pizza
Kranthi Madhav to direct Sunil
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నూతన చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

23 March 2016
Hyderaba
d

స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని... కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో... సునీల్ కథానాయకుడిగా నటించబోతున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. సునీల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించబోయే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పని లో ఉన్నారు. ఈ సందర్భంగా

హీరో సునీల్ మాట్లాడుతూ... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం నాకు నచ్చిన మంచి చిత్రాల్లో ఒకటి. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ మరో మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. అన్ని వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని క్రాంతి మాధవ్ కథను తయారు చేశారు. నా క్యారెక్టరేజేషన్ ను విభిన్నంగా మలిచారు. భారీ చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.

నిర్మాత మాట్లాడుతూ... సునీల్ గారి పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యారెక్టర్ ను ప్రేమిస్తే ఎంతగా కష్టపడతారో మనందరికీ తెలిసిందే. చాలా రోజులుగా ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. క్రాంతి మాధవ్ గారు చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉంది. సునీల్ గారికి కరెక్ట్ కథ ఇది. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చి దిద్దారు. పూర్తి కమర్షియల్ వాల్యూస్ ఈ కథలో ఉన్నాయి. అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే
తెలియజేస్తాం. అని అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved