే విధంగా డాన్స్ చేయ‌గా, అప్స‌రా రాణి అందాలు క‌నువిందు చేసే రీతిలో ఉన్నాయి. ఈ పాట‌కు జాని మాస్ట‌ర్ సూప‌ర్బ్ కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర్చారు.

శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని తీర్చిదిద్దుతున్నారు. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించే అంశాలు ఈ మూవీలో ఉంటాయి.

పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు.

స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న 'క్రాక్' చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం ఎస్సెట్ కానున్న‌ది. 'మెర్సాల్‌', 'బిగిల్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి.

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

 

 


 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved