pizza
Krishna, Vijaya Nirmala, Mahesh Babu condolence to Jayalalitha
You are at idlebrain.com > news today >
Follow Us

6 December 2016
Hyderaba
d

తేనెమనసులు, కన్నెమనసులు చిత్రాల తర్వాత నా మూడో చిత్రం గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. హండ్రెడ్‌ డేస్‌ ఆడి నా కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అవ్వడానికి ఆమె గ్లామర్‌ కూడా ఒక కారణం. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె నటించారు. ఆ సినిమా కూడా హండ్రెడ్‌ డేస్‌ ఆడింది. అలాగే మేం సొంతంగా నిర్మించిన సినిమా దేవుడు చేసిన మనుషులు చిత్రంలో రామారావుగారి పక్కన ఆమె హీరోయిన్‌గా నటించింది. అది కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి రాజ్యసభ సభ్యురాలయ్యారు. ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తమిళనాడు ప్రజలు ఆమెను ఎంతో అభిమానంతో అమ్మా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేదలకు హెల్ప్‌ చేసే మంచి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో ఎప్పుడూ ఒక పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్‌ట్‌ ఎలక్షన్స్‌లో మరో పార్టీ అధికారంలోకి వచ్చేది. అలా కాకుండా లాస్ట్‌ టైమ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికై తర్వాతి ఎలక్షన్స్‌లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం తమిళనాడులో చాలా అరుదైన విషయం. ప్రజల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం తమిళనాడు ప్రజలకి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

- సూపర్‌స్టార్‌ కృష్ణ

జయలలితగారు చనిపోవడం అందర్నీ బాధించే విషయం. ఎందుకంటే ఒక మహిళగా ఎంత అపొజిషన్‌ వున్నప్పటికీ ఎంతో ధైర్యంగా నిలబడి తమిళనాడుని పరిపాలించారు. నిరుపేదలు కంటతడి పెట్టకూడదని వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఆమె చనిపోయిందన్న వార్త తెలిసిన తర్వాత అభిమానుల కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. వార్త విన్న వెంటనే నలుగురు హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. అంత మంచి అభిమానం సంపాదించుకున్నారు జయలలితగారు. ఇందిరాగాంధీగారి తర్వాత మళ్ళీ అంతటి పవర్‌ఫుల్‌ లీడర్‌. మహిళా లోకానికి జయలలితగారు గర్వకారణం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

- శ్రీమతి విజయనిర్మల

జయలలితగారు చనిపోయారన్న వార్త తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబ సభ్యులు, తమిళనాడు ప్రజలు ఇంతటి విషాదాన్ని తట్టుకునే మాససిక స్థైర్యం కలిగి వుండాలని కోరుకుంటున్నాను.

- సూపర్‌స్టార్‌ మహేష్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved