pizza
Krishnagaadi Veera Premagaadha release on 12 February
వరల్డ్ వైడ్ గా ఫిభ్రవరి 12న విడుదలవుతున్న ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’
You are at idlebrain.com > news today >
Follow Us

30 January 2016
Hyderaba
d

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ‘అందాల రాక్షసి’ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిభ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘’ మా బ్యానర్ నుండి వస్తున్న కృష్ణగాడి వీర ప్రేమగాథ, సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, థిమాటిక్ టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ గారు మా ఆడియో వేడుకకు వచ్చి చిత్రయూనిట్ ను అభినందించి ఆడియో విడుదల చాలా చేసినందుకు ఆయనకు మా కృత‌జ్ఞ‌త‌లు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది.కృష్ణగా నాని, మహాలక్ష్మిగా మెహరీన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది.అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అవుతుంది.అంతా ఒక టీంగా సిన్సియర్, డేడికేషన్ తో వర్క్ చేశాం. హనురాఘవపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్లో ఫిభ్రవరి 12న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్్ Sri Pratham, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, maatalu..స్క్రీన్ ప్లే,దర్శకత్వం: హను రాఘవపూడి.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved